New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
జ్వాల W/O శక్తి – 11

జ్వాల W/O శక్తి – 11

జేఎస్ కార్పొరేషన్ ఆఫీస్ లో ప్రసాద్ ను అవమానించి బయటకు పంపించిన తర్వాత గాని జ్వాల మనసులో ప్రశాంతత   అనేది లేదు. శక్తి లేని ఆ చైర్మన్ సీటు, ఆ క్యాబిన్ ఆమెను  వెక్కిరిస్తున్నట్టు ఉన్నాయి. గోడకు ఉన్న శక్తి ఫోటో వైపు చూస్తూ జ్వాల కన్నీళ్లు పెట్టుకుంది. “శక్తి.. ఈ ఐదేళ్లూ నన్ను మానసికంగా చంపినా నీకోసం భరించాను. కానీ నా ప్రపంచమైన నిన్నే నా నుండి దూరం చేశారు. నిన్ను చంపిన ఆ రాక్షసులను అంతం చేసే వరకు ఈ జ్వాల  నిద్ర పోదు,ఆ రాక్షసులనీ నిద్ర పోనివ్వదు అని మనసులోనే అనుకుంది.

 

సరిగ్గా అదే సమయంలో విక్రమ్  జ్వాల ఉన్న       క్యాబిన్ లోకి ప్రవేశించాడు. అతని చేతిలో రుద్రప్ప, ప్రసాద్ ల కదలికలకు సంబంధించిన అన్ని విషయాలు , వివరాలు ,పూర్తి లొకేషన్ మ్యాప్  తో సహా ఉంది. “మేడమ్.. పోలీసులు రుద్రప్ప మైనింగ్ అడ్డా పై దాడి చేయడంతో వాడు, ప్రసాద్ ఇద్దరూ అండర్ గ్రౌండ్ లోకి వెళ్ళిపోయారు. నగరం దాటి పారిపోవడానికి కూడా చూస్తున్నారు. ప్రసాద్ తన భార్య ప్రమీలను, తల్లి కనకమ్మను కూడా తీసుకుని ఒక రహస్య సేఫ్  ప్లేస్ లో ఉన్న హౌస్ కు చేరుకున్నాడు. ఈ రాత్రికి వాళ్ళు సముద్ర మార్గం ద్వారా దేశం దాటడానికి ఒక ఇల్లీగల్ బోట్ సిద్ధం చేసుకున్నారు అని విక్రమ్ వివరించాడు.దానికి సంబంధించిన వివరాలు అన్ని ఇందులో ఉన్నాయి అని ఒక కవర్ ఇస్తాడు.

 

 

జ్వాల సీటు నుండి  విసురుగా   లేచింది. ఆమె కళ్లల్లో కసి కోపం స్పష్టంగా కనిపిస్తోంది. “విక్రమ్.. వాళ్లు  ఈ దేశం దాటితే చట్టం వాళ్లను ఏమీ చేయలేదు. నా భర్తను టైమర్ బాంబుతో సజీవ దహనం చేసినప్పుడు నా శక్తి ఎంత నరకం అనుభవించాడో.. ఆ నరకాన్ని వాళ్లకు రెండింతల నరకం బతికుండగానే చూపించాలి. మన టీమ్‌ను సిద్ధం చేయి. ఈ రాత్రికి ఆ ద్రోహుల పాపానికి ముగింపు పలకాలి” అని ఆర్డర్ ఇచ్చింది.

 

నగర శివార్లలోని సముద్ర తీరానికి దగ్గరగా ఉన్న ఒక పాడుబడిన పెంకుటిల్లు అది. చుట్టూ మనుషులు ఎవరూ లేరు. లోపల ప్రసాద్ భయంతో అటు ఇటు తిరుగుతున్నాడు. కనకమ్మ ఒక మూలన కూర్చుని ఏడుస్తుంటే, ప్రమీల నగలను, డబ్బును బ్యాగుల్లో సర్దుతోంది.

రుద్రప్ప తన గన్‌తో కిటికీ గుండా బయటకు చూస్తూ, “ప్రసాద్.. నీ వల్ల నా మొత్తం సామ్రాజ్యం నాశనమైంది. ఆ పోలీస్ ఆఫీసర్  గాడు మొత్తం  నా అడ్డాలన్నింటినీ సీజ్ చేశాడు. ఆ ముత్యం గాడు పోలీసులకు దొరికిపోయి మన పేరు చెప్పేసాడు. ఇంక   ఇప్పుడు మనకున్న ఒకే ఒక్క దారి ఈ సిటీ దాటడం. అది కూడా సముద్ర మార్గం ద్వారా.బోట్ ఇంకో గంటలో వస్తుంది. ఈ లోగా ఆ జ్వాల గానీ, ఆ విక్రమ్ గానీ మనల్ని గుర్తిస్తే ప్రాణాలతో మిగలము” అని హెచ్చరించాడు.

ప్రసాద్ కసితో పళ్లు కొరికాడు. “అంతా ఆ శక్తి రాసిన విల్ వల్లే జరిగింది రుద్రప్ప. వాడు చచ్చినా మనకు ఆస్తి దక్కకుండా చేశాడు. ఆ జ్వాల అంత ధైర్యంగా ఆఫీస్ లోకి వస్తుందని నేను ఊహించలేదు. వాడు కాలి బూడిదైనట్టే.. ఆ జ్వాలను కూడా బూడిద చేయాల్సింది” అని గర్జించాడు.

 

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue