New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
మనోహర 💖 నా హృదయమునే ❤️ – 4

మనోహర 💖 నా హృదయమునే ❤️ – 4

మనోహర 💖💖 నా హృదయమునే ❤️‍🔥

 

 

 

 

ఎపిసోడ్ 4:…….

 

 

నిషాంత్ అలా అడగడం తో… గౌతమ్…. నాకు వేరే పనేం  లేదు అనుకుంటున్నావా…..??? లేక నీ చెల్లి ఏమైనా బుధ్ధి మంతురాలు అనుకుంటున్నావా……???? అసలు నీ చెల్లి పొద్దున్న ఏమ్ చేసిందో  తెలిస్తే…. నికు కూడా కోపం వస్తుంది…….!!! అని నిషాంత్ కి మాత్రమే వినిపించెట్టు చెప్తూ….. అయిన నాకు ఇప్పుడు పని వుంది……..!!!!  నేను వెళ్తున్న అని చెప్పేసి….. తినకుండా నే అక్కడి నుంచి వెళ్లి పోతాడు…….

 

అది చూసిన నిషాంత్ ఏమ్ జరిగిందో తెలుసు కోవాలి అనుకుంటూ స్నేహ దగ్గరకి వెళ్తాడు…….!!!!

 

మరో పక్క  సియా నీ వెతుక్కుంటూ వెళ్ళిన గౌతమ్ కి……. తను కొట్టినందుకు ఎక్కడ ఫీల్ అవుతూ ….. ఏడుస్తూ కూర్చుంటుంది అనుకున్న  గౌతమ్ కి ………… సియా నీ అలా  చూడడం తోనే ఒక్కసారిగా బిగుసుకు పొతాడు ……..!!!!!!

అప్పటికే  లంచ్ బ్రేక్ అవ్వడం వల్ల క్లాస్ లో ఎవ్వరూ లేరు ఏమో……. ఒక్కదె చైర్ లో  బాసీమటం వేసుకుని కూర్చుని……..  టేబుల్ మీద దాదాపు ఒక పది చాక్లెట్స్ పెట్టుకుని…… వాటిని మర్డర్ చేస్తూ మరి తినడం చూసిన గౌతమ్…… మనసులోనే సియా నీ తిట్టుకుంటూ…… దొంగ మొఖం ది…… ఇది ఎక్కడ బాధ పడుతు కూర్చుందో అనుకుని తినకుండా  ఫుడ్ నీ వదిలేసి వస్తె ……. ఇది మాత్రం తీరి బాటుగా……. చాక్లెట్స్ మెక్కేస్తుంది……. అని కోపం గా అనుకుంటూ…… మళ్ళీ తనని చూస్తే ఎక్కడ డ్రామా స్టార్ట్ చేస్తుందో అనుకుని..,… వెల్ల బోతాడు……….!!!!

 

కానీ అప్పటికే రాక్షసి తనని చూసేయడం తో………. దొంగ మొఖం ది చూసేసింది……!!! అనుకుంటూ…  సర్లే కొట్టినందుకు సారీ  అయిన చెప్దామ్…… కాస్త గిల్టీ ఫీలింగా అయిన పోతుంది అనుకుంటూ…….. వెళ్లి సియా పక్కన ఖాలీగా వున్న చైర్ లో సెటిల్ అవుతు……. మాటలు ఎలా స్టార్ట్ చేయలబ్బా….. అని  ఆలోచిస్తూ……..  సియా వైపు ఓ సారి చూస్తాడు……!!!

 

కానీ రాక్షసి   తనని పట్టించు కోకుండా అలా  చాక్లెట్స్ తింటూ వుండడం చూసి………. “””  ఉత్తప్పుడు మాత్రం మాటకు ముందో సారి…… కన్నయ్య….. మాటకి తర్వతో సారి కన్నయ్య….. అని పిలిచేది……… కానీ ఇప్పుడు తను వున్నది కూడా పట్టించు కోకుండా ఎలా తింటుందో అనుకుంటూ……….   ఇంక  తను అలా వుండ లేక కోపం తెచ్చుకుంటూ……. పక్కన నేనోకడ్ని వున్నాను కనిపిస్తుందా …….????   పక్కన వున్న నన్ను పట్టించు కొడం మానేసి అలా చాక్లెట్స్ తింటూ ఉంటావు ఎంటి……….?!!!  అని విసుగ్గా అడుగు తాడు…….

 

ఇందాకటి తన కన్నయ్య మాట్లాడతాడు….. అని అతి కష్టం గా తన వాగుడ్ని కంట్రోల్ లో పెట్టుకున్న  సియా…….. అలా తన కన్నయ్య అనడం తోనే…….. మరి ఏం చేయమంటారు గౌతమ్ గారు…… అని కావాలనే  గౌతమ్ గారు అని పేరుని వొత్తి పలుకుతూ……. మీరు కొట్టినందుకు ఏడుస్తూ….. మీరు వచ్చి బుజ్జగిస్తారు అని తినడం మానేసి  కూర్చో మంటారా…..??? అసలే పొద్దు నుంచి ఏమ్ తినలేదు………!!!!! పైగా మీరు కొట్టిన దెబ్బకు తల మొత్తం తిరుగు తుంది…… ఇప్పుడు గానీ తినకుండా వుంటే….. పోయి హాస్పిటల్ జాయిన్ కావాలి……….!!!!! అసలే మా అమ్మ నాన్న లకి నేనొక్కదాన్నే మంచి కూతుర్ని………!!!!  ఏదో జరిగింది అని మనల్ని ప్రేమించే వాళ్ళని కూడా బాధ పెడుతూ వుండలేం. కధా………!!!??! అని అంటూ….. అయిన మీరే కదా దూరం గా వుండమంది  ……!!?! అదే చేస్తున్న….!! అయిన ఎందుకు వచ్చారు……!!!???  అని   చిరు కోపం గా అడుగు తుంది…..

 

కానీ గౌతమ్ మాత్రం….. సియా మాటలకి ఫ్రీజ్ అయిపోతూ……..     సియ అన్న మాటలే……. “”””””ఏదో జరిగింది అని మనల్ని ప్రేమించే వాళ్ళని కూడా బాధ పెడుతూ వుండలేం. కధా………!!!??!”””””” మళ్ళీ మళ్ళీ తన మైండ్ లో రివైన్ అవుతుంటే…… కావాలని అందా…..??? లేక ఏదో ఫ్లోలో అందా అని ఆలోచిస్తూ…….  సియా తనని ఎప్పటి లా కన్నయ్య అని కాకుండా గౌతమ్ గారు అని పిలవడం గమనించి.. నిజం గానే నాకు దూరం గా వుండాలి అనుకుంటుంద  అని అనుకుంటూ…  తనే దూరం గా వుండమని చెప్పిన కూడా .. సియ అలా వెంటనే అలా పాటిస్తుంటే… అది కాస్త కూడా నచ్చనట్టు.. అధి సియా కి ఎలా చెప్పాలో అర్థం కాక…….   కోపం గా సియా తింటున్న చాక్లెట్స్ నీ లాక్కుంటూ…… అంతగా ఆలోచించే దానివి అయితే ఇలా గడ్డి తినడం కాదు……… అన్నం తినాలి………!!!??!!!  అని కోపం గా చెప్తాడు…….

 

కన్నయ్య అలా తన చాక్లెట్ లాక్కోవడం చూసిన సియా…….. నాకు అన్నం తినాలి లేదు…….!!!!!  అయిన తమరేమి కొత్తగా నా మిధ కన్సర్న్ చూపించాల్సిన పని లేదు …….!!!!! ముందు నా చాక్లెట్ ఇవ్వు …….!!!! ఆకలి వేస్తుంది నాకు.,…… అని గౌతమ్ మీదకి వంగుతూ తన చాక్లెట్ తీసుకో బోతోంది…….!!!!  కానీ గౌతమ్ సియ కి ఆ చాక్లెట్ అందనివ్వకుండ పట్టుకుంటూ…….. తన మీదకి వంగి మరి ఆ చాక్లెట్ తీసుకో బోతున్న సియ నీ చూస్తూ ……. ఓహ్ గాడ్……!!! ఈ పిల్ల….. !! అని కోపం గా  అనుకుంటూ……..  ఒక చేతితో సియా నీ చైర్ లోకి లాగి……. సియా ఎదురుగా వున్న చాక్లెట్స్ తో పాటు ……  తన చేతిలో వున్న చాక్లెట్ నీ కూడా ఫోల్డ్ చేసి……  పక్కన పెట్టీ …….   తన వైపు చిరు కోపం గా చూస్తున్న సియ ను చూసి …… ఎంటా చూపు ……..????  అని అడుగుతూ………  లంచ్ బాక్స్ తెచ్చుకున్నావా……..???? అని అడుగు తాడు………

 

కానీ సియా తనకి ఆన్సర్ చెప్పకుండా ఫేస్ పక్కకి తిప్పేసుకుని……    కూర్చోవడం చూసిన గౌతమ్…….  నిన్నే అడుగు తుంది లంచ్ బాక్స్ తెచ్చుకున్నావా……???? అని ఈ సారి కాస్త సీరియస్ గా అడుగు తాడు….

 

అప్పటికే బెట్టు చేయాలి అనుకున్న  సియా…… తను మరి ఎక్కువ చేస్తే…… తన విషయం లో ఈ మాత్రం చొరవ తీసుకోడానికి సవంత్సరం పట్టింది………!!!!!!  అని అనుకుంటూ,,… ఇంక తన కోపాన్ని పక్కన పెట్టేసి…… ఇందాక తన కోసం డ్రైవర్ తీసుకు వచ్చిన లంచ్ బాక్స్ నీ గౌతమ్ కి ఇస్తుంది…..

 

దానితో  గౌతమ్ బాక్స్ మూత ఓపెన్ చేసి……..  అందులో వున్న  పొటాటో కర్రీ… రైస్ ను చూసి………. తిను …….!!!! అని  ఆ బాక్స్ నీ  సియా ముందర పెడతాడు……… 

 

అది చూసిన సియా కళ్ళు తిప్పి…. తన కన్నయ్య వైపు ఓ సారి చూసి…….   ఉహుమ్……. తినిపిస్తే నువ్వు తీనిపించు….. లేదంటే లేదు……  !!!  ఇలాగే ఆకలితో వుంటాను…….!??? అని అంటుంది……

 

 

సియ అలా అనడం చూసిన గౌతమ్….. సియ మొండి చేయకు……. బుధ్ధిగా తిను …..!!!!  అయిన చాక్లెట్స్ అయితే ప్యాకెట్లు ప్యాకెట్లు తింటావ్ కదా……. ఇది తినడానికి ఎంటి…….??? తిను……!???!!! నేను వెళ్ళాలి…..!??!  అని సీరియస్ గా చెప్తాడు……

 

 

 

To be continued…….

 

 

చదివేసి వెళ్ళిపోకుండ కాస్త కామెంట్స్ కూడా ఇవ్వండి బాంగారలు