New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
వైల్డ్ బిస్ట్ – 3

వైల్డ్ బిస్ట్ – 3

కొన ఊపిరితో ఉన్న ఆయన..”అర్జున్.. జాను,అమ్మ….” అని అన్నాడు.. వంటగది వైపు చేయి చూపిస్తూ అలాగే కళ్ళు మూసుకోని చివరి శ్వాస వదిలేసాడు.. ఆయన కొడుకు చేతిలోనే.

 

 

“నాన్న.. నాన్న..” అని భయంగా అరుస్తూ ఆయనని ఊపుతూ ఉన్నాడు అర్జున్.

 

 

ఉలుకు పలుకు లేని శరీరాన్ని ఎంత ఊపిన నిరుపయోగమే అయింది.. వెంటనే ఆయన చూపించిన వైపు పరిగెత్తాడు టార్చ్ లైట్ వెలుతురులోనే.

 

 

వంటగది తలుపు తెరిచే ఉంది.. వంటగది లోపలకి అడుగుపెట్టగానే టార్చ్ లైట్ వెలుతురులోనే తల్లి శరీరం రక్తం కారుతూ కనిపించింది భయంకరంగా.

 

 

వణికే గొంతుతో “అ..మ్మ..!” అని అన్నాడు అడుగు కూడా ముందుకు పడను అని మొరాయిస్తుండగా.

 

 

ఉలుకు పలుకులేని తల్లి శవం దగ్గరకి వెళ్లి ఎప్పుడూ నవ్వుతూ ఉండే ముఖాన్ని తడుముతూ.. “అమ్మ..” అని అంటున్నాడు అప్పుడే మాటలు వస్తున్న చంటి బిడ్డల అర్జున్.

 

 

ఎంత పిలిచినా అడవిలో మృదంగ ధ్వనమే అయ్యింది అర్జున్ పిలుపు.. ఇటు నుంచి వినిపించడమే కానీ అటు నుంచి పలకరించడం లేదు.

 

 వణకుతున్న వేలిని తన తల్లి ముక్కు దగ్గర పెట్టాడు కళ్ళు మూసుకొని బాధగా గుటకలు మింగుతూ..

 

 

శ్వాస ఆడుతున్నట్టుగా ఏ కోశానా తెలియట్లేదు.. కానీ..! దానిని నమ్మడానికి తన మనసు ఒప్పుకోలేదు.

 

 మళ్లీ ప్రయత్నించాడు ముక్కు దగ్గర వేళ్ళిని పెట్టి.. ఈసారి కూడా శ్వాస తన చేతి వేళ్ళికి తగలలేదు.

 

 “నేను ఒప్పుకోనమ్మ నువ్వు నన్ను వదిలిపెట్టి వెళ్ళలేదు కదా..!” అని ఏడుస్తూ తల్లి గుండె మీద తన చెవిని ఆనించాడు.

 

 ఆ గుండె కొట్టుకుంటుందేమో.. తన తల్లి తన మాట వింటుందేమో అనే చివరి ఆశగా.

 

 ఆ ఆశ కూడా అడియాశగా మిగిలిపోయి వీధి తనని వెక్కిరించింది,తన తల్లిని తీసుకువెళ్లిపోయి.

 

 బలంగా భూమి మీద పిడికిలితో ఒక గుద్దు గుద్ది..” అమ్మ నాతోటి ఆడకు.. ఒక్కసారి కళ్ళు తెరిచి చూడమ్మా..” అని అన్నాడు వాళ్ళ అమ్మని ఒడిలో పడుకోబెట్టుకుంటూ అర్జున్.

 

 

తల్లి ఒంటిమీద పదునుగా దిగిన కత్తిపోట్ల వల్ల రక్తం ఆ వంట గది మొత్తం పారుతూ ఉంది,ఆఖరికి అర్జున్ శరీరం మీద కూడా వెచ్చటి రక్తం కౌగిలించింది.

 

 

ఎప్పుడు చల్లగా నవ్వే తల్లి ఈరోజు రక్తపు మడుగులో తనకి కనిపిస్తుంటే చూసి తట్టుకోలేకపోయాడు.. పెద్దగా అరుస్తూ ఉన్నాడు..”అమ్మ.. అమ్మ..” అని కన్నీళ్ళతో పిచ్చోడిలా తన తల్లిని చూసుకుంటూ ఉన్నాడు.. విచ్చటి రక్తపు మరకలు వెక్కిరిస్తూ ఉండగా.

 

 

రెండు నిమిషాల తర్వాత తన మెదడు ఇచ్చిన సంకేతం.. “అమ్మానాన్న ఉన్నారు మరి జాను ఏది..?” అని తన మనసు ప్రశ్నించగానే తన కళ్ళు ఇల్లు అంతా వెతుకుతూ ఉన్నాయి.

 

 “తన రక్తసంబంధం,తోడపుట్టిన చెల్లి ఏది?” అని తన బుద్ధి ప్రశ్నిస్తూ ఉండగా ఏడుస్తూనే వాళ్ళ అమ్మని అక్కడ పడుకు పెట్టి ఇల్లు అంతా కలియతిరిగాడు.

 

 ఎక్కడ కనిపించలేదు..అప్పుడు గుర్తొచ్చింది నాన్న వంటగది వైపు చూపించడు అంటే..! వంటగది దగ్గర ఉందా..? అని మళ్లీ వెనకకి వచ్చాడు.. వంటగది తలుపులు తీసి ఉన్నాయి..పెరడువైపున.

 

 

 వెంటనే పెరటి తలుపుల నుంచి గేటు దగ్గరకి వచ్చాడు.. ఆ చీకట్లో ఏమీ తెలియట్లేదు.

 

 వెంటనే మళ్ళీ టార్చ్ ఆన్ చేసుకొని పరిగెత్తాడు ముందుకి..”జాను.. జాను..” అని అరుస్తూ అర్జున్.

 

 

ఉరుములు ఈదర గాలులు ఎక్కువయ్యాయి.. అందరి తలుపులు దగ్గరికి వేసి ఉన్నాయి.. ఉరుములు,ఈదర గాలి వల్ల ఎక్కడ మచ్చుకకి కూడా కరెంటు లేదు,వెలుతురు లేదు.

 

 

 

 

జాను పరిగెడుతూ ఉంటే గాజుల శబ్దం, పట్టాల శబ్దం..రక్తస్రావం వల్ల కడుపునొప్పి, ఆ నొప్పిని ఎంత అదిమిపెట్టిన పంటి బిగువున నుంచి జారీ వస్తున్న సన్నని అరుపులు.. వాటి తాలూకు శబ్దాలు కూడా ఆ మృగాలకి వినిపించి జాను ఎటు వెళ్తే అటు వెళ్లడం మొదలుపెట్టారు.

 

 

ఆకాశం వైపు చూస్తూ..”నాకే ఎందుకు స్వామి ఇన్ని బాధలు.. ఇప్పుడు నా బిడ్డ ప్రాణాలతో నాకు దక్కుతాడా..!

 

 వాడు ఏం చేశాడమ్మా..? ఈ పాపిష్టి తల్లి కడుపున పడడమేనా వాడు చేసిన పాపం..” అని ఏడుస్తూనే వాళ్లకి దొరకకుండా పారిపోవడానికి పరిగెడుతూ ఉంది కాళ్ళు ఇడుస్తూ జాను.

 

 

“అది ఏడ ఉంది అన్నా.. ఎప్పుడు చూసినా మనకి దగ్గరలో ఉన్నట్టే అనిపిస్తుంది దొరకట్లేదు..” అని అన్నాడు ఒక్కడు అసహనంగా.

 

 

వాళ్ల మాటలు వింటూ చెట్టు చాటున నిలబడింది జాను.. నోటిని గట్టిగా మూసుకుంటూ.

 

 

“అది ఏడ ఉన్నా ఈరోజు దాన్ని చంపి మేడంకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి రా..

 

 లేకపోతే ఈసారి ఇది తప్పించుకుంటే మనకి డబ్బు ఇవ్వడం పక్కన పెడితే,మన ప్రాణాలు తీసుకుంటుంది మేడం..” అని అన్నాడు ఒకడు ఆవేశంగా.

 

 

“మేడంకి ఈ పోరి అంటే ఎందుకు అన్న గంత కోపం కడుపుతోటి ఉన్నది అని తెలిసిన నుంచి చంపేయండి అని అంటుంది..” అని అన్నాడు ఒకడు తల గోక్కుంటూ.

 

 

 

 

 

 

ఇక ఉంటాను 

మీ అల్లరి రాక్షసి ప్రశాంతి శ్రీకాంత్..❤️❤️❤️