అందరి భార్యాభర్తల్లానే మన మధ్యలో కూడా ఎంతో సఖ్యత, ప్రేమాభిమానాలు ఉన్నాయి అని వాళ్ళు అనుకుంటారు కదా, అనుకోవాలి కూడా అప్పుడే ఎవరు బాధపడాల్సిన పని ఉండదు అని చెప్తుంది ప్రతిమ..
ప్రతిమ మాటలు విని ఒక క్షణం పాటు ఆమె వైపే చూసి హా అవును ప్రతిమ నువ్వు చెప్తున్న మాటలు నిజమే.. మనం గదిలో ఎలా అయినా ఉండని.. కానీ ఒకసారి గది నుండి బయటకు వెళ్లిన తర్వాత మన వాళ్లు ఎవరికీ మన మీద ఎలాంటి అనుమానం రాకుండా జాగ్రత్త పడాల్సిన బాధ్యత మనదే..
మనం అందరి భార్యాభర్తల్లానే సంతోషంగా ఉన్నాము అని వాళ్లకు అనిపిస్తే తప్ప వాళ్లు మామూలుగా ఉండలేరు..
ఈ మాటలు మనం తర్వాత అయినా మాట్లాడుకోచ్చు కానీ వెళ్లి త్వరగా స్నానం చేసి బయటికి రా.. మళ్లీ అత్తయ్య పిలుస్తారు అని ప్రణయ్ చెప్పడంతో టవలు తన సారీ తీసుకుని వాష్ రూమ్ లోకి వెళ్ళిపోతుంది ప్రతిమ..
ప్రతిమ వాష్ రూమ్ లోకి వెళ్ళిపోగానే ప్రణయ్ మళ్ళీ మంచం మీద పడుకుని ఏంటో ఈ అమ్మాయి ఒక్కోసారి చాలా చిన్న పిల్లలా కనిపిస్తుంది..
ఇంకొకసారి మాత్రం చాలా మెచ్యూరిటీ ఉన్న పెద్ద పిల్లలా కనిపిస్తుంది.. ప్రతి ఒక మనిషిలోనూ లోపాలు ఉన్నట్టు ప్రతిమ కి కూడా ఈ పెళ్లి ఇష్టం లేదు కాబట్టి ఇలా భార్యాభర్తల బంధాన్ని నటించాల్సి వస్తుంది..