హా చూశావా నాన్న నా కోడలు ఉదయాన్నే లేచి వాకిలి ఊడ్చి కల్లాపి చల్లి ముగ్గు కూడా పెట్టింది… తను అలా చేస్తుంటే నాకు ఎంత సంతోషంగా ఉందో తెలుసా..
తనతో పనులు చేయించడం నాకేమీ సరదా కాదు కానీ ఈ ఇంటి కోడలుగా ఇవన్నీ చేయడం తన బాధ్యతగా ప్రతిమ భావించినందుకే చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాను అని మనస్ఫూర్తిగా చెప్తారు యశోద గారు..
ఆవిడకే కాదు ప్రణయ్ కి కూడా ప్రతిమ అలా తన ఇల్లు తన బాధ్యతలు అని ఆలోచించి అలా చేయడం చాలా ఆనందాన్ని కలిగించింది..
తనతో ఎలా ఉన్నా సరే తన వాళ్లతో బాగా కలిసిపోతుంది అందరితో కలివిడిగా మాట్లాడుతుంది.. అందరినీ ప్రేమగా చూస్తుంది..
చిన్నపిల్లలు అంటే చాలా ప్రేమ అని అర్థం అవుతుంది.. తన తల్లిని కష్టపెట్టకూడదు అని ఆ ఇంటి కోడలుగా తన బాధ్యతలు తీసుకుంది..
ఇవన్నీ చూస్తున్న అతనికి త్వరలోనే ప్రతిమ మనసు మారే అవకాశం ఉందేమో అని ఆశ కూడా పుడుతుంది.. ఇంటి కోడలుగా పనుల్లో బాధ్యత తీసుకున్న ఆమె కొద్ది రోజుల తర్వాత అయినా తన భార్యగా బంధాన్ని ఒప్పుకోకపోతుందా..