New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
నా రాక్షసి వే – 2

నా రాక్షసి వే – 2

               🌸🕊️  నా రాక్షసి వె -2 🕊️🌸 
సూర్యుని తొలిపొద్దు కిరణాలు కిటికీ నుండి నేరుగా తన ముద్ద బంతి లాంటి మోముపై తాకుతుండగా  మరో వైపు తిరిగి పడుకుంటుంది ఒ ముగ్ధ మనోహరి..
  తన  కలల ప్రపంచం లో తనకోసం వస్తున్న తన రాకుమారిడిని వెతుకుతుంది ఆమె..
తనతో దోబుచులాడుతున్న అతను తను అలా పట్టుకునే లోపే ఇలా మాయం అవతున్నాడు ….. 
నిద్రలోనే ప్చ్ అంటూ అంటూ విసుకుంటున్న ఆమెకి..
అప్పుడే ఒసేయ్ రాక్షసి లేవవే ఇవాళ ఎంత ముఖ్యమైన రోజు.. ఈ రోజు కూడా ఇంత సేపటి వరకు నిద్ర పోతున్నావ్.. 
అసలు ఆడపిల్లలా లక్షణాలు ఒకటి అయినా ఉన్నాయా  లేవవే రాక్షసి ….
అటు చుటూ ఆని బంగారం చూడు ఎప్పుడో రెడీ కూడా అయిపోయి మీ అత్తకి  ఎలా సాయం  చేస్తుందో ….నువ్వు వున్నావ్ అని కసురుతూ.. 
లేవవే బ్రహ్మారాక్షసి లేవు ఏంటి ఈ మొద్దు నిద్రలే అంటూ అరుస్తున్నా..
తన మాతా శ్రీ  యొక్క ఉషోదయపు సుప్రభాతం  నుండి తప్పించుకోవడానికి తన ఆయుధం  ఐనా తన అత్తని పిలుస్తుంది.. మృదుల మంజరి
అత్త  అత్త నా పాలిట ధర్మ దేవత నన్ను రక్షించ రావా…   అంటూ   డ్రామాటిక్ గా పిలుస్తున్నా..
ఆ సుందరాంగి పిలుపుకి నవ్వుకుంటూ వస్తుంది తన మేనత్త  …   అనురాధ..
అనురాధ గారు..  ముద్దు గుమ్మా తల్లి గారిని చూస్తూ.. అయ్యో వదిన ఎందుకు నా కన్నమ్మని ఇలా తిడుతున్నావ్..
ఇంకా టైమ్ వుంది కదా ఈలోపు త్వరగా రెడీ అవుతుంది లే నా కన్నమ్మ..   నువ్వు వెళ్లి మిగిలిన పనులు చూడు వెళ్ళు అంటూనే …..
హ మర్చిపొయ నీ ఆని బంగారంకి హాఫ్ సారీ కట్టుకోవడం రావట్లేదంట వెళ్లి నీ కాబోయే కోడలికి హెల్ప్ అంటా చేయ్ పో  వెళ్ళు అంటూ నవ్వును ఆపుకుంటూ చెప్తుంది…..
అది చూసిన ఆ ముద్దు గుమ్మా వాహ్ అత్త!  ఆని బేబీ ఇంకా రెడీ అవ్వలేదా   అని అంటూ..
తన తల్లి వైపు చూస్తూ.. ప్చ్ మతా శ్రీ చూసావా నీ కోడలు ఇంకా రెడీ అవ్వలేదట పో పోయి ముందు నీ కోడలికి హెల్ప్ చేయిపో..
నాకు నా అత్త బంగారం హెల్ప్ చేస్తుంది… అని చెప్తుంది ముద్దుగా అనురాధ గారి భుజాల మీద వాలిపోతు..
వాళ్ళిద్దరి వంక చూసిన మాత శ్రీ.. సాగుతుంది మీకు అలాగా అని అంటూ తన కోడలి కోసం వెళ్లగా..
అనురాధ గారు  కన్నమ్మ నువ్వు త్వరగా రెడీ అవ్వరా.  ఈ రొజు  తలస్నానం చేయాలి  కదా.. అని అంటూ..
ఇదిగో ఇక్కడ నీకోసం లంగా వోణి పెడుతున్న నువ్వు  వెళ్లి  ఫ్రెషప్ అయి రా..  ఈలోపు నేను నీకు  కావలిసినవి అన్ని తీసి పెడ్తా.. అని అనడం తో..
అలాగే డార్లింగ్  ఇలా వెళ్లి ఆలా  వచ్చేస్తా ఉమ్మా  అంటూ  అనురాధ గారి బుగ్గ కి ఒక స్వీట్ చిక్ కిస్  ఇచ్చి  ఫ్రెషప్ అవ్వడానికి  వాష్రూమ్ లోకి వెళ్తుంది తను…..
అరగంట తరువాత హెడ్బత్ చేసి బాత్ రోబ్ వేసుకొని హెయిర్ నీ టవల్ లో టై చేసుకుంటూ  బెడ్ పైన వున్న హాఫ్ వైట్ అండ్ రెడ్ కాంబినేషన్ లో వున్న లంగావోణినీ చూస్తుంది..
ఒక క్షణం దానివంక చుసిన ఆమె.. లంగావోణి లో రెడీ అయ్యి అత్తగారు ఇచ్చిన ఓర్నమెంట్స్ ( లక్ష్మి హారమ్ జుంకా ఇంక హిప్ బెల్ట్  గాజులు కూడా వేసుకొని )  వేసుకొని సింపుల్ అండ్  ఎలాగంట్ లుక్ లో రెడీ అవుతుంది..
హెయిర్ ఫ్రెష్ బ్రెయిడ్ వేసుకొని సన్నాజజులని జాడ చుట్టూ  పెట్టుకొని..   అత్త అత్త అంటూ హాల్ లో వున్న తన అత్త దగ్గరికి వెళ్తువుంది…….
అప్పుడే అక్కడే హాల్ లో వున్న ఆని బేబీ సీగ్రీన్ అండ్ రెడ్ కాంబిన్షన్ లో లంగావోణి వేసుకొని  తన లానే సింపుల్ లుక్ లో రెడీ అయి ఉంటుంది 
తనని చూడగానే ఆని బేబీ.. ఓహ్ బేబీ యూ లూకింగ్ గార్జియోస్  అంటూ ముందుకు వచ్చి హాగ్   చేసుకుంటుంది..
తను కూడా ఆని బేబీని తిరిగి హత్తుకుంటూ..యూ అర్ అల్సొ అమేజింగ్ బేబీ అని అంటూ..
చెవిలో చిన్నగా యూ ఆర్ లూకింగ్ హాట్ బెబ్ నా అన్న నిన్ను ఇలా చూస్తే అలా ఫ్లాట్ ఐపోతాడు అంటూ కన్ను కొడుతుంది…
అని సిగ్గు పడుతూ పో బేబీ నువ్వు  ఇలా టీజ్ చేస్తే నేను నీతో మాట్లాడాను అంటూ బుంగమూతి పెడుతుంది…..
మూతి ముడిచిన ఆని నీ ఇంకా కవ్విస్తూ.. ఓహ్ వదిన డార్లింగ్  ఎంత ముద్దుగా ఉన్నావో నిన్ను  చూస్తే నేనే ఆగలేకపోతున్న.. ఇంకా నా అన్నగారు ఎలా ఆగుతారో ఏంటో అంటూ దూరంగా పరిగెడుతుంది….
దూరంగా పరిగెడుతున్న ఆమెని వెంబడిస్తూన్నా ఆని  కూడా అగు బేబీ ఈ రోజు నా చేతుల్లో అయిపోయావ్ నువ్వు.. ఈ రోజు ఒక్కసారి నా చేతికిచిక్కి చూడు అంటూ ఇద్దరు కలిసి ఆ హల్ అంతా పరుగు పెడుతున్నారు  
వాళ్ళ కాలి అందెల సవ్వడి.. అరుపుల గోలతో ఇల్లు అంత హడావిడి గా మారగా  వాళ్ళిద్దరినే నవ్వుతు చూస్తున్నారు వాళ్ళ పేరెంట్స్…..
అప్పుడే కన్నమ్మ  ఇక చాలు అమ్మ టైం అవుతుంది త్వరగా రండి అంటూ పిలుస్తారు ఆని వాళ్ళ నాన్న…..
మన ముద్దుగుమ్మ ఓకే మామా వస్తున్నాం అంటూ.. వాళ్ళ అల్లరిని ఆపి బయలుదేరుతారు….
ముద్దుగుమ్మ, ఆని ఇంకా ఆని వాళ్ళ నాన్న ఒక కార్ లో అండ్ ముద్దుగుమ్మ వాళ్ళ నాన్న అమ్మ ఇంకా తన అత్త బంగారం ఒక కార్ లో బయలుదేరుతారు శివాలయం కి 
తను ఇంకా అని చేతులా మీదుగా రుద్రాభిషేకం చేయించడానికి……!!
* * * * * * * * * * * * * * * * * * * * * * * * 
𝚃𝚘 𝚋𝚎 𝚌𝚘𝚗𝚝𝚒𝚗𝚞𝚎𝚍…🌸 🕊️