బంధమే.. అనుబంధమైతే – 1
ఒక అమ్మాయి తన క్యాబిన్లో కూర్చొని సిస్టంలో వర్క్ చేసుకుంటుంటే ప్యూన్ వచ్చి మేడం మిమ్మల్ని సార్ పిలుస్తున్నారు అని చెప్తాడు
సరే వెళ్తాను అని ప్యూన్ ని పంపిస్తుంది
మే ఐ కం ఇన్ సార్ డోర్ నాక్ చేసి అడిగింది ఆ అమ్మాయి
యస్ కం ఇన్ అని చెప్పి ఫైల్ లో సెర్చ్ చేస్తూనే ఉన్నాడు ఆ బాస్…
రెండు నిమిషాలు గడిచినా ఏ రెస్పాండ్ లేక… సార్ పిలిచారంట…అని చిన్నగా అడిగింది ఆ అమ్మాయి
యహ్.. సిట్ డౌన్… అంటూ ఛైర్ చూపించి ఫైల్ క్లోజ్ చేసి ఛైర్ లో వెనక్కి వాలాడు…
మిస్ అర్చిత… మీరు ఇక్కడ టూ ఇయర్స్ గా వర్క్ చేస్తున్నారు గా సో ఈ కంపెనీ పై మీ ఒపీనియన్ ఏంటి
అర్చిత ప్రొఫెషనల్ టోన్ తో.. హానెస్ట్లీ సార్.. నా కెరీర్ కి ఇదొక మంచి ప్లాట్ ఫామ్.. వర్క్ ఎన్విరాన్మెంట్ డీసెంట్ గా ఉంది..
ఈరోజుతో మీ బాండ్ పూర్తవుతుంది ఆ విషయం మీకు తెలుసా…!!
ఎస్ ఐ నో సార్… అంది అర్చిత
సో రేపటి నుండి ఏమైనా ప్లాన్స్ ఉన్నాయా లేక ఇక్కడే కంటిన్యూ అవ్వాలనుకుంటున్నారా
ప్రెసెంట్ ప్లాన్స్ ఏం లేవు సార్…
ఇఫ్ యూ విష్.. ఐ కెన్ ఎక్స్టెండ్ యువర్ కాంట్రాక్ట్ …
ఓకే థాంక్ యూ సార్.. బట్ ఐ నీడ్ టు డిస్కస్ విత్ మై ఫ్యామిలీ … దెన్ ఐ విల్ డిసైడ్ సార్..
బాస్ లైట్ గా స్మైల్ చేస్తూ ఇట్స్ ఓకే టేక్ యువర్ టైం అంటాడు
థాంక్ యూ సార్ అని వెళ్ళడానికి లేస్తుంది అర్చిత
వెయిట్ అర్చిత… ఈ రోజు 7 కి మీటింగ్ ఉంది అటెండ్ అవ్వాలి సో మీరు కూడా రావాలి…
సమాధానం ఏం చెప్పకుండా బాస్ వైపే అయోమయం గా చూస్తుంది అర్చిత
వాట్ హాపెండ్ అర్చిత
అది సార్ నాకు తెలియకుండా మీటింగ్ ఏంటి సార్ నేనే కదా మీ షెడ్యూల్ ప్రిపేర్ చేసింది…
యస్ అర్చిత బట్ ఈ మీటింగ్ రేపు అటెండ్ అవ్వాలి కానీ నాకు రేపు వేరే వర్క్ ఉండటం వల్ల ఈ రోజే అటెండ్ అవ్వాల్సి వస్తుంది
కానీ సార్…అని అర్చిత ఏదో చెప్పబోతుంటే..
వాట్ అని కొంచెం బేస్ వాయిస్ తో అన్నాడు
సో అర్చిత మ్యూట్ అయిపోయింది..
@@@@@
వర్మా’స్ ఇండస్ట్రీస్
కాన్ఫరెన్స్ రూమ్ లో గత మూడు గంటలుగా జరుగుతున్న ఆ మీటింగ్ 200 కోట్లకి సంబంధించిన ఓ ప్రాజెక్ట్ డీల్…
సీరియస్ గా జరుగుతున్న ఆ మీటింగ్ లో అనుకోకుండా ఒకరి ఫోన్ రింగ్ అయింది
ఆ సౌండ్ విన్న మరుక్షణం ఎక్సప్లనేషన్ అనేదే లేకుండా గెట్ అవుట్ అండ్ యువర్ ఫైర్డ్ అని ఆర్డర్ పాస్ చేశాడు ఆ కంపెనీ సీఈఓ మిస్టర్ అరణ్య్ వర్మ…
స్టాఫ్ అందరూ ముద్దుగా పిలిచే పిలుపు ఆరోగంట్… ఎందుకంటే పని రాక్షసుడు కదా…
ఆఫీస్ కి వచ్చాం అంటే కేవలం ఇక్కడ పని మీద మాత్రమే దృష్టి పెట్టాలి…ఇంట్లో టెన్షన్స్ అన్ని పక్కన పెట్టి రావాలి అనేది అరణ్య్ వర్మ సిద్ధాంతం…
@ మరి ఆ సిద్ధాంతం వల్ల బలి అయ్యేది ఎవరు??
@@@@@@@@
మమ్మీ ఇప్పటికి 20 టైమ్స్ చేశా మమ్మీ అది ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు… దీనికి కొవ్వు ఎక్కువైంది మమ్మీ..
ఇంటికి రానివ్వు దాని కొవ్వు నేను కరగదీస్తా… కానీ దానికెందుకు ఇన్నిసార్లు ఫోన్ చేస్తున్నావ్… అంది శకుంతల
అది… అది ఏం లేదు లే మమ్మీ ఊరికే అని కొంచెం తడబడింది అశ్విత
ఆ తడబాటు అర్థమైన శకుంతల అశ్వి నిజం చెప్పు దానికెందుకు ఫోన్ చేస్తున్నావ్ అని కొంచెం గట్టిగా అడిగింది శకుంతల
మమ్మీ సీరియస్ నెస్ కి కొంచెం జడిసి ఏం లేదు మమ్మీ ఊరికే అది ఆఫీస్ లో ఉందిగా ఇలా కాల్ చేసి డిస్టర్బ్ చేస్తే దాని బాస్ దాన్ని అందరి ముందు తిడతాడు గా అందుకే అని ఓ చెత్త ఐడియా అల్లేసింది
కూతురు ప్లాన్స్ ఏంటో అర్థమవ్వని శకుంతల దాన్ని ఎలా ఏడిపించినా నాకు సంతోషమే అని రెండు చేతులతో మొటికలు విరిచి నా బంగారమే అన్ని నా తెలివితేటలేనే నీకు అని ముద్దు చేసింది…
అశ్విత ఫోన్ రింగ్ అవడం చూసి అదేనా ఫోన్ అంటుంది.. కాదు మమ్మీ నా ఫ్రెండ్ ఎగ్జామ్స్ ఉన్నాయ్ గా సబ్జెక్టు లో ఏదో డౌట్ అంట నేను రూమ్ లోకి వెళ్లి తనకి ఎక్సప్లయిన్ చేస్తా అని వెళ్లి రూమ్ డోర్ క్లోజ్ చేసింది
నా కూతురు చదువులో ఫస్ట్ అందుకే దాని ఫ్రెండ్స్ కూడా దానికే ఫోన్ చేసి డౌట్ లు అడుగుతారు అంటూ కూతురి గురించి ఆలోచిస్తూ చాలా మురిసిపోతుంది శకుంతల…
మరి ఆ తల్లికి తన కూతురి నిజం స్వరూపం తెలిసేనా…!!
@ ఇంకా ఉంది
హాయ్ ఫ్రెండ్స్!! కొత్తగా వచ్చాను ఫాలో చేసి సపోర్ట్ చేయండి…
Swipe left/right or tap the sides to turn pages