New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
మనసా మాట వినవే – 3

మనసా మాట వినవే – 3

                               పార్ట్…3

 

అయినా నువ్వేంటి ఇలా తయారు అయ్యావ్. అనుకోకుండా సిద్దు బావ తో పెళ్లి అయ్యింది. ఎలాగో నువ్వు ప్రేమించిన వాడినే చేసుకున్నావు హ్యాపీ గా ఉంటావ్ అనుకుంటే బావ నా జీవితం లో లేదు అది ఇది మాట్లాడుతున్నావు. అసలు ఏమైంది ” అని అడగగానే 

 

శ్యామ్ కళ్ళ ముందు మొత్తం ఫ్లాష్ లా వచ్చి వెళ్తున్నాయి. తను చెప్పడం మొదలు పెట్టింది.

 

 

పెళ్లి ఇంకా గంట సమయం ఉంది అనగా శ్యామ్ తన ఫోన్ లో మాట్లాడుతూ అలా మండపం వెనక్కి వెల్లింది.

 

అక్కడ తన బావ ప్రేమించి పెళ్లి చేసుకోబోయే శ్వేత తన చేతిలో ఉన్న బ్యాగ్ నీ గోడకు  అవతల వేసి నిచ్చేనని ఎక్కుతూ కనిపించింది.

 

వెంటనే వెళ్ళి తన చెయ్యి పట్టి కిందకి లాగి ” ఎంటి శ్వేత ఏం చేస్తున్నావు నువ్వు ” అని అడిగింది.

 

” నీకు ఎందుకు నోరు మూసుకుని వెళ్లు ” అని మళ్ళీ అటు వైపు వెళ్ళింది.

 

” హేయ్ ఆగు  ” అంటూ శ్వేత చెయ్యి పట్టి ఆపుతూ 

 

” ఎక్కడికి వెళ్తున్నావు గంటలో నీ పెళ్లి. అది కూడా నువ్వు ప్రేమించిన సిద్దు బావ తో ” 

 

శ్వేత గట్టిగా నవ్వుతూ ” ప్రేమా. అసలు నేను నీ బావ నీ ప్రేమించలేదు. జస్ట్ డబ్బు కోసం ప్రేమించినట్టు నాటకం ఆడాను అంతే.

 

నేను ప్రేమించింది అని అటు పక్క తిరిగి చూడగానే అక్కడికి ఒక అబ్బాయి వచ్చి నిల్చున్నాడు.

 

సమీర్ ఇతన్నే నేను ప్రేమించింది. ఎలాగో ఇంట్లో డబ్బు నగలు దొరికాయి. ఇంక నాకు నీ బావ తో ఏం పని లేదు. రా సమీర్ వెళ్దాం అని అతని చెయ్యి పట్టుకుని ముందుకూ కదిలింది.

 

శ్యామ్ కోపంగా శ్వేత చెయ్యి పట్టి వెనక్కి లాగి తన చెంప పై గట్టిగా నాలుగు వెళ్లు అచ్చు పడేలా కొట్టింది.

 

” నన్నే కొడుతావ ” అంటూ శ్వేత కోపంగా చెంప పై చెయ్యి పెట్టుకుని చూడడంతో ” కొట్టడం కాదు చంపేస్తా. ఎంత ప్రేమించాడు తెలుసా బావ నిన్ను. ఇలా మోసం చేస్తావా “

 

” ఎవరు ప్రేమించుమన్నాడు. నేను అడిగానా. ఎవరో రాసిన లెటర్ చూసి నేనే రాశాను అనుకున్నాడు. మేము తన గురించి ఎంక్వైరీ చేస్తే బాగా డబ్బు ఉన్న వాడు అని తెలిసింది. అందుకే ఆ లెటర్ నీ అడ్డు పెట్టుకుని నాటకం ఆడాను. ఈ డబ్బు మా జీవితాలకి సరిపోతుంది ” అంది నవ్వుతూ.

 

అలా నవ్వుతూ శ్యామ్ వెనక్కి చూసిన శ్వేత అలాగే నిలబడి పోయింది కళ్ళు పెద్దవి చేసుకుని.

 

తనని అలా చూసిన శ్యామ్ ఎంటి అని వెనక్కి తిరిగి చూసింది. అక్కడ సారిక నిలబడి ఉంది కోపంగా వారి వైపు చూస్తూ.

 

వాళ్ళు తనని చూడగానే పరుగు లాంటి నడకతో వచ్చి శ్వేత ఆ చెంప ఈ చెంప చెళ్లుమనిపించింది.

 

శ్వేత కోపంగా సారిక వైపు చూస్తూ ఎంత పొగరే నీకు నన్నే కొడుతావా అంటూ చెయ్యి పైకి ఎత్తింది.

 

వెంటనే శ్యామ్, శ్వేత చెయ్యి పట్టుకుని ఆపి ” తన పై చెయ్యి పడిందో ఇక్కడే నిన్ను చంపి పాతి పెడతా. ఇప్పుడే నీ గురించి అందరికీ నిజం చెప్పేస్తా  ” అంటూ

 

” సారికా వీళ్ళని ఎటు పోనికుండా చూసుకో  ఇప్పుడే అత్తయ్య, మావయ్య నీ తీసుకుని వస్తా ” అంటూ అక్కడి నుండి వేగంగా లోపలికి వెళ్ళింది.

 

అక్కడ సిద్దు కనిపించాడు ” ఎంటే అంత కంగారుగా ఉన్నావు ” అని అడిగాడు.

 

” ఏం లేదు బావ అత్త, మావయ్య ఎక్కడ ఉన్నారు “

 

” వాళ్ళు పైన గదిలో ఉన్నారు. ఏమైంది శ్యామ్ “

 

” ఏం లేదు బావ ఊరికినే మాట్లాడుదాం అని ” అంది నవ్వుతూ.

 

” సరే వెళ్లు ” అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు సిద్దు.

 

వెంటనే పరిగెడుతూ పైన గదిలోకి వెళ్లింది శ్యామ్ తలుపు తెరుచుకుంటూ.

 

లోపల సిద్దు వాళ్ళ అమ్మా నాన్న సునంద, శ్రీనివాస్ తో పాటు శ్యామ్ వాళ్ళ అమ్మా నాన్న శారద, ఆనంద్ కూడా ఉన్నారు.

 

” ఏమైంది శ్యామ్ ఎందుకు అలా ఆయాస పడుతూ పరిగెడుతున్నవు ” అని అడిగాడు వాళ్ళ మావయ్య శ్రీనివాస్.

 

” ఏమైంది అంటే చెప్పవెంటే ” అని వాళ్ళ అమ్మ  శారద.

 

సునంద ” ఆగండి మీరు మీ ప్రశ్నలు ” అంటూ వెళ్లి శ్యామ్ నీ తీసుకుని వచ్చి కూర్చోబెట్టి మంచి నీళ్ళు ఇచ్చింది.

 

వాటిని గడ గడ తాగేసి ” అత్త ఆ శ్వేత మనం అనుకున్నట్టు బావ నీ ప్రేమించలేదు. డబ్బు కోసం నాటకం ఆడీ ఇంట్లో ఉన్న డబ్బు, నగలు తీసుకుని వెళ్ళిపోతుంది ” అంది.

 

” ఎంటే ఆ అమ్మాయి ఎందుకు అలా చేస్తుంది. తను సిద్ధుని ప్రాణంగా ప్రేమిస్తుంది ” అంది శారద.

 

వాళ్ళ అమ్మ వంక కోపంగా చుస్తు ” అలానే అందరినీ మోసం చేసింది. రండి చూపిస్తా ” అంటూ సునంద చెయ్యి పట్టుకుని కిందకి వెళ్ళింది.

 

అందరూ ఒకరి మొహాలు ఒకరు చూసుకుని లేచి వాళ్ళ వెంట వెళ్లారు.

 

కిందకి వచ్చి చూసిన శ్యామ్ అక్కడ శ్వేత కానీ సమీర్ కానీ కనిపించక పోవడంతో అలాగే నిలబడి పోయింది.

 

అక్కడ  సారిక కింద పడిపోయి తన మోచేయి కి దెబ్బ తగలడంతో తనకి అంటుకున్న మట్టిని దులుపుకుంటు కనిపించింది.

 

 

” సారిక ఏమైంది. ఎలా పడిపోయావు ” అంటూ వెళ్లి తనని లెపింది శ్యామ్.

 

” సారి శ్యామ్ వాళ్ళని ఆపలేకపోయా ” అంది బాధగా.

 

” వాళ్ళ గురించి నువ్వు సారి చెప్పడం ఎంటి. వాళ్ళ నిజస్వరూపాలు తెలిసాయి పెళ్లికి ముందే. అది చాలు పెళ్లి తరువాత తెలిసి ఉంటే బావ ఎంత బాధ పడే వాడు ” 

 

వాళ్ళ మాటలు అర్థం కాని సునంద, శ్రీనివాస్ అలాగే  శ్యామ్ వాళ్ళ అమ్మా శారద నాన్న  ఆనంద్ కూడా  ముందుకు వచ్చి వాళ్ళని చూస్తూ ఏమైంది అని అడిగారు.

 

సారిక జరిగింది మొత్తం చెప్పడంతో సునంద అలాగే ఏడుస్తూ ” ఇప్పుడు ఈ విషయం వాడికి తెలిస్తే ఎంత బాధ పడతాడు. ఏమైపోతాడో. ఇంటి పరువు అంత గంగలో కలిపేసింది ” అంది.

 

” ఏడవకు అత్త ఏం కాదు. బావ కి మొత్తం చెప్తా. అర్థం చేసుకుంటాడు ” అంటూ సిద్దు గది వైపు వెళ్ళింది శ్యామ్.

 

సునంద శ్యామ్ చెయ్యి పట్టుకుని ఆపేస్తు” వాడికి చెప్పకే ” అంది.

 

” చెప్పకపోతే ఎలా అత్త. ఈ పెళ్లి జరుగుతుంది అని ఎదురు చూస్తున్నారు అందరూ “

 

” ఈ పెళ్లి జరుగుతుంది ” అంది సునంద ఎదో నిర్ణయానికి వచ్చిన దానిలా.

 

శ్యామ్ అర్థం కాక ” శ్వేత లేకుండా ఎలా జరుగుతుంది ” అంది.

 

శ్యామ్ వైపు చూస్తూ ” నాకోసం ఒకటి చేస్తావా శ్యామ్ ” అని అడిగింది.

 

” ఎంటి అత్తమ్మా “

 

” ఈ ఇంటి పరువు, సిద్దు భవిష్యత్తు నీ చేతిలోనే ఉంది ” 

 

” నేను ఏం చేయగలను  “

 

” సిద్ధుని నువ్వు పెళ్లి చేసుకోవాలి ” అనగానే షాక్ లో అలాగే ఉండిపోయింది శ్యామ్.

 

ఆ మాటకి అక్కడ ఉన్న వారు అందరూ షాక్ అయితే సారిక మాత్రం సంతోష పడింది.

 

శ్యామ్ ఆశ్చర్యంగా ” ఎంటి అత్తమ్మా నేను బావ నీ పెళ్లి చేసుకోవడం ఎంటి. బావ కి తెలిస్తే నన్ను చంపేస్తాడు ” అంది భయంగా.

 

” ఒప్పుకో శ్యామ్ నువ్వు కూడా అన్నయ్యని ప్రేమించావూ కదా ” అంది సారిక.

 

శ్యామ్ సారిక వైపు కోపంగా చూస్తుంటే అందరూ షాక్ అయిపోయారు ఆ మాటకి.

 

” ఎంటి తల్లి నువ్వు అనేది. శ్యామ్ అన్నయ్యని ప్రేమించిందా ” అన్నాడు శ్రీనివాస్.

 

” అవును డాడ్. కానీ మధ్యలో శ్వేత వచ్చి అంత చెడ గొట్టింది “

 

శారద, ఆనంద్ శ్యామ్ వైపు చూసారు. తను ఏం మాట్లాడకుండా తల దించుకుంది.

 

సునంద ” ప్రేమించిన వాడికి పెళ్లి చేసే అంత పెద్ద గుండె ఎంటే నీది ” అంది కళ్ళ నీళ్లతో.

 

శ్యామ్ కూడా అప్పటి వరకు ఆపుకున్న కన్నీళ్లను స్వేచ్చగా వదులుతూ ” బావ సంతోషం కోసం నేను ఏమైనా చేస్తాను అత్తమ్మా ” అంది.

 

శ్రీనివాస్ వచ్చి శ్యామ్ తల నిమురుతూ ” బంగారు తల్లి ఎంత బాధ దాచుకున్నవు రా మనసులో. అప్పుడే మావయ్య నేను బావ నీ ప్రేమిస్తున్న అని చెప్తే ఈ పాటికి మి పెళ్లి అయిపోయేది కదా ” అన్నాడు బాధగా.

 

” బావ కి ఇష్టం లేకుండా నేను ఎలా చేసుకుంటా. బావ నన్ను ఒక ఫ్రెండ్ గా చిన్న పిల్లలా మాత్రమే చూస్తాడు. అంతకు మించి ఏం లేదు ” అంది ఏడుస్తూ.

 

ఏడుస్తున్న కూతురిని చెరో పక్క కౌగిలించుకున్నారు శారద, ఆనంద్.

 

కాసేపు అలాగే వదిలేశారు తనని.

 

” శ్యామ్ ఎలా అయినా మా పరువు కాపడవే ఈ పెళ్లి చేసుకుని ” అంది సునంద.

 

” బావ కి నా పై కోపం వస్తుంది అత్త. అప్పుడు నాతో మాట్లాడడు. నేను అది తట్టుకోలేను ” అంది ఏడుస్తూ.

 

” వాడు నిన్ను ఎప్పుడైనా కోప్పడ్డాడ చెప్పు. నీకు చేతులు ఎత్తి మొక్కుతున్న ” అంటూ దణ్ణం పెడుతున్న సునంద చేతులని మధ్యలోనే ఆపెస్తు

 

” ఎంటి అత్తా ఇది. నువ్వు నన్ను పెద్దదాన్ని చేస్తున్నావు “

 

” శ్యామ్ అమ్మ చెప్పింది నిజమే. అన్నయ్యకి నువ్వే సరైన జోడీ. నా మాట విని ఈ పెళ్లి చేసుకో ” అంది సారిక.

 

” ఒకటి అడుగుతాను నిజం చెప్పవే ” అంది సునంద.

ఎంటి అన్నట్టు చూసింది శ్యామ్.

 

” నీకు నిజంగా బావ అంటే ఇష్టం కదా. వాడి కోసం ఏమైనా చేస్తావ్ కదా “

 

” చాలా ఇష్టం. బావ కోసం నేను ఏమైనా చేస్తా. ఆఖరికి చచ్చిపోమన్నా కూడా “

 

వెంటనే సునంద, శ్యామ్  నోరు తన చేత్తో ముసి ” అలా అనకే. వాడిని పెళ్లి చేసుకుని మా పరువు కాపడవే ” అంది.

 

శ్యామ్ వాళ్ళ అమ్మా, నాన్న వంక చూసింది.

 

” నీకు ఏం అనిపిస్తే అది చెయ్యి రా ” అన్నారు వాళ్ళు.

 

దీర్ఘంగా ఒక నిట్టూర్పు విడిచి కళ్ళు మూసుకుని ” అలాగే నేను బావ నీ పెళ్లి చేసుకుంటా” అంది.

 

అందరూ సంతోషంగా శ్యామ్ నీ తీసుకుని వెళ్లి రెడీ చేసి ముసుగు వేశారు.

 

@@@@@@@@@@@@@@@@@@@@@@

 

To be continued………..