అర్జున్ చేతులు సగానికి ఎక్కువగా తెగిపోయి ఉన్నాయి.. ఇద్దరూ రక్తపు మడుగులలో అక్కడ జనాలకి కనిపించేసరికి భయంగా హుటా హుటిన ఆ దగ్గరలో ఉన్న కారును తీసుకువచ్చి అన్నాచెల్లెలని కారులో కూర్చోబెట్టి.. ముందు రెండు బైకులు,వెనుక రెండు కార్లు వాళ్ళని ఫాలో చేస్తూ దగ్గరలో ఉన్న హాస్పటల్ కి తీసుకువెళ్లారు అక్కడి జనాలు.
హాస్పటల్ సిబ్బంది జాను ని ఐసీయూలోకి తీసుకువెళ్లారు.. అర్జున్ కి ఎనస్తీషియా ఇచ్చి చేతులకి స్టిచెస్ వేసి,బ్యాండేజ్ వేసి, పెయిన్ కిల్లర్ వేసి.. “సర్ నో అబ్జెక్షన్ లెటర్ మీద సైన్ చేయండి లోపల పేషంట్ కొంచెం సీరియస్ గా ఉంది..” అని అంది నర్స్.
అంత నొప్పిలో కూడా..” ప్లీజ్ మా చెల్లిని ఎలాగైనా కాపాడండి..” అని అన్నాడు వాళ్ళ అమ్మ నాన్నని గుర్తు తెచ్చుకుంటూ అర్జున్.
“డాక్టర్ లోపల సిజేరియన్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసింది సార్.. కొంచెం ఈ ఫామ్ ఫిలప్ చేసి సైన్ చేయండి..” అని అంది నర్స్ ఎలాంటి భావం ముఖంలో చూపకుండా.