బంధమే.. అనుబంధమైతే – 3
ఆఫ్టేర్నూన్ పడుకున్న అశ్విత కి సాయంత్రం 4 గంటలకు మెలుకువ వచ్చి లేచి టైం చూసి ఫ్రెష్ అయ్యి హాల్లోకి వెళ్ళింది
అమ్మా కాఫీ అంటూ శకుంతల గారితో కాఫీ పెట్టించుకొని తాగి అన్ని సార్లు ఫోన్ చేసిన లిఫ్ట్ చేయని అక్క మీద కోపం తో మళ్ళీ మళ్ళీ చేస్తూనే ఉంది…
ఫోన్ సైలెంట్ లో ఉంటే ఎన్నిసార్లు చేసినా నో యూస్ కదా….
అశ్వి పాప కి ఫ్రస్ట్రేషన్ పెరిగి ఇంటికి వచ్చాక దీని సంగతి చెప్పాలి అని కోపం ఎక్కువ పెంచుకొని ఫ్రెండ్ ని మీట్ అవ్వాలి మా అని చెప్పి రెడీ అయ్యి బయటకు వెళ్ళింది
@@@@
ఎట్ 5pm కాఫీ షాప్
హాయ్ నిషా లేట్ అయ్యానా అంటూ వెళ్ళి తన ఫ్రెండ్ కూర్చున్న టేబుల్ దగ్గర కూర్చుంది
నో నో ధీరజ్ నీతో ఏదో మాట్లాడాలని నన్నే తొందర పెట్టి ముందు తీసుకొచ్చాడు
అవునా ధీరజ్ ఎక్కడ…
అదిగో నీ వెనక…
పబ్ కి వెళ్దాం అనుకున్నాం గా అశ్వి… మనీ అరేంజ్ అయ్యాయా అని అడిగాడు ధీరజ్
ఇంకా టైం ఉంది గా అప్పటి వరకు అరెంజ్ చేస్తాలే…డోంట్ టెన్షన్ అంది అశ్వి
సరే… అశ్వి నీకు మనీ కావాలి అంటే నేనున్నా అన్న విషయం మర్చిపోకు అంటూ బై గయ్స్ వర్క్ ఉంది అంటూ వెళ్ళిపోయాడు ధీరజ్
మీ అమ్మ కి ఇలాంటివి ఇష్టం ఉండవు కదా అశ్వి మరి మనీ ఎలా అరేంజ్ చేస్తావ్ అని అడిగింది నిషా…
నాకు ఉందిలే ఓ బకరా దాని దగ్గర తీస్కుంటా లే… అని అక్కడి నుండి షాపింగ్ కి వెళ్ళారు
షాపింగ్ అంటే కొనడానికి అనుకునేరు.. టైం పాస్ చేయడానికి…
షాపింగ్ మాల్ లో అశ్వి కి వన్ పీస్ డ్రెస్ బాగా నచ్చింది కానీ ఆ డ్రెస్ కాస్ట్ చూస్తే 10k ప్రస్తుతానికి ఆ అమౌంట్ అశ్వి దగ్గర లేక మరోసారి అక్క కి ఫోన్ చేస్తే నో రెస్పాన్స్
ఏమైందే మీ అమ్మ ని అడిగితే క్షణాల్లో పదివేలు నీ చేతిలో పెడుతుంది.. ఎందుకు ఈ మాత్రానికే ఆఫీస్ లో ఉన్న మీ అక్క కి కాల్ చేయడం అని అడిగింది తన ఫ్రెండ్
ఈ డ్రెస్ గురించి చెప్తే చీపురు పట్టి కొడుతుంది కూడా మా అమ్మ నాతో ఎంత ఫ్రీ గా ఉన్న ఇలాంటి వాటిలో చాలా స్ట్రిక్ట్ అని మొహం వేలాడదీసుకుంది అశ్విత
అలా టైం పాస్ చేసి బాగా అలసిపోయినా స్నేహితులు ఓ రెస్టారెంట్ లో దూరారు… అశ్వి.. నిషా తో పాటు మరో నలుగురు అమ్మాయిలు
@@@
సాయంత్ర సమయం పార్క్ లో పచ్చని చెట్ల మధ్య లో చిన్న పిల్లల అల్లర్లు… పక్షుల మృదువైన కిచ కిచలు…
సన్నని గాలితో చెట్ల ఆకులు నాట్యం చేస్తున్నాయి
అక్కడికి ఒక హై ఎండ్ కార్ వచ్చి ఆగింది… డ్రైవర్ దిగి వెనక వైపు కార్ డోర్ తీసాడు..
అందులో నుండి సూటు బూటూ వేసుకున్న ఓ పెద్ద మనిషి దిగి పార్క్ లోపలికి నడిచారు…
నెమ్మదిగా పడిపోతున్న సూర్య కిరణాలు చెట్ల కొమ్మ మధ్యలో నుండి వెలుగుని చిమ్ముతూ పార్క్ మొత్తం గోల్డెన్ షేడ్స్ తో కమ్మేస్తూ చుట్టూ గాలి వీస్తుంటే మనసుకి చాలా ప్రశాంతంగా అనిపించింది
అతడికి ఎదురు బెంచ్ పై ఓ అయిదేళ్ళ చిన్నారి తన తాతయ్య చేతిని చుట్టుకొని కూర్చొని ఐస్ క్రీం తింటూ తాతయ్య మీరు ఒక్కరే వచ్చారు మీతో పాటు ఎవరు రాలేదా అని క్యూట్ గా ప్రశ్నించింది…
ఆ పెద్దయాన చిరునవ్వు తో మీలాంటి పిల్లల్ని వాళ్ళ సంతోషాన్ని చూడటానికే వచ్చాను తల్లి అంటూ సమాధానమిచ్చాడు
@@@@@@
రెస్టారెంట్ లో కూర్చున్న ఫ్రెండ్స్ తో సోది పెడుతున్న అశ్వి కి డిస్టర్బన్స్ లా రింగ్ అయింది తన ఫోన్…
ఫోన్ తీసి నెంబర్ చూడగానే అశ్వి కి కోపం నషాలానికి ఎక్కి లిఫ్ట్ చేసిన వెంటనే నాకు ఒక 30k కావాలి అని అడుగుతుంది
అశ్విత అడిగిన అమౌంట్ కి అర్చిత కి ఒక్కసారికి తల తిరిగి కళ్ళు భైర్లు కమ్మిన ఫీలింగ్ వచ్చింది..
ఏయ్ వినిపిస్తుందా రేపటి వరకు నాకు అమౌంట్ అరేంజ్ చేయ్ అండ్ నేను ఇప్పుడు బిజీ గా ఉన్నా పెట్టెయ్ అంటూ రాష్ గా మాట్లాడి అర్చిత కి మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా కాల్ కట్ చేసింది అశ్విత
తనేం అంటుందో అర్థమవ్వక అశ్విత కి మళ్ళీ కాల్ చేసింది అర్చిత
లిఫ్ట్ చేసి ఏయ్ ఒక్కసారి చెప్తే అర్థం కాదా అంటూ ఫైర్ అయింది అశ్విత…
అది కాదు అశ్వి.. నా దగ్గర అంటూ ఉండగా మధ్యలోనే ఆపుతూ నాకు తెలుసు కానీ నాకు అమౌంట్ కావాలి ..
@ అశ్విత రియాక్షన్..?????
@ ఇంకా ఉంది
హాయ్ ఫ్రెండ్స్!! ఫాలో చేసి స్టోరీ ఎలా ఉందో చదివి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలియజేయండి…
Swipe left/right or tap the sides to turn pages