New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
మాంగళ్య బంధం – 146

మాంగళ్య బంధం – 146

అప్పటికే ప్రతిమ  షింక్ లో ఉన్న   ప్లేట్స్ అన్ని క్లీన్ చేసి పెట్టడం చూసి కోడలికి ఇంట్లో పనులు చేసే అలవాటు ఉందిలే.. అన్ని పనులు రాకున్నా కొన్ని పనులు బాగా వచ్చు  ఈ మాత్రం చాలు , మిగిలినవి చిన్నగా నేను నేర్పించుకుంటాను  అనుకుంటారు..

 

ప్రతిమ గిన్నెలన్నీ నువ్వే తోమేశావా, వెళ్లిపోయాడా ప్రణయ్ పొలానికి  అని అడిగారు.. ఆ మాటకి అటు తిరిగి ఉన్న ప్రతిమా వెనక్కి తిరిగి యశోద గారిని చూస్తూ  ఖాళీగా ఉన్నాను కదా అత్తయ్య సింక్లో గిన్నెలు కనిపించాయి..

 

వాటిని తోమేస్తే ఓ పని అయిపోతుంది కదా అని క్లీన్ చేసేసాను.. ప్రణయ్ గారు ఇంతకుముందే పొలానికి వెళ్లిపోయారు.. మధ్యాహ్నం భోజనానికి ఇంటికి రాను అని చెప్పారు  అని చెప్తుంది..

 

హా ఇది నాకు మామూలే ప్రతిమ వాడెప్పుడూ అంతే  ఉదయం వెళ్లి సాయంత్రం ఎప్పుడో ఇంటికి వస్తాడు.. మధ్యాహ్నం భోజనానికి ఇంటికి రారా అంటే పొలంలో ఏదో ఒక పని ఉంది అని చెప్తూ ఉంటాడు..

 

ఇందాక వెళ్లేటప్పుడు నాతో కూడా చెప్పి వెళ్ళాడు లే మధ్యాహ్నం భోజనం చేయడానికి ఇంటికి రావడం కుదరదు అని..  మనమే త్వరగా వంట పూర్తి చేసి క్యారేజ్ కట్టి పొలానికి పంపించాలి..

 

నువ్వు ఆ పని పూర్తి అయితే ఫ్రిజ్లో కూరగాయలు ఉన్నాయి.. వాటిని కట్ చేసి ఇవ్వు తల్లి నేను బియ్యం కడిగి పెట్టి పొయ్యి మళ్ళీ అంటిస్తాను అని చెప్తారు..

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue