పార్ట్…9
” హేయ్ చాల్లే. ఇప్పుడే దొరకని దాన్ని అప్పుడు దొరుకుతానా. నేను ఎప్పుడూ నీకంటే ఒక అడుగు ముందే ఉంటా ” అంది నవ్వుతూ.
” ఆ అడుగు తడబడకుండా ఉంటుందా ” అంది కాన్ఫిడెంట్ గా.
” శ్యామ్…. శ్యామ్….శ్యామ్….. నేను ఏమైనా నీలా ఎమోషనల్ ఫూల్ అనుకున్నావా ” అంది నవ్వుతూ.
” ఆ ఎమోషన్ లోనే ప్రేమ ఉంది. హా అయినా అది నీకు తెలీదు కదా ” అంది వెటకారంగా.
” నాకు అది అవసరం కూడా లేదు లే. ఎనీ వే పాపం నాకోసం ఎదురు చూసి చూసి అలసి పోయి ఉంటావు ఏమో. వెళ్లు అమ్మా, వెళ్లి బాగా రెస్ట్ తీసుకో ” అంది చెంప పై తడుతు.