మనోహర 💖 నా హృదయమునే ❤️ – 2
మనోహరా 💖💖 నా హృదయమునే❤️🔥
ఎపిసోడ్ 2:…….
ఆ అమ్మాయి అలా తను కాళ్ళు పట్టుకోడం తోనే కంగారు పడిన ఆవిడ…. ఆ అమ్మాయి ఏకం గా అలా చెప్పడం తో…. ఒక్కసారిగా కళ్ళు పెద్దవి చేసి బిగుసుకు పోతుంది…
తన అత్తమ్మ ఏమ్ బ్లెస్ చేయకుండా సైలెంట్ గా బిగుసుకు పోవడం చూసిన సియ…… ఆవిడ పాదాలు తాకిన చేతులని కళ్ళకి అద్దుకుంటూ……. లేచి నిలబడుతూ…….. ఏమయ్యింది అత్తమ్మ ……..!!!! అలా వున్నారు……???? నేను ఆల్రెడీ మి అబ్బాయికి చెప్పానే ఇవాళ మన ఇంటికి వచ్చి అత్త మామ లని కలుస్తాను అని …. కన్నయ్య చెప్పలేదా మీకు………????? అని చిన్నగా అడుగు తుంది…….
వచ్చి నప్పటి నుంచి ఆ అమ్మాయి నీ చూస్తున్న భావన గారు …. తను అలా కన్నయ్య అని పిలవడం తోనే తన కొడుకు కాదు అనుకుని….. చూడమ్మా…. ఎవరో అనుకుని ఎవరో ఇంటికి వచ్చినట్టు వున్నావు… నా కొడుకు ప్రేమించడం ఎంటి…..???? ఒక సారి అడ్రస్ సారిగా కనుక్కో….!!! అని ఆ అమ్మాయి తన కొడుక్కు అయితే సరైన జోడి అని ఆ అమ్మాయిని చూసినా వెంటనే కలిగిన ఫీలింగ్ ఆ అమ్మాయి అలా చెప్పడం తో ఎవరో అనుకుని…. మనసులో కాస్త డిస్సపోయింటెడ్ గా అనిపించిన……… దానిని బయట పెట్టకుండా నార్మల్ గా అంటారు…….
తన అత్తమ్మ లా తను కన్నయ్య అని పిలవడం తో….. కాన్ఫ్యూజ్ అయ్యారు అనుకున్న సియ….. లేదు అత్తమ్మ….. నేను కరెక్ట్ అడ్రస్ కే వచ్చాను……..!!!! మి పేరు భావన గారే కదా…….. మి అబ్బాయి గౌతమ్ నందన్ కృష్ణ నే కదా……..!!!!!! అని అంటూ…. దానికి తన అత్తమ్మ అయోమయం లోనే అవును అన్నట్టు తల ఊపడం తో…… సియ వెంటనే అయితే నేను కరెక్ట్ అడ్రస్ కి వచ్చాను అత్తమ్మ……… హొ మి అబ్బాయిని కన్నయ్య అని పిలిచాను అని కన్ఫ్యూజ్ అవుతున్నారా……..
నేనే ఆ కన్నయ్య పేరు పెట్టుకున్నాడు అని అలా ముద్దుగా పిలుచుకుంటాను అత్తమ్మ…..!!!! అని అంటూ వుండగానే అక్కడికి తన మావయ్య కూడా … భావన ఎవరు ఈ అమ్మాయి అని అడుగుతూ అక్కడికి రావడం తో….. సియ నవుతూ…… ఆయన కాళ్ళకి కూడా నమస్కారం పెడుతూ….. నేను మి కోడల్ని మావయ్య…..!!!! అని అంటుంది ….
ఆ అమ్మాయి అలా తన కాళ్ళు పట్టుకోడం చూసిన కిరణ్ గారు……. అయోమయం గా ఆ అమ్మాయి తల మిద చేతిని వేసి చల్ల గా వుండు తల్లి అని దీవించి…… ఎవరు బావన…… నీ తరుపు చుట్టాలు అమ్మాయా……??? అని అడుగు తారు…..
ఆ మాటలతో తేరుకున్న బావన గారు…… లేదండీ….. మన కొడుకు ఈ అమ్మాయి ప్రేమించు కుంటున్నాను అంట…….!!!! అని నమ్మలేనట్టే భర్త తో చెప్తారు…..
బావన అలా చెప్పడం తోనే… కిరణ్ గారు…… ఎంటి……!!! నిజమా……!!? అని ఆశ్చర్యం గా అడుగుతూ సియ వైపు నమ్మలేనట్టు చూస్తారు……!!!!
వాళ్లకి బాగా తెలుసు….. తన కొడుకు జీవితం లో మళ్ళీ ఇంకో అమ్మాయి రావడం అనేది జరగని పని …….. ఒకవేళ వెళ్ళిన కూడా నందు వాళ్ళని అస్సలు బేర్ చేయడు ……!!!! ఇంక ప్రేమ పెళ్లి లాంటివి అయితే అసలు జరగని పనులు……..!!!!!!! వాళ్ళే తమ కొడుకుని మార్చడానికి చాలా ప్రయత్నాలు చేసి చేసి…….. ఇంక ఆ దేవుడి మిద బారం వేసి వదిలేశారు……..!!!! కానీ ఇప్పుడు అలా ఒక అమ్మాయి రావడం తో……. కిరణ్ గారు…… చూడమ్మా….. నువ్వేదో రాంగ్ అడ్రస్ కి వచ్చినట్టు వున్నావు…….??? అని బావన గారు చెప్పిందే ఈయన కూడా చెప్తారు….
ఆ మాటలు వున్న సియ…… అయ్యో …అత్తమ్మ నే అనుకుంటే మీరు కూడా ఎంటి మావయ్య……. నేనేమైనా చిన్న పిల్లనా తప్పి పోయి రావడానికి….. నేను మి కొడుకు ప్రేమించుకున్నాము…..!!!!! అది మీ కొడుకు మీతో చెప్పడానికి భయపడుతున్నాడు……. అందుకే నేనే స్వయం గా వచ్చాను అత్తమ్మ మీకు విషయం చెప్పడం కోసం……… అంటూ……. చెప్పండి….. నేను మీకు కోడలుగా ఓకే కదా…… అని మెరుస్తున్న కళ్ళతో అడుగుతుంది…..
ఆ అమ్మాయి అలా చెప్పడం చూసిన కిరణ్ బావన గారు…. ఇంకా అయోమయం గానే….. అవును కాదు అన్నట్టు గా తల వూపుతారు………!!!!!
కరెక్ట్ గా అదే టైం కి జాగింగ్ కంప్లీట్ చేసి…… సెవెన్ థర్టీ అవుతుండ గా ఇంట్లోకి వస్తున్న గౌతమ్…… వాళ్ళ ఇంటి ముందు వున్న కార్ నీ చూసి….. ఈ కార్ ఎక్కడో చూసానే అనుకుంటూ……. మెల్లిగా లోపలికి వెళ్తాడు……!!!
తను లోపలికి అడుగు పెట్టాడో లేదా….. అక్కడ వున్న సియా ను చూడగానే…. ఆశ్చర్యం తో కళ్ళు పెద్దవి అయిపోతూ…. పిచ్చిది ఇక్కడేం చేస్తుంది…….. కాలేజ్ లో నన్ను వేపుకు తింటుంది సరిపోలేదా……. ఇక్కడ కూడా మొదలు పెట్టేసింది…… అనుకుంటూ….. సియ నువ్వేంటి ఇక్కడా…….???? అని సీరియస్ గా అడుగు తాడు….
అక్కడ తన కన్నయ్య గొంతు వినిపించడం తోనే…. సియ కళ్ళల్లో ఒక్కసారిగా మెరుపు వచ్చేస్తుంది……. దానితో వచ్చేశావ కన్నయ్యా……..!!!! అని నవ్వుతూ పిలుస్తూ….. నీకోసమే చూస్తున్నాను కన్నమ్మ……..!!!!!! ఇంక రాలేదెంట అని…….. అత్తయ్య మావయ్య వాళ్లకి మన గురించి అన్ని విషయాలు చెప్పేశాను…… మన పెళ్ళికి కూడా ఒప్పించాను……..!!!!! నువ్వేం భయపడాల్సిన పని లేదు…….!!!! అని చేతులు వూపుతూ ధీమాగా అంటుందు ……
సియా మాటలు వినపడటం తోనే ….. మళ్ళీ ఏదో పిచ్చి పని చేసింది అనుకుంటూ…… సియ అని కోపం గా పిలుస్తూ… నేను నిన్ను కాలేజ్ ఆడిటోరియం లో పిలుస్తాను………..!!!!! ఇప్పుడైతే వెల్లు ఇక్కడి నుంచి అని కోపం గా చెప్తాడు…..
తన కన్నయ్య అలా చెప్పడం చూసిన సియా….. బిక్క మొఖం పెడుతూ …… అదేంటి కన్నయ్య ఇంత పొద్దున్నే నీకోసం వస్తె అలా పొమ్మంటున్నావు …….??? మొదటి సారి మన ఇంటికి వచ్చాను…….!!! అని చెప్తూ వుండగానే…. సియా జస్ట్ గెట్ ఔట్ ……….!!!!! అని కోపం గా తన మిద అరవడం తో….. ఆ అరుపులకి కాస్త భయపడి మెల్లిగా తన కన్నయ్య నీ దాటుకుని బయటకు నడుస్తుంది………
సియా పూర్తిగా బయటకు వెళ్లి కార్ ఎక్కి కార్ లో ముందుకు వెళ్ళెంత వరకు తననే గమనిస్తున్న గౌతమ్ తను వెళ్ళడం తోనే…… కోపం గా స్టెప్స్ వైపు ఆగలి వేస్తాడు……
అది చూసిన బావన గారు….. నందు ఎవరు ఆ అమ్మాయి…….???. ఎంటి మి ఇద్దరు మధ్య రిలేషన్ అని డౌట్ గా అడుగు తారు…..
తన అమ్మ మాటలు విన్నా నందు…. అమ్మా …. తనేం మీకు చెప్పిందో నాకు తెలియదు….. కానీ అధి ఒక పిచ్చిది …… దాని మాటలు పట్టించు కోకండి…….!!!! ఇంక ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయండి ….. అని చెప్పేసి…… స్పీడ్ గా స్టెప్స్ ఎక్కుతూ …… తన గదిలోకి వెళ్ళి పోతాడు….
అది చూసిన బావన గారు కాస్త డల్ అయిపోతారు……..!!!! ఒక్క క్షణం తన కొడుకు ఆ అమ్మాయి ప్రేమించు కున్నారు ఎమో ఆనంద పడ్డారు….. కానీ కాదు అని తన కొడుకు మాటలు తేల్చేయడం తో….. బాధగా అక్కడి నుంచి వెళ్లి పోతారు ……!!! కిరణ్ గారు కూడా ….ఇంకా మౌనం గా అక్కడి నుంచి వెళ్లి పోతారు… కానీ ఆయన మనసులో సియ నీ చూసినప్పుడు ఏదొ నమ్మకం…,. తన కొడుకుని మార్చగలిగే అమ్మాయి అని …… అదే నమ్మకం నిజం అయ్యి….. తన కుడుతూ మారితే బాగుణ్ణు అని కోరుకుంటూ వుంటారు
మరో పక్క గౌతమ్ గురించే ఆలోచిస్తూ….. ఒక అరగంట కాలేజ్ కీ చేరుకున్న సియా…. ఇప్పుడు తన కన్నయ్య ఏమ్ చేస్తాడొ ఏంటో…..??? అసలే ముక్కోపి అని బయం గా అనుకుంటూ….. ఆడిటోరియం లో వెయిట్ చేస్తూ వుంటుంది……!!!
ఒక గంట తర్వాత…… మార్నింగ్ టిఫిన్ కూడా తినక పోవడం తో…… వెయిట్ చేసి చేసి…. నీరసం వస్తుంటే ……. ఎప్పుడు వస్తావు కన్నయ్య.,….!! ఆకలితో పొయ్యేట్టు వున్నాను……!!! అని అనుకుంటూ వుండ గానే…. దూరం గా తన కన్నయ్య వస్తూ కనిపించడం తో…. ఒక్కసారిగా కళ్ళు వెలిగి పోతాయి…….
కానీ తన కన్నయ్య బాడీ లాంగ్వేజ్ ఏదో తేడా కొడుతుంటే….. గౌతమ్ నీ సరిగ్గా గమనిస్తూ…… వామ్మో ఇంత కోపం గా వస్తున్నాడు ఎంటి……?????. చెప్పకుండా ఇంటికి వచ్చినందుకు ఫుల్ ఫైర్ లో వున్నట్టు వున్నారు కధా సార్……!!! అని బయం గా అనుకుంటూ …… గౌతమ్ దగ్గరకు రావడం తోనే….. కన్నయ్యా…..!!! అని ప్రేమ గా పిలుస్తుంది……….
అప్పటికే చాలా కోపం గా వున్న గౌతమ్ మాటల్తో సియ కి అర్థం అయ్యేట్టు చెప్పాలనుకున్న వాడల్లా కాస్త…. సియ గొంతు నుంచి ఆ పిలుపు వినపడటం తోనే ఇంకా తన కోపం అదుపు చేసుకోలేక…… కోపం గా లాగి పెట్టీ….. సియ చెంప పగలకొడతాడు ……..!!!!!
To be continued…….
Swipe left/right or tap the sides to turn pages