ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా, ప్రతిమని చూద్దామా, రాత్రి అంతా సవ్యంగా జరిగిందా లేదా తెలుసుకుందాము అని రాత్రి అంత నిద్ర కూడా మానుకుని జాగారం చేశారు..
టైమ్ నాలుగున్నర అవుతుంది అనగ గబ గబ లేచి గదిలో నుండి బయటకి వచ్చి ప్రతిమ గది తలుపులు కొట్టడం మెదలు పెట్టారు..
ఫైనల్ గా ఇప్పుడు చెదిరిన బొట్టు, జుట్టు, నలిగిన చీర, పువ్వులు, ఆమె అవతారం చూసిన ఆవిడ కి రాత్రి అంత పడిన కంగారు మొత్తం పోయి చిన్న చిరునవ్వు వచ్చి చేరగా బంగారం అంత మంచిగానే జరిగింది కదా అని చిన్నగా అడిగారు..
తన తల్లి దేని గురించి అడుగుతుందో అర్ధం అయిన ప్రతిమ లేని సిగ్గు ని అరువు తెచ్చుకుని మరి చిన్నగా సిగ్గు నటిస్తూ బానే జరిగింది అన్నట్టుగా తల ఊపుతుంది..
కూతురు మొహం లో ఎప్పుడు లేని సిగ్గు కనిపించగానే అప్పటివరకు ఏదో మూలన వున్న చిన్న అనుమానం కూడా పోయి నిజంగానే నైట్ వాళ్ళిద్దరికీ ఫస్ట్ నైట్ జరిగి పోయింది అని నమ్మేసి కాస్త రిలీఫ్ గా ఫీల్ అయి బంగారం కార్యం జరిగిన తర్వాత తెల్లవారు ఝామూనే తల స్నానం చేసి పూజ చేసుకోవాలి..
ప్రణయ్ బాబు మళ్ళీ లేచాక చేస్తారు.. ముందు నువ్వెళ్ళి తల స్నానం చేసేసి బయటకి రా అని చెప్పేసి అక్కడ నుండి తృప్తి గా వెళ్లి పోతారు..