“నీ డ్రీమ్‌ని మళ్లీ నువ్వు ఇలా సాక్రిఫైస్ చేస్తే… రేపు మళ్లీ నువ్వే బాధపడాల్సి వస్తుంది. పిల్లల్ని నేను చూసుకుంటాను. నువ్వు మాత్రం నీ డ్రీమ్‌ని ఫుల్‌గా ఫీల్ అవ్వాలి. నువ్వు అనుకున్నది సాధించాలి…” అని లక్ష్ మీనాక్షిని ఎంకరేజ్ చేస్తాడు.
మీనాక్షి కన్నీళ్లతో లక్ష్ వైపు చూస్తూ…
“ఏం చేయాలో అర్థం కావడం లేదు లక్ష్… పిల్లల ఫ్యూచర్, నా కెరీర్, నీ వైఫ్‌గా నా బాధ్యత, అదే సమయంలో నాకంటూ ఒక ఐడెంటిటీ… అన్నీ ఒకేసారి బ్యాలెన్స్ చేయడం నాకు ఇంపాజిబుల్‌గా అనిపిస్తుంది…” అని అంటుంది.
లక్ష్ ఆమె చేతిని పట్టుకుని…
“అలా ఎప్పుడూ అనుకోకు మీనా… నీ ధైర్యమే నిన్ను ముందుకు నడిపిస్తుంది. మనిద్దరం కలిసి పిల్లల్ని కూడా చూసుకుందాం… నీ డ్రీమ్‌ని కూడా నువ్వు సాధించేలా నేను నీతో ఉంటాను…” అని ధైర్యం చెబుతాడు.
అలా కొంతకాలం గడిచిన తర్వాత మీనాక్షి ఫస్ట్ లైవ్ షో చేసే రోజు రానే వస్తుంది.