ప్రతిమ మాటలకి యశోద గారికి శ్రీరాములు గారు గుర్తొచ్చి ఆయన తన మీద చూపించిన ప్రేమని తలచుకోగానే మీ మామయ్య గారికి నేనంటే ప్రేమ మాత్రమే కాదు ప్రతిమ నేనంటే ఆయనకి ప్రాణం..
ఆయన నన్ను, పిల్లల్ని ఎంత ప్రేమగా చూసుకునేవారో మాటల్లో చెప్పడం చాలా కష్టం.. నీకు గుర్తుందో లేదో కానీ మేమేమీ ధనిక కుటుంబానికి చెందిన వాళ్ళం కాదు..
కానీ మీ మామయ్య గారు ఉన్నంతలోనే మమ్మల్ని చాలా సంతోషంగా ఉండేలా చూసుకునేవారు.. పెళ్లయిన ఆ క్షణం నుండి ఆయన ఉన్న క్షణం వరకు కూడా నన్ను ప్రేమ గానే కాదు ఎంతో గౌరవంగా చూసుకునేవారు..
పెళ్లికి ముందు నేను కూడా మీలానే ఆటకాయతనంగా ఉండేదాన్ని.. నాకు అప్పుడు ఇంతలా ఆలోచించే మెదడు లేదు..
మీ మామయ్య గారి నీ పెళ్లి చేసుకుని వచ్చిన తరువాతే మంచేదో చెడేదో అన్ని వివరంగా తెలుసుకోగలిగాను.. ఆయనని ఆయన మనసుని ఆయన వ్యక్తిత్వాన్ని చూసిన తరువాతే నా ఆలోచన విధానాన్ని మెరుగుపరుచుకున్నాను..
ఎప్పుడూ అందరిలోనూ అన్ని విషయాల్లోనూ మంచిని మాత్రమే చూడాలి అని ఆయన దగ్గర నుంచే నేను నేర్చుకున్నాను.. ఇప్పుడు మీ ముందు నేను ఇలా ఉన్నాను అంటే అంతా మీ మామయ్య గారి దయ అంటు భర్తని తలుచుకుని గర్వపడుతుంది యశోదమ్మ..