కట్ అయిపోయిన ఫోన్ వైపు చూస్తూ ఇప్పుడేందుకే కొడుకు దూరంగా ఉన్నాడని బాధపడతావ్… నేను నీ మొగుడు ఎంత చెప్పినా నువ్వు మీ మామగారు మా మాట విన్నారా…. వాడికి నచ్చింది చెయ్యనివ్వండి అని నీతులు చెప్పారు కదా… వాడికి నచ్చినట్టు వదిలేస్తే ఇలాగే ఉంటుందని వెటకారంగా అన్న అత్తగారి వైపు కోపంగా చూస్తుంది కావేరి…
నిజాలు చెప్తే కోపంగా ఉందా నీకు? పిల్లలని మన చేతి కింద ఉన్నప్పుడే కట్టడి చేసుకోవాలి…. లేదనుకో ఇలాగే మాట వినకుండా తయారవుతారని వెటకారంగా చెప్పింది ఆవిడ….
మరి మీ కొడుకుని మీరెందుకు కట్టడి చేసుకోలేకపోయారని కావేరి వెటకారంగా అడగడంతో కాఫీ తాగుతున్న పెద్దావిడ కోడలిని కోపంగా చూస్తూ నా కొడుకు కట్టడి లేకుండా ఏం చేస్తున్నాడు…. నీ కొడుక్కి పిన్నిని తీసుకొచ్చి పెట్టాడా? లేకపోతే నీ కొడుక్కి తమ్ముడిని తీసుకొచ్చి పెట్టాడా? అంది….
నువ్వు ఎప్పుడు గనుక నోరు మూసుకోకపోతే నీ కొడుక్కి నేను పిన్నిని తీసుకొచ్చి పెడతాను అంటూ పెద్దాయన లోపలికి రావడంతో పెద్దావిడ కోపంగా ఆయన వైపు చూసేసరికి కావేరి నవ్వు ఆపుకోవడానికి ట్రై చేసింది…..
కోడలి ముందు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతారు ఏంటని ఆవిడ కోపంగా అడగడంతో మరి కోడలితో నువ్వెందుకు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నావ్? వాడేమి దారి తప్పిపోయి దూరంగా ఉండడం లేదు… నీ కొడుకు తిక్క మాటలు, మూర్ఖత్వం చూసి చూసి వాడికి విసుగు వచ్చేసింది…. అందరూ వాడి కాళ్ళ కింద బ్రతకాలి అంటాడు…. ఒకడి కాళ్ళ కింద బ్రతకడం ఎవడికి నచ్చదు…. అది కన్నా కొడుక్కి అయినా సరే అన్నాడు ఆయన…..
దాంతో ఆవిడ మౌనంగా ఉండడంతో ఆయన కోడలు వైపు చూసి మీ అత్తయ్య మీ ఆయన మాటలు వింటే ఉన్న మతిభవిస్తుంది మనకి….. నువ్వు అవేమీ పట్టించుకోకు తల్లి…. నీకు అంతగా వాడిని చూడాలని ఉంటే ఎక్కడుంటున్నాడో కనుక్కో… చూడాలనిపించినప్పుడు డ్రైవర్ని తీసుకొని వెళ్ళిపో అని చెప్పాడు….