దాంతో చేసేది ఏమీ లేక కండక్టర్ చెప్పిన స్టాప్ లో దిగేసి అక్కడ మరొక పావుగంట నిలబడి ఇంకొక బస్సు ఎక్కి అతను చెప్పినా అడ్రస్ కి వెళ్ళింది….
పెద్ద గేట్, బయట ఇద్దరు సెక్యూరిటీ గార్డ్స్ …. గోడ ఎంత ఎత్తుగా ఉందంటే బయట నిలబడిన వాళ్ళకి గేట్ ఓపెన్ చేసే వరకు లోపల ఏముందో కూడా కనిపించదు….
ఆమె సెక్యూరిటీ గార్డ్స్ వైపు చూస్తూ “నేను లోపలికి వెళ్ళాలి” అని అడగడంతో వాళ్ళిద్దరూ ఒకరు ఒకరు చూసుకుని “నువ్వు ఎవరు?” అన్నారు….
“నేను విరాట్ సార్ సెక్రటరీ” అనగానే వాళ్ళిద్దరూ మళ్ళీ ఒకరినొకరు చూసుకొని “విరాట్ సర్ సెక్రటరీ చారి సార్ కదా” అనగానే “ఆయన ప్లేస్ లోనే నన్ను అపాయింట్ చేశారని” చెప్పడంతో “ఒక నిమిషం” అంటూ లోపలికి వెళ్లి పది నిమిషాల తర్వాత బయటకు వచ్చి “నువ్వు లోపలికి వెళ్లొచ్చు” అన్నాడు ఒక సెక్యూరిటీ గార్డ్….
దాంతో అతనికి థాంక్స్ చెప్పి ఆమె భయం భయంగా లోపలికి వెళ్లి డోర్ దగ్గర నిలబడి లోపలికి వెళ్లాలా వద్దా తెలియక అక్కడే ఆగిపోవడంతో అప్పుడే ఫ్రెష్ అయ్యి రెడీ అయ్యి బ్రేక్ ఫాస్ట్ కోసం కిందకి వస్తున్న కార్తిక్ గుమ్మం దగ్గర నిలబడిన రాజీవైపు చూస్తూ ‘ఈ అమ్మాయి మన కంపెనీలో పనిచేస్తుంది కదా’ అనుకుంటూ ఆమె దగ్గరికి వచ్చి “నువ్వేంటి ఇక్కడ?” అన్నాడు…..
“గుడ్ మార్నింగ్ సార్” అనగానే “గుడ్ మార్నింగ్. నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావ్?” అని అడగడంతో “విరాట్ సార్ నన్ను రమ్మన్నారు” అనగానే “ఇంత ఉదయాన్నే వాడు నిన్ను ఎందుకు ఇక్కడికి రమ్మన్నాడు?” అన్నాడు….