New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
నా రాక్షసి వే – 3

నా రాక్షసి వే – 3

🌸 🕊️   నా రాక్షసి వే –  3 🌸 🕊️

రాయల్ బ్లూ సూట్ లో మన హీరో.. అండ్ గ్రే కలర్ సూట్ లో కార్తీ రెడీ అయి బ్రేక్ఫాస్ట్ కూడా ఫినిష్ చేసుకొని ..
వాళ్ళ అసిస్టెంట్ రఘుతో పాటు బ్లాక్  వేగన్ కార్ లో ఫంక్షన్ వెన్యూకి స్టార్ట్ అవుతారు ..
వెన్యూకి రిచ్ అయినా తరువాత.. 
రఘు  ముందుగా కార్ దిగి డోర్ ఓపెన్ చేయగా రాయల్ బ్లూ సూట్ లో రాయల్ ఎంట్రీ ఇస్తాడూ మన హీరో గారు ..
ఆ వెనుకే కార్తీ కూడా అతనకి  ఏమాత్రం తగ్గకుండా హుందాగా హీరోతో పాటు ఎంట్రీ ఇస్తాడు..
ప్రదేశం:బిజినెస్ మేన్స్ అవార్డ్ ఫంక్షన్ 
(గ్రాండ్ అండ్ లావిష్ ఆడిటోరియం)
ఆ ఆడిటోరియం హాల్ మొత్తం డే-లైట్ థీమ్ ప్రొఫెషనల్ లైటింగ్‌తో బ్రైట్‌గా ఉంది..
దేశంలోని టాప్ బిజినెస్ లీడర్స్, మీడియా ప్రతినిధులు కోట్లు, సూట్లలో క్లాస్‌గా కూర్చుని ఉండగా..
అందరిని ఫోకస్ చేస్తూ కెమెరా ఫ్లాష్ లైట్లు నిరంతరం మెరుస్తూనే ఉన్నాయి..
స్టేజ్ వెనుక ఉన్న డిజిటల్ స్క్రీన్‌పై “బిజినెస్ మేన్స్ అవార్డ్ ఫంక్షన్ ” అని స్క్రోల్ అవుతోంది..
లైవ్ టెలికాస్ట్ అవుతుండటంతో వాతావరణం చాలా ప్రొఫెషనల్‌గా, ఎనర్జిటిక్‌గా ఉంది..
ఎనర్జిటిక్ అండ్ ప్రొఫెషనల్ వాయిస్‌తో అక్కడికి వచ్చిన హోస్ట్..
వెరీ గుడ్ మార్నింగ్ లేడీస్ అండ్ జెంటిల్‌మెన్! వెల్కమ్ టు ది ప్రెస్టిజియస్’బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డ్స్’ కి మీ అందరికీ వార్మ్ వెల్కమ్!
​ఈ బ్యూటిఫుల్ అండ్ బ్రైట్ మార్నింగ్… ఇండియన్ బిజినెస్ వరల్డ్‌ని రూల్ చేస్తున్న బిగ్గెస్ట్ టైకూన్స్‌ అందరినీ ఒకే రూఫ్ కిందకి తీసుకురావడం మాకు దక్కిన బిగ్గెస్ట్ ఆనర్!
​నౌ, ఇట్స్ టైమ్ ఫర్ ది మోస్ట్ ఎవైటెడ్ మూమెంట్ ఆఫ్ ది డే…
ఈ ప్రెస్టిజియస్ అవార్డ్‌ని ప్రెసెంట్ చేయడానికి,మన దేశ ఆర్థిక వ్యవస్థను శాసిస్తూ, 
ఎందరో యువ వ్యాపారవేత్తలకు రోల్ మోడల్‌గా నిలిచిన వ్యక్తి చేతుల మీదుగా ఈ అవార్డును ప్రెజెంట్ చేయబోతున్నాం..
​ లెట్ అస్ ఇన్వైట్  ది లెజెండ్ హిమ్‌సెల్ఫ్…ది ఐకాన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ అండ్  ‘ది D గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్’ చైర్మన్ అండ్ నంబర్ వన్ బిజినెస్ మెన్ ఇన్ ఇండియా… మిస్టర్ శర్మ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం..
ప్లీజ్ వెల్కమ్ సర్! అని హోస్ట్ అనౌన్స్ చేయడం తో..
ఆ ఆడిటోరియం హాల్ మొత్తం గౌరవపూర్వకమైన చప్పట్లతో మారుమోగుతుండగా..
మిస్టర్ శర్మ తన సిగ్నేచర్ రాయల్ సూట్‌లో గంభీరంగా నడుచుకుంటూ స్టేజ్ పైకి వస్తారు..
​థ్యాంక్యూ సో మచ్ శర్మ గారు ఫర్ బీయింగ్ హియర్! అంటూ హోస్ట్ మైక్ నీ శర్మ గారికి ఇవ్వాగా..
మిస్టర్ శర్మ: (మైక్ అందుకుని, హుందాగా)థాంక్యూ.. అని హోస్ట్ కి చెపుతూ..
గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్.. వ్యాపారంలో అనుభవంతో పాటు.. వేగం, కొత్త ఆలోచనలు చాలా ముఖ్యం..
ఈ రోజు నేను ఇవ్వబోయే అవార్డు అలాంటి ఒక అగ్రెసివ్ మైండ్‌సెట్ ఉన్న లీడర్‌కే దక్కుతోంది..
ఇక ఇప్పుడు… తన పవర్ ఫుల్ విజన్ అండ్ అన్‌స్టాపబుల్ డ్రైవ్‌తో పారిశ్రామిక ప్రపంచంలో గేమ్ ఛేంజర్‌గా మారి,
యంగ్ జనరేషన్‌కి బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్‌గా నిలిచిన ‘ది యంగ్ బిజినెస్ టైకూన్ ఆఫ్ ది ఇయర్’ అవార్డ్ విన్నర్ ఎవరో అనౌన్స్ చేసే మూమెంట్ వచ్చింది…అంటూ 
“ది యంగ్ బిజినెస్ టైకూన్ ఆఫ్ ది ఇయర్”అండ్ ది అవార్డ్ గోస్ టు… 
చాలా తక్కువ సమయంలో కార్పొరేట్ వరల్డ్‌లో తనకంటూ ఒక సామ్రాజ్యాన్ని సృష్టించుకున్న లీడర్..
‘AK గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్’ అధినేత…
మిస్టర్ అభినవ్ దేవ్!
అని అనౌన్స్ చేయడం తో..
స్క్రీన్‌పై అభినవ్ దేవ్ కంపెనీ ప్రొఫైల్,  ప్రొఫెషనల్ ఫోటో ప్లే అవుతాయి. హాల్‌లోని కెమెరా లెన్స్‌లన్నీ అభినవ్ వైపు తిరుగుతాగా..
హోస్ట్.. గట్టిగా లేడీస్ అండ్ జెంటిల్మెన్, గివ్ ఇట్ అప్ ఫర్ ది విజనరీ లీడర్ ఫ్రమ్ ‘AK గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్’… మిస్టర్ అభినవ్ దేవ్!
​ప్లీజ్ జాయిన్ అస్ ఆన్ స్టేజ్ మిస్టర్ అభినవ్!” అంటూ అభినవ్ దేవ్ నీ స్టేజ్ మీదకు ఇన్వైట్ చేస్తాడు 
తన పేరు వినిపించిన మరుక్షణం  కార్తీవైపు  చూసిన  దేవ్.. కార్తి చిరు నవ్వుతో గో బావ అని అనడం తో..
అల్ట్రా-స్టైలిష్‌గా, ముఖంలో ఆటిట్యూడ్‌తో కూడిన రాయల్ వాక్‌తో స్టేజ్ పైకి ఎంట్రీ ఇస్తాడు అభినవ్ దేవ్..
హాల్‌లోని బిజినెస్ దిగ్గజాలు సైతం లేచి నిలబడి చప్పట్లు కొడతున్న తరుణం లో..
మిస్టర్ శర్మ.. అభినవ్ దేవ్ కి షేక్ హ్యాండ్ ఇస్తూ అవార్డు ప్రెసెంట్ చేసి..
“కంగ్రాచ్యులేషన్స్ మై బాయ్! 
జస్ట్ వన్ ఇయర్… కేవలం ఒకే ఒక్క సంవత్సరంలో టాప్-10 లో ఉన్న కంపెనీని టాప్-2 కి తీసుకెళ్లడం సాధారణ విషయం కాదు..
యువర్ విజన్ అండ్ డెడికేషన్ ఆర్ అన్‌స్టాపబుల్. ఐ యామ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యువర్ సక్సెస్!”అని అంటారు..
* * * * * * * * * * * * * * * * * * * * * * 
𝚃𝚘 𝚋𝚎 𝚌𝚘𝚗𝚝𝚒𝚗𝚞𝚎𝚍…🌸 🕊️