అందుకే ఇంకేమీ మాట్లాడకుండా నా ప్రేమని ఆస్వాదించు అంటూ ఆమె ఒంటి మీద వలువలు దూరం చేసి , తన వంటి మీదవి కూడా లాగి పక్కన వేసి ఇద్దరి మీద బెడ్ షీట్ కప్పి ప్రణయ యుద్ధాన్ని ప్రారంభిస్తాడు ..
భాను ఎంతో ప్రేమగా తన భర్త కింద నలిగిపోతుంది.. ఆ రాత్రిని భరత్, భాను ఇద్దరూ మొదటి రాత్రిలానే మార్చుకుంటారు..
మొదటి రాత్రి జ్ఞాపకాలని గుర్తు చేసుకుని మరి ఆ రాత్రంతా ఒకరి ప్రేమలో మరొకరు మునిగి తేలుతారు..
కొన్ని గంటల ప్రణయ యుద్ధం తరువాత అలసిన శరీరాలతో ఒకరిని ఒకరు పెనవేసుకొని ఒకరి కౌగిలిలో మరొకరు సేద తీరుతారు..
ఒకరి ప్రేమను మరొకరికి తెలిసేలా తీయని ముద్దులు ఇచ్చుకుంటూ అలానే మెల్లిగా నిద్రలోకి జారుకుంటారు..
❤️