వైల్డ్ బిస్ట్ – 5
జాను ఏడుపు,అరుపులు వినిపించిన దగ్గరకి మిగిలిన రౌడీలు పరిగెత్తుకుంటూ వచ్చారు.
రెండు ఇళ్ల తలుపులు కాస్త 10 ఇళ్ల తలుపులుగా మారి ఒక్కొక్కరుగా అందరూ తలుపులు తెరిచారు ఆ వర్షంలో కూడా.
ఒక రౌడీ.. “అన్న ఎట్లనో గీ పోరిని సంపేశ్నం అందరూ గీడ గుమ్మిగూడక ముంగట్న్ పోదామే..” అని అన్నాడు.
“పోదాం రా.. జరా ఆగు మేడమ్ కి ఫోన్ జేసి పోదాం..” అని అంటూ ఫాస్ట్‌గా ఫోన్ కలిపాడు ఒకడు ఆ దగ్గరలో వస్తున్న సిగ్నల్ దగ్గర నిలబడి.
స్పీకర్ ఆన్ చేయడం వల్ల చాలా స్పష్టంగా వినిపిస్తుంది ఫోన్ రింగ్.
జాను కత్తిపోట్ల తర్వాత అరవడం ఏడవడం ఆగిపోయింది..
నాలుగు రింగుల తర్వాత ఫోన్ లిఫ్ట్ చేసి “హలో..!” అని అంది ఒక ఆడ గొంతు.
“మేడం మీరు సంపూమన్న పోరి ఇప్పుడే సచ్చిపోయింది.. కత్తిలతోని పొడిసినం..” అని అన్నాడు రౌడీ.
సంతోషంగా పెద్దగా నవ్వుతూ..”నిజంగా చచ్చిపోయిందా..?” అని అంది ఆశగా అడగోంతు..
“నయన్ మేడమ్ మీకెప్పుడైనా నేను అబద్ధం జేప్పిన్న..!” అని అన్నాడు నవ్వుతూ ఆ రౌడీ.
“అబద్ధం చెప్తావని కాదు.. కానీ..! అది అరుస్తున్న గొంతు వినిపించట్లేదు నాకు ఇక్కడకి..అందుకే కన్ఫామ్ చేసుకుంటున్నాను..” అని అంది రిలాక్స్ గా నయన్.
“దానిని పొడిసినప్పుడు ఈ గల్లీల మొత్తం రీ సౌండ్ అచ్చింది మేడం.
ఒక్కొక్కళ్ళు తలుపులు తెరుసుకుంటున్నారు..గాల దర్వాజలకేని మనుషులు అచ్చేటప్పటి కల్లా మీకు ఇన్ఫర్మేషన్ ఇద్దామని ఫోన్ జేసిన మేడం.
గా పొరి పొడవగానే సచ్చిపోయింది గందుకే ఓర్లకచ్చింది..” అని అన్నాడు సంతోషంగా ఆ రౌడి.
“వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ చచ్చిపోయారా..?” అని అడిగింది సంతోషంగా నయన్.
“మేము ఇంట్లోకి పోయేసరికి దాని అయ్యా, అవ్వ,అది ముగ్గురే ఉన్నారు మేడం.. ముగ్గురు చచ్చిపోయిండ్రు,పెద్దగా ఉండేటి పోరడు ఇంట్లో లేడు..” అని అన్నాడు ఆ రౌడీ.
“వాడు ఉంటే జానుని చంపనివ్వడురా.. పోనీలే వాడొక్కడే ఉండి ఏం చేస్తాడు కానీ.. మీ అకౌంట్లో డబ్బులు వేస్తున్నాను తొందరగా అక్కడ నుంచి బయటపడండి..” అని నవ్వుతూ ఫోన్ కట్ చేసింది నయన్.
టార్చ్ లైట్ వెలుతురులో కత్తులకి ఉన్న రక్తాన్ని చూసి ఇంకోసారి అందరూ కన్ఫర్మ్ అయ్యారు జాను చచ్చిపోయింది అని..ఇక నయన్ ఇన్స్ట్రక్షన్స్ తో రౌడీలు ఫాస్ట్ గా అందరూ అక్కడ నుంచి కదిలారు..
ఒక్కొక్కరుగా అందరూ ఇళ్లల్లోంచి బయటకు వచ్చి టార్చ్ లైట్ వేశారు..వాళ్లకి గొంతు వినిపించిన వైపు.
సరిగ్గా ఎనిమిది నిమిషాల ముందు అంటే రౌడీలు టార్చ్ లైట్ ఆఫ్ చేసి కత్తులతో జానుని పొడి చేసే సమయంలో..
అంత చీకట్లో ఒక దగ్గర మాత్రం చిన్నగా వెలుతురు కనిపించడంతో అర్జున్ అటువైపుగా అడుగులు వేశాడు.. నెగిటివ్ వైబ్రేషన్స్ తగలడంతో.
రౌడీలతోపాటు అర్జున్ కి కూడా జాను కనిపించింది ఆ సమయంలో.
వాళ్లు జానుని పొడవబోయే ముందు టార్చ్ ఆపడంతో ఫాస్ట్‌గా జాను ప్లేస్ లోకి అర్జున్ వెళ్ళాడు.. వాళ్ళని ఆపడం కంటే కూడా జానుని కాపాడుకోవడం ఆ క్షణం అర్జున్ కి ముఖ్యం అనిపించింది.
రౌడీలు పొడిచిన మొదటి కత్తిపోటుని ఆపడానికి అర్జున్ చెయ్యితో ఆ కత్తిని పట్టుకున్నాడు..
జానుకి రౌడీలతోపాటు అర్జున్ కూడా కనిపించాడు.. అర్జున్ ఆ కత్తిని పట్టుకోవడం జాను కి తెలుస్తూనే ఉంది అందుకే పెద్దగా అరిచింది తన అన్నకి ఏమవుతుందో అనే భయంతో.
వాళ్లు పొడిచిన ఐదుసార్లు కూడా అర్జున్ రెండు చేతులతో పట్టుకున్నాడు జాను పొట్టలోకి ఆ కత్తి దిగకుండా చూసుకోవడం కోసం..
వాళ్లు పొడిచిన ప్రతిసారి తన అన్నకి కత్తి దిగుతుంది అనే బాధతో పెద్దపెద్దగా అరిచింది జాను.
వాళ్లు పొడవడం ఆపేయగానే చేతులు చచ్చుబడిపోయాయి అర్జున్ కి.. చేతులు పైకి లేపడానికి కూడా అవ్వలేదు..
కానీ..! జాను ఇంకా అరవడం ఆపకపోతే వాళ్లకి డౌట్ వస్తుంది అని జాను కొంగుని మూటగా కట్టి జాను నోట్లోకి కుక్కి.. చెవులో మెల్లగా చెప్పాడు..”ఆరవకు అమ్మ..ప్లీజ్..” అని.
బాధ కట్టలు తెంచుకు వస్తున్నా అరవకుండా చాలా ఓర్చుకుంటూ వాళ్ళ అన్నయ్య చుట్టూ చేతులు వేసి మూగగా రోధించింది జాను..
అరుపులు వినిపించిన దగ్గరకి ఆ చూట్టు పక్కల వాళ్ళు వచ్చారు టార్చ్ లైట్ వెలుతురులో.
అర్జున్ చుట్టూ చేతులు వేసి మూగగా రోదిస్తూ ఉంది జాను.. ఒక పక్కన రక్తస్రావం జరుగుతుంది..ఉమ్మనీరు అంతా పోయి బిడ్డ తల కూడా పైకి స్పష్టంగా తెలుస్తూ ఉంది చీర తడిసిపోవడంతో.
అర్జున్ చేతులు సగానికి ఎక్కువగా తెగిపోయి ఉన్నాయి.. ఇద్దరూ రక్తపు మడుగులలో అక్కడ జనాలకి కనిపించేసరికి భయంగా హుటా హుటిన ఆ దగ్గరలో ఉన్న కారును తీసుకువచ్చి అన్నాచెల్లెలని కారులో కూర్చోబెట్టి.. ముందు రెండు బైకులు,వెనుక రెండు కార్లు వాళ్ళని ఫాలో చేస్తూ దగ్గరలో ఉన్న హాస్పటల్ కి తీసుకువెళ్లారు అక్కడి జనాలు.
ఇక ఉంటాను
మీ అల్లరి రాక్షసి ప్రశాంతి శ్రీకాంత్..❤️❤️❤️
Swipe left/right or tap the sides to turn pages