ప్రియా తన చైర్ లో కూర్చుంటూ నీతో ఐదు నిమిషాలు మాట్లాడాలి వచ్చి కూర్చుంటావా అని తను కూడా ఎక్కడ తగ్గకుండా బేస్ వాయిస్ తో చెప్పింది.
చూడు నువ్వేం చెప్పాలనుకుంటున్నావో నాకు తెలుసు తనని ఫోర్స్ చేసింది నేనే అని ప్రియా ముఖంపైనే రుద్ర చెప్పేసరికి ప్రియా షాకే బట్ నువ్వు తనని ఫోర్స్ చేసావా అని మరింత షాక్ అయి అడిగింది.
అది అంత నీకు అనవసరం అని ఆరాధ్య చేతులు పట్టుకుని బయటికి తీసుకుని వెళ్ళాడు….!
మెడిసిన్ కౌంటర్ దగ్గరికి వెళ్లి ప్రియా చెప్పిన మెడిసిన్ తీసుకొని ఆరాధ్య చేతులు పట్టుకొని బయటకు నడిచాడు.
అక్కడే ఉన్న క్యాంటీన్ లోకి తీసుకొని వెళ్లి ఆర్యాదాకి తనకి ఫుడ్ ఆర్డర్ చేసి ఆరాధ్య ఫేస్ వైపు చూస్తూ నువ్వు ఏం చదువుకున్నావ్ అని అడిగాడు.
అప్పటివరకు ఆరాధ్య రుద్ర ఏం చేస్తున్నా సైలెంట్ గా తనని ఫాలో అవుతూ ఉంది ఇప్పుడు తనని ఏం చదువు కున్నావ్ అని అడిగేసరికి