New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
నువ్వే కావాలి ❤️ – 12

నువ్వే కావాలి ❤️ – 12

 

అప్పటివరకు తల దించుకుని వెళుతున్న ఆమె గమనించలేదు గాని డైనింగ్ టేబుల్ దగ్గర 15 మంది వరకు కూర్చుని ఉండడంతో ఒక్కసారిగా కాళ్ళల్లో చేతుల్లో చల్లటి చెమటలు పట్టి ఆమె మొహంలో ఒకలాంటి బెదురు కనిపించడంతో కార్తీక్ ఆమె కంగారు పడుతుందని గ్రహించాడు….

 

“మామయ్య తన కంగారు పడుతోందని” అతను చెప్పడంతో “ఇలా రామ్మా?” అని విరాట్ వాళ్ళ నాన్నగారు మళ్ళీ పిలవడంతో ఆమె పది నిమిషాలకి ఒక అడుగు వేస్తూ వాళ్ల దగ్గరికి రావడంతో ‘పోనీలే….ఎట్టకేలకు వచ్చిందని’ అనుకున్నారు ఆడవాళ్లు…

 

“ఎవరమ్మా నువ్వు?” అని ఆయన అడగడంతో భయం భయంగా అందరి వైపు చూస్తుంటే “నిన్ను ఎవరు ఏమీ అనరు…. సమాధానం చెప్పు” అన్నారు ఆయన…

 

“విరాట్ సార్ గారికి కొత్త సెక్రెటరీ నండి” అని చెప్పడంతో విరాట్ వాళ్ళ నాన్నగారు కూడా ఆశ్చర్యపోయి “పాత సెక్రెటరీ ఏమయ్యాడ్రా?” అని అడిగాడు కార్తీక్ ని చూసి….

 

“నీ కొడుకు ఏదైనా నాకు చెప్పి చేశాడా మావయ్య ఇప్పటివరకు…. అసలు ఎందుకు పాత సెక్రటరీని తీసేసి తనని పెట్టుకున్నాడో నాకు తెలీదు” అని కార్తీక్ చెప్పడంతో విరాట్ వాళ్ళ నాన్నగారు రాజీ వైపు చూసి “నీ పేరేంటమ్మ?” అన్నాడు….

 

“రాజేశ్వరి అండి” అని చెప్పడంతో “మంచి పేరు” బయటకు వెళ్తున్నావు ఏంటి?” అనగానే “నేను బయట వెయిట్ చేయడానికి వెళుతున్నాను అండి” అని చెప్పింది….

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue