New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
బంధమే.. అనుబంధమైతే – 2

బంధమే.. అనుబంధమైతే – 2

నా కూతురు చదువులో ఫస్ట్ అందుకే దాని ఫ్రెండ్స్ కూడా దానికే ఫోన్ చేసి డౌట్ లు అడుగుతారు అంటూ కూతురి గురించి ఆలోచిస్తూ చాలా మురిసిపోతుంది శకుంతల…
మరి ఆ తల్లికి తన కూతురి నిజం స్వరూపం తెలిసేనా…!!
@@@@@
SC టెక్ సొల్యూషన్స్ లో ఈవెనింగ్ టైం 6 కి అర్చిత కి ఈ రోజు బాండ్ ఎండ్ అవుతుంది అని తెలిసిన కొలిగ్స్ తనకి చిన్న ట్రీట్ ప్లాన్ చేసి పార్కింగ్ ప్లేస్ లో కేక్ కటింగ్ అరేంజ్ చేశారు
వాళ్ళ అభిమానానికి చిన్నగా స్మైల్ చేస్తూ అండ్ ఎట్ ద సేమ్ టైం కొంచెం సాడ్ ఫీల్ కూడా వచ్చేసింది.. ఎందుకంటే రేపటి నుండి తను కంటిన్యూ అవుతుందో లేదో ఒకవేళ తను క్విట్ అయితే వీళ్లందరిని మిస్ అవుతా అనుకోగానే తన మనసు బాధ తో మూలిగి కంట్లోకి నీరు చేరింది..
పార్కింగ్ ఏరియా లో జరిగేదంతా లైట్ స్మైల్ తో సిస్టమ్ లో చూస్తున్నాడు ఆ కంపెనీ సీఈఓ మిస్టర్ సమర్జీత్ చౌహన్
@@@@@@
ఎట్ 5pm కాఫీ షాప్ లో మీట్ అవుదాం అని ఒక మెస్సేజ్ చేసి ఫోన్ పక్కన పడేసి బుక్ పట్టగానే ఓ పేజీ అయినా చదివిందో లేదో అలా నిద్రాదేవి ఆవహించేసింది 
ఇంకేముంది బుక్ క్లోజ్ చేయకుండానే పక్కన పెట్టేసి గుర్రు పెట్టి నిద్ర పోయింది అశ్విత
కూతురు చాలా కష్టపడి చదువుతుంది కాఫీ అయినా ఇద్దామని చెప్పి శకుంతల కాఫీ పట్టుకొని లోనికి వచ్చి చూసేసరికి ఊహల్లో తేలియాడుతుంది తన కూతురు
అరే చదువుతూనే పడుకుండి పోయింది నా బంగారు తల్లి అని పక్కనే ఉన్న బుక్ క్లోజ్ చేసి పక్కన పెట్టేసి వెళ్లిపోయింది శకుంతల 
@@@@
సీఈఓ ఛాంబర్ నుండి తన కేబిన్ కి వెళ్లిన అర్చిత ఆలోచనలో పడింది..
ఇదే కంపెనీ లో కంటిన్యూ అయితే బాగుండు అని ఇంటికి వెళ్ళాక నాన్న తో మాట్లాడాలని అనుకుంటున్న సమయంలో తన ఫోన్ బ్లింక్ అవడం చూసి ఫోన్ చేతిలోకి తీస్కొని నోటిఫికేషన్ చూసి హ్యాపీ గా ఫీల్ అయింది..
ఈ రోజు తన బాండ్ ఎండ్ కాబట్టి శాలరీ క్రెడిట్ అయినట్టు వచ్చింది ఆ నోటిఫికేషన్…
పెండింగ్ ఉన్న వర్క్ కంప్లీట్ చేస్తున్న తనకి హేయ్ అర్చి కాఫీ కి వెళ్దామా అంటూ వచ్చి అడిగింది మేఘన
హ వెళ్దాం పదా అంటూ లేచి ఇద్దరు కేఫటేరియా కి నడిచారు
బాస్ ఎందుకు పిలిచాడు అర్చి అని కాఫీ కప్ తీస్కొని అర్చితకి ఇస్తూ అడిగింది మేఘన
కప్ తీస్కొని కాఫీ సిప్ చేసి ఇంట్రెస్ట్ ఉంటే ఎక్స్టెండ్ చేస్తా అన్నారు మేఘ…
తను మరో కప్ తీస్కొని ఓకే చెప్పక పోయావా మరి…
ఇంట్లో అడగకుండా ఓకే చెప్పలేను కదా…
AV కంపెనీ గురించి విన్నావా అర్చి
నో మేఘ.. బట్ స్ట్రిక్ట్ రూల్స్ అని విన్న 
హ నా ఫ్రెండ్ అదే కంపెనీ లో వర్క్ చేస్తుందే బాబు… చాలా స్ట్రిక్ట్ అంట అక్కడితో పోలిస్తే ఇక్కడ చాలా బెటర్ సో ఏం థింక్ చేయకుండా ఇక్కడే కంటిన్యూ అవ్వు అంది మేఘన
హ సరే పదా అంటూ కాఫీ ఫినిష్ చేసి ఇద్దరు తమ ప్లేస్ లోకి వెళ్లి వర్క్ స్టార్ట్ చేశారు
టైం 6 అవడంతో కొలిగ్స్ అందరూ వచ్చి అర్చిత ని పార్కింగ్ ఏరియా కి లాక్కెళ్లారు
@@@@@
సిస్టమ్ లో స్టాఫ్ ని అబ్జర్వ్ చేస్తున్న సమర్జీత్ నువ్వు ఇదే కంపెనీ లో కంటిన్యూ అవ్వాలి అర్చిత… అయ్యేలా చేస్తాను అని తను కిందకి వెళ్ళాడు
అప్పటికే కేక్ కటింగ్ అయ్యి స్టాఫ్ అందరూ అర్చిత కి బై చెప్పి వెళ్లిపోతుంటే అర్చిత కళ్ళల్లో కన్నీళ్లు….
అవి చూసి మేఘ కంగారు పడి ఎందుకు ఇప్పుడు ఈ కన్నీళ్లు అని అడుగుతుంటే నేను మళ్ళీ మిమ్మల్ని రేపటి నుండి చూస్తానో లేదో అని బాధ గా ఉంది అంటుంది అర్చిత..
బాస్ కాల్ చేస్తే రెస్పాండ్ అవ్వకపోవడమే కాకుండా కాల్ బ్యాక్ కూడా చేయాలనుకోవట్లేదా అర్చిత అని బేస్ వాయిస్ తో అడిగాడు…
ఫ్రెండ్స్ ఇద్దరు ఒకేసారి ఉలిక్కి పడి… అర్చి కన్నీళ్లు తుడుచుకొని సారీ సార్.. ఫోన్ సైలెంట్ లో ఉంది చూసుకోలేదు అని ఎక్సప్లనేషన్ ఇస్తూ ఫోన్ తీసి చూస్తుంది
సీఈఓ సార్ నుండి 10 మిస్డ్ కాల్స్… చెల్లి నుండి 30 మిస్డ్ కాల్స్ చూసి టెన్షన్ వచ్చి ఎక్స్క్యూజ్ మీ సర్! ఫ్యూ మినిట్స్ అంటూ పక్కకి వెళ్లి చెల్లికి కాల్ బ్యాక్ చేసింది…
@@@@@@@
ఆఫ్టేర్నూన్ పడుకున్న అశ్విత కి సాయంత్రం 4 గంటలకు మెలుకువ వచ్చి లేచి టైం చూసి ఫ్రెష్ అయ్యి హాల్లోకి వెళ్ళింది
అమ్మా కాఫీ అంటూ శకుంతల గారితో కాఫీ పెట్టించుకొని తాగి అన్ని సార్లు ఫోన్ చేసిన లిఫ్ట్ చేయని అక్క మీద కోపం తో మళ్ళీ మళ్ళీ చేస్తూనే ఉంది…
@ ఇంకా ఉంది
హాయ్ ఫ్రెండ్స్!! ఫాలో చేసి స్టోరీ ఎలా ఉందో చదివి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలియజేయండి…