దాంతో అతని నెమ్మదిగా తల ఎత్తి చూసి పది నిమిషాల పాటు సూటిగా ఆమెను చూస్తూ ఉంటే కంగారు పడిపోయి ‘ఇతను ఏంటి ఇలా చూస్తున్నాడని’ కంగారుపడుతుంది….
“కం హియర్” అని పిలవడంతో నెమ్మదిగా అతని టేబుల్ దగ్గరికి వెళ్లడంతో “సో ఫ్రొం నౌ ఆన్ వర్డ్స్ యు ఆర్ మై సెక్రెటరీ… యామ్ ఐ రైట్?” అనగానే “ఎస్సార్” అని నెమ్మదిగా తలాడించడంతో “సెక్రెటరీ అంటే షెడ్యూల్స్ ప్రిపేర్ చేయడం ఎక్కడికి వెళితే అక్కడికి సైలెంట్గా వెనక రావడం ఇంతే అనుకుని ఉంటావు కానీ నా దగ్గర అంతకుమించి ఉంటుంది” అన్నాడు….
ఆ మాటకి ఆమె గుటకలు మింగుతూ అతని వైపు చూస్తుంటే “నా సెక్రటరీగా ఉండాలంటే నేను చెప్పిన టైం టేబుల్స్ ప్రకారం ఉండాలి” అనగానే “చెప్పండి సార్…. మీరు ఎలా చదివితే అలా నడుచుకోవడానికి నా వంతుగా ప్రయత్నిస్తాను” అంది….
“ప్రయత్నించాలి…. ప్రయత్నించడం కూడా కాదు ఉండాలి… లేకపోతే ఇక్కడ ఉద్యోగం లో నుంచి పీకడమే కాకుండా ఇంకొక చోటు ఉద్యోగం రాకుండా చేస్తాను” అనగానే ఒక్కసారిగా బిత్తర పోయింది…
ఆమె మొహం లో భయం కంగారు చూసి ఒక శాడిస్టిక్ స్మైల్ పడేసి రేపటి నుంచి “నువ్వు ఏడింటిలోపు ఆఫీసులో కాదు మా ఇంట్లో ఉండాలి” అనగానే “మీ ఇంటికి ఎందుకు సార్?” అని అర్థం కానట్టుగా అడగడంతో అతను ఒక చూపు చూసేసరికి మౌనంగా ఉండిపోయింది….
“ఏడింటిలోపు మా ఇంటికి రావాలి… అది కూడా ముందే నువ్వు నా షెడ్యూల్స్ మొత్తం ప్రిపేర్ చేసి మా ఇంటికి రావాలి…. నువ్వు ఎన్ని గంటలకి పడుకుంటావు ఏ టైం కి లేస్తావు అనేది నాకు సంబంధం లేని విషయం… షార్ప్ సెవన్ ఓ క్లాక్ మా ఇంట్లో ఉండాలి… షెడ్యూల్స్ అన్నీ నాకు మా ఇంట్లోనే చదివి వినిపించాలి… నాతో పాటు ఆఫీస్ కి రావాలి….