మనోహర 💖 నా హృదయమునే ❤️ – 3
మనోహర 💖💖 నా హృదయమునే ❤️🔥
ఎపిసోడ్ 3:…….
అప్పటికే చాలా కోపం గా వున్న గౌతమ్…….. మాటల్తో సియ కి అర్థం అయ్యేట్టు చెప్పాలనుకున్న వాడల్లా కాస్త…. సియ గొంతు నుంచి ఆ పిలుపు వినపడటం తోనే ఇంకా తన కోపం అదుపు చేసుకోలేక…… కోపం గా లాగి పెట్టీ….. సియ చెంప పగలకొడతాడు ……..!!!!!
తన కన్నయ్య కి తను అలా చేస్తే కోపం వస్తుంది అని తెలుసు గానీ……. మరి అంత గట్టిగా కొడతాడు ఆని ఊహించక పోవడం తో……… గిర్రున కళ్ళల్లో నీళ్ళు తిరుగుతాయి……..!!!! అది కాక ఇప్పటి వరకు ఎవరు తనని తిట్టింది కూడా లేదు……!!! అలా మొదటి సారి చెంప దెబ్బ ఎలా వుంటుందో తెలియడం తో……… చెంప మిద చేతిని వుంచుకుని…….. గౌతమ్ వైపు మెల్లిగా తల తిప్పి చూస్తుంది…….!!!
కానీ తన కన్నయ్య తల మిద ఒక చేతిని…. నడుము మిద ఒక చేతిని పెట్టుకుని….. గట్టిగా కళ్ళు మూసుకొని… వుండడం చూసి…… కాస్త బయం బయం గానే క ..కన్నయ్య…….!!!! అని తడబడుతూ పిలుస్తుంది……!!!!! కానీ ఆ పిలుపు వినపడటం తోనే గౌతమ్ కోపం…… ఒక అడుగు ముందుకు వేస్తూ…… చంపేస్తా ….!!! ఇంకోసారి గానీ అలా పిలిచావ్ అంటె……. వూరుకుంటున్న కదా అని రోజు రోజుకి నీ అల్లరి మితి మీరిపోతుందు……..!!!!!!!! కాస్త అయిన బుద్దుందా అసలు…..!!! అలా ఇంటికి వచ్చి నీకు నచ్చినట్టు వాగేయడమేనా …….??? అని కోపం గా అరుస్తాడు……
అప్పటికే గౌతమ్ అలా ముందుకు ఒక అడుగు వేయడం తోనే…. మళ్ళీ తన చెంప ఎక్కడ పగలకొడతాడో అనుకుని…. కంగారుగా ఆ చెంప మిద కూడా చేతిని పెట్టుకుని వెనక్కి ఒక అడుగు వేసి……. కాస్త బెరుకుగానే…….. అంటే అధి మరి కన్నయ్య……!!!!! నికు కోపం తెప్పించాలి అని కాదు కన్నయ్య…….!!!! అని నాన్చుతూ ఇంకా ఏదో చెప్పబోతుంది……..
తను అంతలా చెప్పిన కూడా సియ పిలుపులో మార్పు లేకపోవడం చూసిన గౌతమ్ విసురుగా……. సియా చేతిని పట్టుకుని మీదకి లాక్కుంటూ….. ఒకసారి చెప్తే అర్థం కాదా…….!!!! అసలు ఎలా చెప్తే ఇలా నా వెనకాల పడడం మనేస్తావ్…..??? చెప్పు అని గట్టిగా సియ బుజాలు పట్టుకొని…. రౌద్రం గా అడుగు తాడు……
తన కన్నయ్య కోపం గురుంచి ముందే తనకి తెలిసిన కూడా….. అలా ఎప్పుడు కూడా కన్నయ్య తనని హర్ట్ చేసి వుండక పోవడం తో…….. అప్పటికే గౌతమ్ ఇనుప కడ్డీలాంటి చేతుల పట్టుకు…… తన చేతులు నొప్పి పుడుతుంటే…….గిర్రున తన కళ్ళలోకి నీళ్ళు కూడా చేరి పోవడం తో…… ఏమ్ మాట్లాడకుండా అలాగే తన కన్నయ్య కళ్ళలోకి బాధగా చూస్తూ వుండి పోతుంది………..!!!!!!!
సియ కళ్ళల్లో కన్నీళ్లు చూసిన గౌతమ్ విసురుగా సియా నీ వెనక్కి తోసి……… సియా నీ చూడడం ఇష్టం లేదు అన్నట్టు గా…… వెనక్కి తిరిగి…… ఇదే నికు నేను… లాస్ట్ టైం చెప్పడం సియ……!!! ఇంకోసారి గానీ ప్రేమ .. పెళ్లి.. కన్నయ్య అంటూ గానీ…….. నా వెనక గానీ తిరిగావే అనుకో…….. ఈ సారి నేనేం చేస్తానో నాకే తెలియదు……..!!!! అని కోపం గా చెప్పేసి…….. అక్కడి నుంచి స్పీడ్ గా వెళ్లి పొతాడు ……..!!!!
తన కన్నయ్య అలా వెళ్లి పోవడం చూసిన సియ తన చెంపల మిద వున్న కన్నీళ్లు తుడుచుకుని…….. బుగ్గ లైట్ గా నొప్పి పుడుతుంటే. …… ఫోన్ లో తన చెంప కనిపిచ్చే టట్టు ఒక సెల్ఫీ తీసుకుని…….. ఆ పిక్ చూస్తూ…… సచ్ఛినోడు……!!! కొడితే కొట్టాడు గానీ మరి ఇంత గట్టిగా కొట్టాలా…..??? అని అనుకుంటూ……. తన హాఫ్ ఫేస్ కవర్ చేసేట్టు………. హెయిర్ నీ సరిచేసుకుని……. అక్కడి నుంచి మెల్లిగా ఏమ్ జరగనట్టు క్లాస్ కీ వెళ్లి పోతుంది………..!!!!!
మరో పక్క కోపం గా అక్కడి నుంచి వెళ్లిన గౌతమ్ కోపం గా లైబ్రరీ లోకి వెళ్లి……. ఒక బుక్ తీసుకుని చదువుతూ వుంటుంది…….,!!!! కానీ బుక్ పేజ్ తిప్పిన ప్రతి సారి కూడా ….. తను సియా నీ కొట్టడమే గుర్తు వస్తుంటే…… కోపం గా తన చేతి వైపు చూసి……. తను కొట్టడం వల్ల ఎర్రగా కందిపోయిన చెంప…… కళ్ళల్లో నీళ్లతో తన వైపే చూస్తున్న సియా మొఖం గుర్తు రావడం తో……. చా……. అనవసరం గా మొదటి సారి ఆడపిల్ల ఒక మీద చెయ్యి చేసుకున్న……..!!!! ఎంత కోపం వచ్చిన కూడా అలా కొట్టకుండా వుండాల్సింది అని అనుకుంటూ…….. చైర్ లో వెనక్కి వాలి కళ్ళు మూసుకుంటాడు……..!!!!
కానీ అప్పుడే గౌతమ్ అన్న పిలుపు వినిపించడం తో…,…. కళ్ళు తెరుస్తూ……. ఎదురుగా వున్న నిషాంత్ నీ చూస్తూ……. చెప్పరా….. ఎంటి…..??? అని అడుగు తాడు……
దానికి నిషాంత్ గౌతమ్ కి ఎదురుగా కూర్చుని చెప్పాల్సింది నేను కాదు బావ ….. నువ్వు…..!!! క్లాస్ కి టైం ఔతున్న కూడా రాకుండా ఇక్కడేం చేస్తున్నావ్ ……?? పదా వెళ్దాం….!!!!!! అని అంటాడు….
కానీ గౌతమ్ కి క్లాస్ వినే మూడ్ లేకపోవడం తో…… నాకు ఇంట్రెస్ట్ లేదు రా…….??? నువ్వు పో……!!!!!! నేను నెస్ట్ క్లాస్ కి వస్తాను ఆని చెప్పేసి…… అక్కడి నుంచి నిషాంత్ నీ పంపించేస్తడు……….!!!
నిషాంత్ వెళ్లి పోవడం తోనే….. గౌతమ్ కి కూడా……. సియా దగ్గరకి వెళ్ళాలి అన్న ఆలోచనని పక్కన పెట్టీ….. ఇలా తను దూరం పెడితే అయిన తనలో మార్పు వస్తుంది అని ఆలోచిస్తూ…… చదువుకుంటూ వుంటాడు……..
ఆఫ్టర్ నూన్ లంచ్ బ్రేక్…… గౌతమ్ తన ఫ్రెండ్స్ తో పాటు…… క్యాంటీన్ కి వెళ్తాడు…….!!!! కానీ తను కళ్ళు మాత్రం సియా కోసం అటు ఇటు వెతుకుతూ వుంటాయి……..!!! కానీ సియా కనిపించక పోవడం తో…… ఈ పాటికే ఇక్కడికి వచ్చి……. కన్నయ్య అని తనని పిలిచి విశిగించాలి కదా…… అని ఆలోచిస్తూ…. కానీ అంతలోనే. తను కొట్టినందుకు ఏమైనా ఫీల్ అయ్యి ఇంకా తనకి దూరం గా వుండాలి అని డిసైడ్ అయ్యిందా…….??? అని ఆలోచిస్తూ……. ఆ ఆలోచన రాగానే సియా తనకి దూరం గా వుంటున్నందుకు ఆనందం ప్లేస్ లో ఏదో తెలియని వెలితి కనిపిస్తుంటే……… నిషాంత్ తనని పిలవడం తో …. తన ఆలోచనల నుంచి తేరుకుని …… వాళ్ళతో పాటు కూర్చుని……… తింటూ వుంటాడు……
అప్పుడే వాళ్ళలో రోషన్…. అవును రా నీ ప్రేమ పిపాసి ఎక్కడ రా …..?? ఈ పాటికే ఇక్కడికి వచ్చి నీ బుర్ర తినేయాలి కదా…..?? అని జోక్ గా అడుగుతూ……. గౌతమ్ తన వైపు షార్ప్ గా చూడడం తో………. రోషన్ నవ్వుతూ….. అంటే ఈ పాటికి సియ రావాలి కదా …. ఏదో సరదాగా అన్నాను రా……?? అని అంటూ…. గౌతమ్ కోపం తెలిసి….. వెంటనే కవర్ చేస్తూ చెప్తాడు………!!!!!
అప్పుడే సియా ఫ్రెండ్స్ కూడా కొంత మంది రావడం తో….. నిషాంత్ గౌతమ్ నీ ఒక కంట కనిపిస్తూనే………. సియా క్లోజ్ ఫ్రెండ్ అయిన స్నేహ నీ పిలుస్తూ……. ఈరోజు సిస్టర్ కాలేజ్ కి రాలేదా…….????? అని అడుగు తాడు……
ఆ మాటలకి స్నేహ…. వెళ్తుందల్ల ఆగి గౌతమ్ వైపు కోపం గా చూసి….. లేదు నిషాంత్ గారు……. వచ్చింది…….. అని అంటుంది…….
స్నేహ అలా తనకి ఆన్సర్ చెప్తున్నా కూడా గౌతమ్ వైపు కోపం గా చూస్తూ వుండడం చూసి….. మళ్ళీ ఏదో అయ్యింది అనుకుంటూ…… మరి లంచ్ చేయడానికి రాలేదే……???? అని ఇంకో క్వశ్చన్ అడుగు తాడు……
దానికి ఆకలి గా లేదంట అండి…… ఆనందం తో కడుపు నిండి పోయింది అంట…….. అందుకే రాను మీరు తినేసి రండి అని… మమ్మల్ని మాత్రమే పంపించింది…… అని విసురుగా చెప్పేసి…… పక్కన వున్న ఇంకో టేబుల్ దగ్గర కూర్చుంటుంది……
కానీ ఆ మాటలు విన్న నిషాంత్ కి ఏం అర్థం కాకపోవడం తో…. అయోమయం గా ఫీల్ అవుతూ……… గౌతమ్ వైపు చూస్తాడు…….!!!
కానీ గౌతమ్ ఏదో ఆలోచిస్తూ వుండడం చూసి…. రేయ్ గౌతమ్ ఏమైనా అన్నావా తనని……!!!! అని కాస్త సీరియస్ గా అడుగు తాడు……???
నిషాంత్ అలా అడగడం తో… గౌతమ్…. నాకు వేరే పనేం లేదు అనుకుంటున్నావా…..??? లేక నీ చెల్లి ఏమైనా బుధ్ధి మంతురాలు అనుకుంటున్నావా……???? అసలు నీ చెల్లి పొద్దున్న ఏమ్ చేసిందో తెలిస్తే…. నికు కూడా కోపం వస్తుంది…….!!! అని నిషాంత్ కి మాత్రమే వినిపించెట్టు చెప్తూ….. అయిన నాకు ఇప్పుడు పని వుంది……..!!!! నేను వెళ్తున్న అని చెప్పేసి….. తినకుండా నే అక్కడి నుంచి వెళ్లి పోతాడు…….
అది చూసిన నిషాంత్ ఏమ్ జరిగిందో తెలుసు కోవాలి అనుకుంటూ స్నేహ దగ్గరకి వెళ్తాడు…….!!!!
To be continued……
Swipe left/right or tap the sides to turn pages