New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
నా సీత ప్రేమకై💕 – 4

నా సీత ప్రేమకై💕 – 4

పార్ట్ – 4

 

“ఇప్పుడు కాదు ఫలితాలు వచ్చాక చెప్పు ఇంకాస్త సంతోషిస్తా” చిరునవ్వుతో బదులిచ్చాడు రాము.

 

ఫ్యాకల్టీ ఇద్దరి పేపర్స్ ని పరిశీలిస్తూ మొత్తానికి పోటీ పరీక్షల విజేతని అనౌన్స్ చేసే టైం ఆసన్నమైంది.

 

రెండు వైపులా టెన్షన్స్ ఎక్కువైపోతున్నాయి రామునే గెలవాలి అని ఆల్మోస్ట్ సగానికి సైతం కాలేజ్ స్టూడెంట్స్ అనుకుంటున్నారు. కారణం పెద్దవారు అంటూ బలిసిన వారంటూ ఆ కాలేజీలో చదివే ఏ ఒక్కరిని కూడా ఫుట్బాల్  కోర్ట్ లోకి అట్లీస్ట్ అడుగు కూడా పెట్టనివ్వక చాలా టార్చర్ చూపించే వాళ్ళు ఆ గోపి గ్యాంగ్ వాళ్ళు.

 

అందుకే అప్పటి నుంచి వారి పై కోపం చాలా మందికి అలానే ఉండిపోయింది. సో ఇప్పుడు వాడిపై కక్ష ఇలా తీర్చుకోబోతున్నాం అన్న ఆనందం ఒకటి అయితే పోటీకి దిగింది రాము అని తెలిసి కాస్త నిరాశపడినా దేవుడు మంచివారి వైపే ఉంటాడు అన్న సత్యాన్ని గ్రహించి ఏదో కొంచెం ఆశతో కచ్చితంగా రామునే గెలవాలి అని అంతా కోరుకుంటున్నారు.

 

పరీక్ష రాసేటప్పుడు రాములోని కాన్ఫిడెన్స్ ని గమనించిన గోపికి ఏదో తెలియని సన్నని భయం మొదలయ్యింది. రాము అన్న ధీమాతో బుక్కు కూడా సరిగ్గా ముట్టని ఎదవ పేపర్ చూడగానే దిమ్మ తిరిగిపోయింది అయినా కూడా తనకు వచ్చినంత వరకు చక్కగానే రాశాడు.

 

మొదటిలో వచ్చిన భయం చివరికి రాగానే పూర్తిగా ఎగిరిపోయింది. కారణం నాకే ఇలా అనిపిస్తే వాడు అసలు ఏమి రాసి ఉండదు అన్న ధీమాతో సంబరపడిపోయాడు గోపి.

 

| సమయం ఆసన్నమైంది |

 

పోటీ ఫలితాలు చెప్పటానికి ఫ్యాకల్టీ కూడా ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. వారి వధనాల్లో మెరిసిపోతున్న మెరుపులని చూసి గోపి గ్యాంగ్ కి ఎక్కడో తేడా కొట్టింది. అంతే మెల్లగా వారిలో వణుకు పుట్టటం మొదలైంది.

 

విజయం అనుకున్న వారికే సొంతం అయ్యింది అన్న సంతోషంతో రాము వాళ్ళ క్లాస్ లెక్చరర్ ఎంతో సంబరంతో మైక్ అందుకొని, “ఈ పోటీలో విజేత నేను కూడా అస్సలు ఊహించలేదు వాడు ఇలా చదవగలడా అనేసి. రాము జాక్పాట్ కొట్టేసావు రా వండర్ఫుల్ అసలు నువ్వేనా ఇలా చదివింది అనిపిస్తుంది నాకు. కంగ్రాట్యులేషన్స్ టు యు” అంటూ అతని సంతోషాన్ని తట్టుకోలేక కంట్లో ఆనంద భాష్పాలని రాలుస్తూనే సంతోషంగా ఫలితాలను వెల్లడించాడు సార్.

 

అంతే అది వినగానే కాలేజ్ కాలేజ్ అంతా కేరింతలతో మునిగిపోయింది. అందరూ రాము రాము అంటూ తనకి అభినందనలు వారి అరుపులతోనే తెలియజేశారు.

 

ఫలితాలు చెప్పిన మరుక్షణమే అమాంతం రాముని చుట్టేసి, “లవ్ యు సో మచ్ రా” అంటూ ఎంతో ప్రేమగా సీత చెప్తే,

 

తనకంటే గట్టిగా తాను సీతని హత్తుకుంటూ “వాడేమన్నాడు?” ఒక్క మాటనే అడిగాడు.

 

ఆ మాటకి ఉఫ్… అనుకుంటూ, “అరే కాస్త….” అంటూ తను ఏదో చెప్పేలోపు,

 

“రాము కమాన్ టు ది డయాస్ మన కాలేజీ ఫ్యాకల్టీ ఈ పోటీలో గెలిచిన వారికి కేవలం అభినందనలు మాత్రమే కాదు వాళ్ళని గౌరవంగా గజ మాలతో సన్మానం కూడా చేయాలి అని నిర్ణయించుకున్నారు. అండ్ యు రియల్లీ డిడ్ ఎ గ్రేట్ జాబ్. కమాన్ పైకి రా” అంటూ పిలిచాడు వాళ్ళ సార్.

 

అది చూసి, “సీతు నేను ఇందులో గెలిస్తే నాకు నిజం చెప్తాను అన్నావు నాకు అది మాత్రమే కావాలి ఇవన్నీ వద్దు. చెప్పు వాడు ఏమన్నాడు..?”

 

రాములో ఉండే కోపం చూస్తుంటే వాడి చేతిలో వీడి పని కతం అని అర్థం చేసుకున్న గోపి అక్కడ నుంచి పారిపోవటానికి సిద్ధం అయ్యాడు.

 

అది చూసిన రాము, “చెప్పు సీత మాట తప్పావో నీ కంఠం కోస్తా” అంటూ కోపంగా పలుకుతూ తన భుజాలను పట్టుకొని ఊపుతుంటే,

 

తనని ఏం చెప్పి ఆపాలో తన దగ్గర మార్గం లేక తనని గోపి వల్గర్ గా ఎంతో నీచంగా తనపై కామెంట్ చేసిన మాటలన్నీ పూసగుచ్చినట్టుగా చెప్పేసింది రాముతో.

 

అవి వినటం ఆలస్యం సలసలమంటూ రక్తం మరిగిపోయింది రాముకి.

 

వాడి కోపాన్ని చూసి ఏం చేస్తాడో ఏమో అన్న భయంతో తన వెనుకే సీత చరణ్ వెళితే, మనోహర్, సార్ వాళ్ళతో విషయం చెప్పి కాస్త ఎక్స్క్యూజ్ తీసుకున్నాడు.

 

కోపంగా వెళ్ళిన రాము కార్ ఎక్కబోతున్న గోపిని మెడ పట్టుకొని వెనక్కి పడేసి తనకు వచ్చిన కోపాన్ని అంతా వాడిపై తీర్చేసుకున్నాడు.

 

తనపై విరుచుకుపడుతున్న రాముని ఆపలేక తిరిగి తనపై దాడి చేశాడు గోపి. అలాగే తన స్నేహితులు అంతా.

 

అది చూసిన చరణ్ మిత్రుడికి సహాయంగా నిలిచాడు.

 

విషయం తెలుసుకున్న కాలేజీ సిబ్బంది అంతా వెంటనే పోలీసులకు కాల్ చేసేయటంతో పోలీసులు వచ్చి గొడవని ఆపేశారు.

 

అక్కడ అందరూ రాముకి సపోర్ట్ గా ఉండటంతో తప్పు చేసింది గోపి అండ్ గ్యాంగ్ అని తెలుసుకొని వారిని అరెస్ట్ చేసి తీసుకెళ్తూ రాముకి వార్నింగ్ ఇచ్చి మరీ వదిలి పెట్టారు.

 

ఒంటి మీద గాయాలతో జీప్ లో కూర్చున్న గోపీని కోపంగా చూస్తూ నోట్లో నుంచి కారుతున్న రక్తాన్ని తుడుచుకుంటూనే పక్కనే ఉన్న సీత భుజం చుట్టూ చెయ్యేసి దగ్గరికి తీసుకుంటూ, “ఇది నా ప్రాణం దీని కోసం పోటీ ఏంటి చావడానికైనా సిద్ధం నేను. ఇంకోసారి దీనితో మాట్లాడే ముందు, ముందు వెనక ఆలోచించి మాట్లాడు. ఒక్క మాట దాని మీద పడింది అని తెలిసినా ఇకపై నీ ప్రాణం ఈ భూమిపై నిలవదు గుర్తుపెట్టుకో” అంటూ డెడ్లీ వార్నింగ్ ఇచ్చేసాడు.

 

తనపై చూపిస్తున్న రాము ప్రేమకి ఉప్పొంగిపోయింది సీతా మనసు. ఉన్నచోటే అలానే తనని ప్రేమగా చుట్టేసింది.

 

వారి గొప్ప ప్రేమని కాలేజ్ అంతా ఎంతో ముచ్చటగా చూసుకుంటూ విజేతగా నిలిచిన రాముతో సహా సీతను కూడా గజమాలతో సత్కరించి మూడేళ్లగా పోరాడుతున్న వారి పోరాటానికి స్వస్తి పలికారు.

 

అదే ఫుట్బాల్ కోర్ట్ కోసం బీటెక్ ఫస్టియర్ నుంచి పోరాడుతూనే ఉన్నారు. చివరికి ఫైనల్ ఇయర్లో సాధించుకున్నారు ఎంతో ఘనంగా.

 

వారి విజయాన్ని కాలేజ్ అంతా ఎంతో సంబరంగా జరుపుకున్నారు.

 

 

—-శుభం—-

 

మీ కీర్తి ప్రియ✍🏻✍🏻

కామెంట్స్ ప్లీజ్💕💕

 

నా కథ నచ్చితే చిన్న కామెంట్ చేసి నన్ను సపోర్ట్ చెయ్యరా.. అలాగే కథలంటే ఇష్టం ఉన్న వాళ్ళకి నా కథను షేర్ చేసి వాళ్ళ అభిప్రాయాలను ఒక చిన్ని కామెంట్ రూపంలో చెప్పమని చెప్పండి.. మీ కామెంట్స్ ఏ మా రైటర్స్ కి వచ్చే బూస్ట్ అప్ దాని ద్వారా మేము మరింత ఉత్సాహంతో కథలను రాయగలుగుతాం..

 

 థాంక్ యు🥰💕