వైల్డ్ బిస్ట్ – 4
“మేడంకి ఈ పోరి అంటే ఎందుకు అన్న గంత కోపం కడుపుతోటి ఉన్నది అని తెలిసిన నుంచి చంపేయండి అని అంటుంది..” అని అన్నాడు ఒకడు తల గోక్కుంటూ.
“మన మేడంకి సార్ కి ఈ పోరే అడ్డం రా.. గీ పోరిని చంపేస్తే మన సారు మన మేడం తో పోరగాండ్లని కంటాడు..” అని అన్నాడు ఒకడు.
“మేడం సారు పోరల్ని కనడానికి ఈ పోరి ఎందుకు అడ్డమైతది అన్న.. ఎటో దూరం అచ్చి బతుకుతుంది కదా..!” అని అన్నాడు ఏమీ అర్థం కాక ఒకడు.
జాను నోరు మూసుకొని వాళ్ళ మాటలు వింటుంది కన్నీళ్ళతో.
“గీ పోరి పోరడిని కని.. ఈడు ఆ ఆస్తికి వారసుడు అని తీసుకొస్తాది అనే భయం అనుకుంటారా..” అని అన్నాడు ఒకడు.
“అవ్వన్న అది కూడా నిజమే..” అని అన్నాడు వాడి సమాధానానికి సాటిస్ఫై అవుతూ ఇంకొకడు.
వాళ్ళ మాటలు విని ఏడుస్తూ..”నీకు దూరంగా వచ్చేసాను కదా విజ్జు.. అయినా సరే ఎందుకు నేనంటే నీకు అంత పగ..
నేను ఏం పాపం చేశాను రా నిన్ను ప్రేమించడం తప్ప నేను ఏ తప్పు చేయలేదు కదా..
అయినా ఎవరి మీద పగరా నీకు.. నా కడుపులో ఉన్న మన బిడ్డని చంపడానికి మనుషుల్ని పంపిస్తావా నువ్వు అసలు మనిషివా..!
అయినా నేను ప్రేమించినప్పుడు నువ్వు ఇలా లేవు కదా..! ఇప్పుడు ఎందుకురా ఇలా తయారయ్యావు.
వీళ్ళ నుంచి నేను తప్పించుకొని నా బిడ్డని ఎలా కాపాడుకోవాలి..” అని ఏడుస్తూ ఆ చెట్టు దగ్గర కూర్చుండిపోయింది నిస్సహాయంగా జాను.
“పదండి రా.. అది ఇక్కడే ఎక్కడో అక్కడ ఉండే ఉంటుంది..” అని అంటూ తల ఒక్క దిక్కుకి వెళ్లారు వాళ్ళు.
జానుని వెతుకుతూ వస్తూ ఉండగా రెండు వీధుల తర్వాత రక్తపు మడుగులు కనిపించాయి అర్జున్ కి..
అప్పటికే తల్లి,తండ్రి శవాలని చూసిన అర్జున్ కి భయంతో వణుకు వచ్చింది.. చెల్లిని తన కడుపులో ఉన్న బిడ్డని ఎలా చూస్తానో అనే భయంతో..
ముక్కోటి దేవతలని మనసులోనే స్మరిస్తూ ఉన్నాడు..” అది ఇంకా జీవితాన్ని చూడలేదు స్వామి..
ఎలాగో కన్నీళ్ళని బహుమతిగా ఇచ్చావు.. అదే చిన్నచూపుతో దానికి జీవితమే లేకుండా చేయకు.. దాన్ని కడుపులో ఉన్న బిడ్డకి ఊపిరిని కరువు చేయకు..” అని రక్తపు మడుగు ఉన్న దగ్గర నుంచి పరీక్షగా టార్చ్ వేసి ఆ రక్తపు మరకలని గుర్తులుగా చేసుకొని ముందుకు వెళుతూ ఉన్నాడు ఆశని చంపుకోకుండా అర్జున్.
పెళ్లు పెళ్లు మని ఉరుములు ఉరిమి వర్షం ఒక్కసారిగా విజృంబించసాగింది..
ఒక్క నిమిషంలోనే నేలతల్లి తడిసి ముద్దాయి బురదగా కూడా మారింది.
అప్పటికే ఓపిక అంతా నశించిపోయి అడుగు కూడా ముందుకి పడకపోవడంతో చెట్టు దగ్గర కూర్చున్న జాను అలాగే చతికలబడింది.. పైకి లెగవలేక.
మొత్తం తిరిగిన ఎక్కడ జాను జాడ దొరకకపోవడంతో ఒక దగ్గర నిలబడ్డారు ఇద్దరు రౌడీలు.
వర్షంలో తడుస్తూ చిరాకుగా తిట్టుకుంటూ ఉన్నారు..” ఇది ఎటు వెళ్ళింది రా..!” అని.
అధిక రక్తస్రావం జరుగుతూ ఉండగా.. నొప్పిని భరిస్తూనే ఏడుస్తూ ఉంది జాను.
వర్షం వల్ల ఎగువ నుంచి దిగువకి నీటి వరదా పోటెత్తతూ ఉంది.. ఆ వరదలో జాను రక్తం కూడా కిందకి పారుతూ ఉంది.
ఒక దగ్గర నిలబడ్డ రౌడీలా కాళ్ళ దగ్గర నుంచి ఎర్రగా నీళ్లు పారుతూ ఉండడంతో టార్చ్ వేసి చూశారు.. అది నీళ్లు కాదు రక్తము అని ఆ నీటిని చేతిలోకి తీసుకొని వాసన చూసినా ఒకడికి క్లారిటీ వచ్చింది.
ఇద్దరూ ఒకరికి ఒకరు సైగలు చేసుకొని ఆ రక్తపు నీరు వచ్చే దగ్గరకి జాగ్రత్తగా వెళుతూ ఉన్నారు.
చెట్టు కింద కూర్చున్న జాను ని చూసి వేకిలిగా ఒక నవ్వు నవ్వుకొని.. టార్చ్ ఉంటే అక్కడ జరిగే ఘోరం అందరికీ తెలుస్తుంది అని టార్చ్ ఆఫ్ చేసి ఇద్దరు రెండు కత్తులతో జాను కడుపు దగ్గర పొడిచారు చాలా గట్టిగా,బలంగా.
“అమ్మ..”అని పెద్దగా ఏడుస్తూ అరిచింది జాను..
ఐదారు పోట్లు గట్టిగా బలంగా దించారు కత్తులని..ఆ కత్తి పోట్లకి పెద్దగా ఏడుస్తూ అరిచింది జాను.
అంత పెద్ద వర్షంలో కూడా,పెద్ద పెద్దగా ఉరుముతున్న ఉరుములకి కూడా జాను అరుపు ఆ చుట్టుపక్కల మార్మోగిపోయింది.
జాను అరుపు ఎంతలా వినిపించింది అంటే..! వేరే దగ్గర వెతకడానికి వెళ్లిన రౌడీలు కూడా ఆ అరుపు వినిపించిన దగ్గరకి పరిగెత్తుకుంటూ వచ్చే అంత పెద్దగా వినిపించింది జాను ఏడుపు.
జాను గట్టిగా అరిచేసరికి ఒక్కొక్కరు మెల్లగా తలుపులు తీయడం మొదలుపెట్టారు ఆ చుట్టూ ఉన్న ఇళ్ల వాళ్ళు..
జాను ఏడుపు,అరుపులు వినిపించిన దగ్గరకి మిగిలిన రౌడీలు పరిగెత్తుకుంటూ వచ్చారు.
రెండు ఇళ్ల తలుపులు కాస్త 10 ఇళ్ల తలుపులుగా మారి ఒక్కొక్కరుగా అందరూ తలుపులు తెరిచారు ఆ వర్షంలో కూడా.
ఇక ఉంటాను
మీ అల్లరి రాక్షసి ప్రశాంతి శ్రీకాంత్..❤️❤️❤️
Swipe left/right or tap the sides to turn pages