మజిలీ ❤️🧿 – 5
మజిలీ ❤️
ఎపిసోడ్ 5…..
ఆయుషి ధాత్రి వర్ష మాట్లాడు కుంటు వుండగా ధాత్రి మొబైల్ రింగ్ అవుతుంది…
దానితో ధాత్రి తన ఫోన్ ఓపెన్ చేసి చూస్తోంది డిస్ప్లే లో వున్న పేరు చూడ గానే తన కి బాధ కోపం రెండు ఒకే సారి వచ్చేస్తాయి..
వెంటనే ఆయుషి వర్ష ల వైపు చూసి గైస్ నాకు నిద్ర వస్తుంది అని చెప్పి స్పీడ్ గా తన రూం లోకి వెళ్లి పోతుంది. అది ఒక డబుల్ బెడ్ రూం ఫ్లాట్… వర్ష వాళ్ల ఇల్లు అదే సిటీ లో వుండడం వల్ల వర్ష అప్పుడప్పుడు మాత్రమే ఇక్కడికి వస్తుంది…
ధాత్రి అలా రూం లోకి వెళ్లి పోవడం తో వర్ష కూడా తన ఇంటికి వెళ్ళి పోతుంది..
మరో వైపు రూం లోకి వెళ్లి న ధాత్రి ఆగకుండా మోగుతున్న తన మొబైల్ చూసి కాల్ ఆన్సర్ చేస్తుంది..
అటు వైపు నుండి ఒక గొంతు ఎంత సేపటి నుండి నికు కాల్ చేయాలి ఫోన్ లిఫ్ట్ చేయడం తెలియదా.. అని చిరాకుగా వినిపిస్తుంది..
దానితో ధాత్రి కి కాస్త బాధగా అని పిస్తుంది.. కానీ ఆ బాధ గొంతులో తెలియ నివ్వకుండ ముందు ఎందుకు కాల్ చేశారో అది చెప్పండి అని కటువుగా అంటుంది..
దానితో అవతఅలి వైపు వున్న వ్యక్తి ఇంకో నెలలో నీ పుట్టిన రోజు గుర్తుంది గా … దానితో పాటు నాకు ఇచ్చిన మాట కూడా గుర్తు పెట్టుకో అని అంటాడు..
దానికి ధాత్రి హా నాకు అన్ని గుర్తున్నాయి.. న బర్త్ డే తర్వాత నేను ఇచ్చిన మాటను నిలబెట్టు కుంటాను..
అటువైపు నుండి ఒక గుడ్ అని చెప్పి కాల్ కట్ చేస్తాడు.. దానితో ధాత్రి అప్పటి వరకు తన కల్లోలోనే వున్న కన్నీరు ఇప్పుడు స్వేచ్చగా తన చెంపల మీద జారుతున్నాయి..
అప్పటికే తను చాలా సేపటి నుండి ఏడుస్తూ వుండడం. తో .. ఇంకా ఎంత ఏడ్చిన నువ్వు అనుకున్నది గానీ కోరుకున్నది గానీ లైఫ్ లో కి రాదు… ఇంకా దని కోసం ఏడ్చి నీ కన్నీటిని వృధా చేసుకోకు అని తన కి తాను ధైర్యం తెచ్చుకుని బెడ్ మీద పడుకుంటుంది…
కానీ ఎంత సేపు నిద్ర పోదాం అని ప్రయత్నించిన నిద్ర రాక పోయే సరికి అలాగె మంచం పై అటు ఇటూ దొర్లుతూ ఎప్పుడో తెల్ల వారుతుంది అనగా నిద్ర లోకి జారుకుంది…
ఆ నెక్స్ట్ డే మార్నింగ్ 6 కి అల్లారం మోగడం తో ధాత్రి కాస్త చిరాకుగా లెగుస్తుంది రాత్రి చాలా సేపు ఏడ్చి ఎప్పటికో నిద్ర పోవడం వల్ల తల అంత బారం గా అనిపిస్తుంది..
కానీ తను హాస్పటిల్ కి వెళ్ళాలి అని అనుకుని కిచెన్ లోకి కాఫీ పెట్టుకుని తగింది.. ఎప్పటికీ కాస్త రిలాక్స్డ్ గా అనిపించడం తో తన రూం లోకి వెళ్లి ఫ్రెష్ అయ్యి బయట కి వచ్చింది…
అప్పుడే యోగ కంప్లీట్ చేసుకుని వచ్చిన అయుషి నీ చూసి కాఫీ తాగుతావా బేబీ అని అడిగింది..
దానికి ఆయుషి హా కాఫీ తాగుతా కానీ నీ కళ్ళు ఎందుకు అంత రెడ్ గా వున్నాయి అని అడుగు తుంది..
దానికి ధాత్రి నథింగ్ రా నైట్ సరిగ్గా నిద్ర పట్టలా అంతే అని చెప్పి ఒక కాఫీ కప్ కలిపి ఆయుషి కి ఇచి బ్రేక్ ఫాస్ట్ ప్రిపేర్ చేసింది..
ఈలోపు ఆయుషి కూడా ఫ్రెష్ అయ్యి రావడం తో ఇద్దరూ కలసి బ్రేక్ ఫాస్ట్ తిని హాస్పిటల్ కి స్టార్ట్ అయ్యారు..
మరో వైపు ధీర్ మార్నింగ్ లేచి జిమ్ చేసి ఫ్రెష్ అయ్యి బ్రేక్ ఫాస్ట్ తింటున్నాడు..
అప్పుడే అక్కి కూడా వచ్చి గుడ్ మార్నింగ్ అన్నయ్య అని అడుగు తుంది..
అప్పటికే కౌసల్య గారు టిఫిన్ తినడం తో అక్కి మాట్లాడుతూ అన్నయ్య ఆ డాక్టర్ నీ కలవ డానికి ఈరోజు ఇంటి దగ్గరే ఉంటావా అని అడుగు తాడు..
దానికి ధీర్ హా నేను ఒక సారి ఆ డాక్టర్ నీ కలుస్తా… నువ్వు ఆఫీస్ కీ వెల్లు అని చెప్తాడు..
కానీ అక్కి మనసులో ఇక్కడ ఇంత మంచి సీన్ జరగ బోతుంటే నేను ఆఫీసు వెళ్లి ఏం చేస్తాను అని మనసులో అనుకుంటూ అది అన్నయ్య నేను కూడా ఆ డాక్టర్ బామ్మ కి ట్రీట్మెంట్ చేసిన తర్వాత వెళ్దా అని చెప్తాడు..
దానికి అక్కి వైపు ఒక సారి విచిత్రం గా చూసి సరే అని చెప్పి రూం లో కీ వెళ్లి పోతాడు..
ఆయుషి ధాత్రి హాస్పటల్ కి వెళ్ళే దారిలో గుడి రావడం తో ఆయుషి నీ హాస్పటల్ కి వెల్లోపోమని చెప్పి తను ఒక్కదే గుడికి వెళ్లి తన మనసులో కలుగుతున్న అలజడిని తగ్గించుకుని … తనకి దొరకని ప్రశాంతత అక్కడ దొరుకుతుందేమో అని గుడి కీ వెళ్లి ఆ శివుడు కి
దన్నం పెట్టుకుని కాసేపు ఆ కోనేటి గట్టు దగ్గర కూర్చుని హాస్పిటల్ కి వెళ్తుంది…
అప్పటికే ఆయుషి వర్ష తన కోసం క్యాబిన్ లో వెయిట్ చేస్తూ వుండడం తో తన మూడ్ నీ సెట్ చేసుకుని ఎంటి ఇద్దరు ఇక్కడ దర్శనం ఇచ్చారు… అని అడుగు తుంది..
దానికి ఆయుషి ముందు నీకు ఏమయ్యిందో అది చెప్పు అని అంటుంది..
దానికీ ధాత్రి నాకు ఏమయ్యింది ఏం కాలేదు అని చెప్తుంది..
కానీ వర్ష మాకు తెలియదా.. నువ్వు మనసు బాగొనప్పుడే గుడికి వెళ్తవని అని… అందుకే మర్యాదగా ఏం జరిగిందో చెప్పే అని అంటుంది..
కానీ ధాత్రి సైలెంట్ గా వుండడం తో అయిషీ చెప్పు మళ్ళీ ఆ మనిషి కాల్ చేశాడా.. నికు ఇంకా ఏం కావాలంటే నీ దగ్గరా నుండి అని కోపం గా అడుగు తుంది..
వర్షా కూడా అంతే కోపం గా నాకు గానీ వాడు దొరకాలి ఐ కిల్ హిమ్ అని అంటుంది..
వాళ్లిద్దరూ అలా మాట్లాడ్డం తో వదిలేయండి నాకు ఇదేం కొత్త కాదు కదా .. అని చెప్పి బాధ గా నవ్వుతు ఆ చేదు గతం ఎప్పటికీ నాకు దూరం కాదుగా అంటుంది… .
తన స్మైల్ లో కూడా పెయిన్ తెలుస్తున్టే వర్ష ఆయిషీ ఇద్దరు గట్టి గా హగ్ చేసుకుంటారు…
బేబీ ముందే చెప్తున్నా ఎవరు నీ జోలికి వచ్చిన సరే వాళ్ళని ఊరికే అస్సలు వదిలి పెట్టాను అని చెప్తుంది..
దానికి వర్ష హా అవును మేము ఇద్దరం వున్నంత కాలం నిన్ను ఎవ్వరూ ఏం చేయలేరు అని అంటుంది..
దానికి ధాత్రి గట్టిగా నవ్వుతూ మీరు సినిమా లు చూడడం కాస్త తగ్గించండే… మరి బారి బారి డైలాగ్స్ చెప్తున్నారు అంటుంది..
ధాత్రి నవ్వడం తో వాళ్ళు కూడ చిన్నగా నవ్వుతూ సరెనే మేము మళ్ళీ కలుస్తాం అని చెప్పి బయట కి వెళ్లి పోతారు..
ధాత్రి కి కూడా కౌసల్య గారికి ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన టైం అవ్వడం తో వాళ్ళ ఇంటికి స్టార్ట్ అవుతుంది…
నిన్న ఆల్రెడీ తను రావడం తో ఈ సారి డైరెక్ట్ గా లోపలికి వెళ్లి పోతుంది .
తను కార్ నీ పార్క్ చేసి కాలింగ్ బెల్ కొడుతోంది..
అప్పుడే అటుగా వెళ్తున్న అక్కి అప్పుడే డాక్టర్ వచేసినట్టుంది. అని అనుకుని వెళ్లి డోర్ ఓపెన్ చేస్తాడు..
తను అనుకున్నట్టు గానీ ఎదురుగా డాక్టర్ వుండడం తో హాయ్ డాక్టర్ గుడ్ మార్నింగ్ అని విష్ చేస్తాడు..
ధాత్రి కూడా గుడ్ మార్నింగ్ మిస్టర్ అక్కి అని విష్ చేస్తుంది..
దానికి అక్కి అయ్యో డాక్టర్ నన్ను అక్కి అని పిలవండి చాలు అని అంటాడు..
దానితో ధాత్రి ఒక్ అక్కి బామ్మ గారు మెడిసిన్ కరెక్ట్ టైం కి వేసుకుంటున్నార.. అని అడుగు తుంది..
దానికి అక్కి హా మీరు నిన్న ఒక్క సరీ చెప్పారో లేదో మా బామ్మ టైం కి మెడిసిన్ వేసుకుంటుంది.. అని చెప్పాడు..
దానికీ ధాత్రి హా అని చెప్పింది.. ఇంతలో వాళ్ళు కౌసల్య గారి రూమ్ దగ్గర కి రావడం తో ధాత్రి కౌసల్య గారి దగ్గరి కి వెల్లి బామ్మ ఎలా వున్నారు … ఇప్పుడు ఎలా ఉంది మీకు అని అడుగు తుంది..
ఎదురుగా ధాత్రి రావడం తో కౌసల్య గారు నవ్వుతూ రా తల్లీ హా నకేమయ్యింది చెప్పు నేను చాలా హెల్ది గా వున్నాను రా వచ్చి కూర్చో అని చెప్పి ఆవిడ పక్కన కూర్చో పెట్టుకుంటారు..
ధాత్రి కూడా నవ్వుతూ హా బామ్మ నువ్వు చాలా హెల్దీ గా వున్నావ్ అని చెప్పి మార్నింగ్ తను గుడికి వెళ్ళినప్పుడు అక్కడ నుండి తీసుకు వచ్చిన విభూది బామ్మ గారికి ఇచ్చి బామ్మ వుదయం నేను గుడికి వెల్ల మీకోసం విభూది తెచ్చా అని ఇస్తుంది..
బామ్మ కూడా నవ్వుతూ ఆ విభూది తీసి పెట్టుకుంటారు..
తర్వత ధాత్రి బామ్మ గారిని చెక్ చేస్తూ వుంటుంది .
మరో వైపు తన రూం లో వున్న ధీర్ కి అప్పుడే ఒక సర్వెంట్ వచ్చి సార్ డాక్టర్ గారు వచ్చారు అని చెప్పడం తో ధీర్ ఆ అమ్మాయి ఎవరు అనుకుంటూ బామ్మ రూం దగ్గర కి వెళ్తాడు..
అక్కడ బామ్మ ఒక అమ్మాయితో నవ్వుతూ మాట్లాడ్డం చూసి ఆ అమ్మయి ఒక్క రోజులోనే మ బామ్మ నీ మార్చేసింది అని అనుకుంటూ ఆ అమ్మాయిని చూడడానికి ట్రై చేస్తాడు..
కానీ ఆ అమ్మాయి బామ్మ వైపు తిరిగి వుండడం తో తన వీపు మాత్రమే తెలుస్తుంది.. కానీ ఆ అమ్మాయి నవ్వులు మాటలు తనకి బాగా పరిచయం వున్నట్టు అనిపించడం తో ఆ అమ్మాయి ఎప్పుడు ఇటు వైపు తిరిగి తుంద . అని చూస్తున్నాడు..
…..❤️మజిలీ❤️…..
Swipe left/right or tap the sides to turn pages