నా రాక్షసి వే – 5
🌸🕊️ నా రాక్షసి వే – 5 🌸🕊️
మిస్టర్ శర్మ..చిరునవ్వుతో ఆలోచిస్తూ..
“హ్మ్… డేట్ ఏమో కానీ, ఆ ప్రాజెక్ట్‌తో మాత్రం దేవ్ ని పక్కాగా లాక్ చేయొచ్చు!”అని అంటాడు..
మరి దివ్యాంక వేసిన ఈ బిజినెస్ ప్రాజెక్ట్ ప్లాన్ కి దేవ్ ఎలా రెస్పాండ్ అవుతాడు?
దేవ్:”ఓకే మిస్టర్ శర్మ అండ్ మిస్ శర్మ… బై.” అని అంటూ కార్తికి సైగ చేస్తాడు..
దివ్యాంక కొంచం అసహనం గా..”ఓకే దేవ్, విల్ మీట్ అగైన్. బై!” అని అనడం తో..
దేవ్ అక్కడి నుంచి కార్తి కోసం ముందుకు వెళ్తాడు. అప్పుడే కొద్ది దూరంలో కార్తి ఒక ఇంపార్టెంట్ ఫోన్ కాల్ మాట్లాడుతూ కనిపిస్తాడు..
దేవ్ సైలెంట్ కార్తి దగ్గరికి నడుచుకుంటూ వెళ్లడం తో..
అటు పక్క దేవ్ వెళ్లిన వైపే చూస్తూ, దివ్యాంక తన డాడ్ దగ్గర కొంచెం డిజప్పాయింట్మెంట్ అండ్ క్యూరియాసిటీతో..
“డాడ్… దేవ్ ఎందుకు కనీసం హ్యాండ్ షేక్ కూడా ఇవ్వలేదు?!” అని అడుగుతుంది…దివ్యాంక..
మిస్టర్ శర్మ తన కూతురు దివ్యాంక భుజంపై చేయి వేసి, దేవ్ వెళ్తున్న వైపే చూస్తూ..
“హా బేబీ… దేవ్ ఈజ్ ఎ డిఫరెంట్ పర్సనాలిటీ! తను ఒక బౌండరీ లైన్ గీసుకొని ఉంటాడు..
అందరినీ టచ్ చేయడం అంటే తనకి అస్సలు నచ్చదు… ఈవెన్ ఆఖరికి హ్యాండ్ షేక్ కూడా!
తను సోషల్ పర్సన్ కాకపోవచ్చు బేబీ, కానీ ఒక్క చూపులోనే ఎదుటి మనిషి ఎలాంటివాడో పక్కాగా అంచనా వేయగలడు..
చూడటానికి చాలా కూల్ గా ఉన్నా… తనలో ఇంకో డేంజరస్ పర్సన్ ఉన్నాడు అనిపిస్తుంది..
తనకి ఎంత దూరంగా ఉంటే ఎదుటివాళ్లకు అంత మంచిది! అని చాలా సీరియస్‌గా చెప్తాడు మిస్టర్ శర్మ..
దివ్యాంక తన డాడ్ మాటలు వింటూ, దేవ్ వైపు ఒక ఛాలెంజింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ గా చూస్తూ..
మనసులో ‘వెరీ ఇంట్రెస్టింగ్ కాండిడేట్! లెట్స్ సీ… నాకు ఎలా దూరంగా ఉంటాడో నేను కూడా చూస్తాను!’అని అనుకుంటూ..
వెంటనే తన డాడ్ వైపు తిరిగి స్మైల్ ఇస్తూ..
“డాడ్… దేవ్ తో ఏదైనా ఒక బిజినెస్ ప్రాజెక్ట్ ఓకే చేయండి, అండ్ ఒక డిన్నర్ డేట్ కూడా ప్లాన్ చేయండి!అని అంటుంది..
మిస్టర్ శర్మ..చిరునవ్వుతో ఆలోచిస్తూ..
“హ్మ్… డేట్ ఏమో కానీ, ఆ ప్రాజెక్ట్‌తో మాత్రం దేవ్ ని పక్కాగా లాక్ చేయొచ్చు!”అని అంటాడు..
మరి దివ్యాంక వేసిన ఈ బిజినెస్ ప్రాజెక్ట్ ప్లాన్ కి దేవ్ ఎలా రెస్పాండ్ అవుతాడు?
* * * * * * * * * * * * * * * * * * * * * * * *
హైదరాబాద్.. ఆల్వల్ లోని పురాతన శివాలయం..
ప్రశాంతమైన ఉదయాన, దైవభక్తితో నిండిన ఆ పురాతన శివాలయానికి మన ముగ్ధ మనోహరి తన ఫ్యామిలీతో కలిసి రుద్రాభిషేకం చేయడానికి వస్తుంది..
వాళ్ళు అంతా గుడికి చేరుకోగానే ప్రధాన పూజారి గారు ఎంతో ఆత్మీయంగా ఎదురొచ్చి, వాళ్లందరినీ ఆలయ గర్భగుడిలోకి తీసుకువెళ్తారు..
పూజారి.. గారు అనురాధ గారిని చూస్తూ “అమ్మా, అభిషేకానికి కావలసిన అన్ని పూజా ద్రవ్యాలూ తీసుకొనివచ్చారా?” అని అడగడం తో..
అనురాధ గారు “హా పూజారి గారు, అన్ని వస్తువులూ తీసుకొని వచ్చాము అంటూ పూజ సామాగ్రి వున్నా తంబులాలు పూజారి గారికి ఇవ్వగ !”
పూజారి గారు పూజ సామాగ్రి అందుకొని “చాలా సంతోషం అమ్మా.. మీరు ఇరువురు ఈ వెండి బిందెలతో కోనేరు నుండి స్వామివారి అభిషేకానికి పవిత్ర జలాన్ని తీసుకురండి.” అని కన్నమ్మ ఇంకా ఆని లకి చెప్తారు
పూజారి గారు చెప్పినట్టే మన కన్నమ్మ మరియు ‘ఆని’ ఇద్దరూ కలిసి భక్తిశ్రద్ధలతో కోనేటి నుండి బిందెలలో పావన జలాన్ని తెస్తారు..
అది చూసినా ఆని నాన్నగారు..పూజారి గారి వైపు చూస్తూ.. పూజారి గారు ఈ పవిత్ర అభిషేకాన్ని పిల్లల చేతుల మీదుగానే జరిపించండి.. అని చెప్పడం తో..
పూజారి గారు..అలాగే బాబు… ముందుగా వేద మంత్రపఠనంతో ఇరువురిచేత ఆ పరమశివుని లింగాకారానికి అభిషేకం ప్రారంభిద్దాం..
అని బదులు ఇచ్చినా పూజారి గారు గంభీరమైన స్వరంతో:
*”ఓం గంగాధరాయ నమః…*
*ఓం మృత్యుంజయాయ నమః…*
*ఓం శంభవాయ నమః…”*
అంటూ మంత్ర పారాయణం చేస్తుండగా…
కన్నమ్మ, ఆని ఇద్దరి చేతుల మీదుగా శివయ్యకు స్వచ్ఛమైన నీరు, పాలు, తేనె, పసుపు మరియు సుగంధ భరితమైన గంధంతో మహాన్యాసపూర్వక అభిషేకం జరిపిస్తారు..
అనంతరం స్వామివారికి మారేడు భస్మమును ధరింపజేసి, దివ్యంగా అలంకరిస్తారు..
ఆ తర్వాత బిల్వ పత్రాలను చేతిలోకి తీసుకుని, “బిల్వాష్టకమ్” ను కన్నమ్మ మరియు ఆని ఇద్దరూ ఏకకంఠంతో, ఎంతో భక్తిశ్రద్ధలతో పఠిస్తారు..
త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం!
త్రిజన్మపాపసంహారం ఏకబిల్వం శివార్పణమ్!!
త్రిశాఖైర్బిల్వపత్రైశ్చ హ్యచ్ఛిద్రైః కోమలైః శుభైః!
శివపూజాం కరిష్యామి ఏకబిల్వం శివార్పణమ్!!
అఖండబిల్వపత్రేణ పూజితే నందికేశ్వరే!
శుధ్యంతి సర్వపాపేభ్యః ఏకబిల్వం శివార్పణమ్!!
సాలగ్రామశిలామేకాం విప్రాయ యో౨ర్పయేత్!
సోమయజ్ఞమహాపుణ్యం ఏకబిల్వం శివార్పణమ్!!
దంతికోటిసహస్రాణి వాజపేయశతాని చ!
కోటికన్యామహాదానం ఏకబిల్వం శివార్పణమ్!!
పార్వత్యాః స్వేదసంజాతం మహాదేవస్య చ ప్రియమ్!
బిల్వవృక్షం నమస్యామి ఏకబిల్వం శివార్పణమ్!!
దర్శనం బిల్వవృక్షస్య స్పర్శనం పాపనాశనమ్!
అఘోరపాపసంహారం ఏకబిల్వం శివార్పణమ్!!
మూలతో బ్రహ్మరూపాయ మధ్యతో విష్ణురూపిణే!
అగ్రతః శివరూపాయ ఏకబిల్వం శివార్పణమ్!!
బిల్వాష్టకమిదం పుణ్యం యః పఠేచ్ఛివసన్నిధౌ!
సర్వపాపవినిర్ముక్తః శివలోకమవాప్నుయాత్!!
ఎంతో నిష్ఠగా, నిండైన భక్తిప్రపత్తులతో ఆని ఇంకా కన్నమ్మ ఇరువురూ కలిసి ఆ శివయ్య కి అభిషేకం మరియు బిల్వాష్టక పఠనం పూర్తి చేస్తారు..
* * * * * * * * * * * * * * * * * * * * * * * *
𝚃𝚘 𝚋𝚎 𝚌𝚘𝚗𝚝𝚒𝚗𝚞𝚎𝚍…🌸 🕊️
Swipe left/right or tap the sides to turn pages