భాగం – 15
“ఏంట్రా బెదిరిస్తున్నావా..?” అంతే కోపంగా మీదకి వెళుతుంటేనే,
“రాము వెనక్కి వెళ్ళు” గద్దించాడు పెద్దయ్య.
అతని మాటలకి తగ్గి వెనక్కి నడిచాడు రాము.
“ఉఫ్… ఎవరయ్యా నువ్వు చంపేస్తావా ఏంటి నన్ను. కాస్త నన్ను కూడా మాట్లాడనీ” అంటూనే కాస్త ధైర్యం కోసం ఒక సారి సీత వంక చూసి మళ్లీ పెద్దయ్య వంక చూస్తుంటే,
నిమిషానికి ఒక సారి వాడి కళ్ళు సీత పై పడుతుంటేనే కంపరం రేగుతుంది రాముకి. అయినా అతి కష్టం మీద తట్టుకుంటున్నాడు అందరి ముందు కోపం తెచ్చుకోలేక.