New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
మాంగళ్య బంధం – 158

మాంగళ్య బంధం – 158

హ నేనే కానీ నువ్వేంటి నీ అవతారం ఏంటి? అయినా నువ్వు పొద్దు పొద్దున్నే లేచి ఇక్కడ ఏం చేస్తున్నావ్ ప్రతిమ.. ఇవన్నీ నువ్వు ఎందుకు చేస్తున్నావు నేను చేసేదాన్ని కదా అంటూ నవ్వుతూనే ప్రతిమ దగ్గరికి వస్తారు..

 

అంటే అత్తయ్య అది రోజు మీరే చేస్తున్నారు కదా.. నేను ఉండి కూడా మీరు పనులు చేసుకోవడం నాకు నచ్చడం లేదు.. అందుకే ఈరోజు నుండి ఇవన్నీ నేనే చేయాలి అనుకుని ఇలా వచ్చాను..

 

కానీ ఏంటో నాకు నీళ్లలో పేడ ఎలా కలపాలో అర్థం కావడం లేదు.. అందుకే కాస్త ఆలస్యమైంది లేదంటే ఈపాటికి ఎప్పుడో ముగ్గు పెట్టేసి ఇంట్లోకి వచ్చేసే దాన్ని  అని చిన్నగా చెప్తుంది..

 

ప్రతిమ తన పుట్టింట్లో అలాంటి పనులు ఏమీ ఎప్పుడూ చేయలేదు అన్న విషయం  యశోద గారితో పాటు ప్రణయ్ కి కూడా తెలుసు..

 

అసలు వాళ్ళింట్లో ప్రతిమ మరీ అంత ఉదయాన్నే నిద్ర లేవదు అని కూడా తెలుసు.. అలాంటి అమ్మాయి అత్తగారింటికి వచ్చిన తరువాత  తను ఉండగా రోజు అత్తగారు ఆ పనులు చేయకూడదు అన్న ఆలోచన ఆమెకు వచ్చినందుకే యశోద గారికి చాలా సంతోషంగా అనిపిస్తుంది..

 

తనకి అలాంటి పనులు చేయడం అలవాటు లేకపోయినా సరే  తనే చెయ్యాలి అని ప్రయత్నం చేయడం ఆమెకి బాగా నచ్చుతుంది..

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue