వంటింట్లో పొయ్యి వెలిగిస్తున్న యశోద గారికి ప్రతిమ పిలుపు అసలు వినిపించదు.. కానీ అప్పుడే చార్జింగ్ లో ఉన్న ఫోన్ ని తీసుకుందామని వచ్చిన ప్రణయ్ కి ప్రతిమ పిలుపు వినిపించడంతో ప్రతిమ ఎక్కడ ఉండి పిలుస్తుంది అని చుట్టూ వెతుకుతాడు..
ఆ పిలుపు బాత్రూంలో నుండి వస్తున్నట్టు అతనికి అర్థం అవడంతో బాత్రూంలో ఉండి ప్రతిమ అమ్మని ఎందుకు పిలుస్తుంది?
ఏమై ఉంటుంది? ప్రతిమ కి ఏదైనా అవసరం ఉందా? అందుకే అమ్మని పిలుస్తుందా? ఇప్పుడు నేను ప్రతి పని ఏం కావాలి అని అడిగితే తన ఇబ్బంది పడుతుందా..
ఏం కావాలో తను నన్ను అడిగి తీసుకోగలుగుతుందా.. ఇప్పుడు నేను పలకాల వద్ద ప్రతిమ పిలుపు అమ్మకు వినిపించినట్టు లేదే అనే కాసేపు తర్జనా పర్జనా పడి ఏదైతే అది అవుతుందిలే ముందు విషయం ఏంటో కనుక్కుందాం..
తనకి నాకు చెప్పడం ఇష్టం అయితే చెప్తుంది.. లేదంటే అప్పుడు నేనే వెళ్లి అమ్మకి ప్రతిమ పిలుస్తుంది అన్న విషయం చెప్తాను..
అప్పుడు అమ్మ వచ్చి తనకేం కావాలో అది ఇస్తుంది అని తనలో తను అనుకుని ప్రతిమ ఏం కావాలి నీకు అని బాత్రూం డోర్ దగ్గరికి వచ్చి చిన్నగా అడిగాడు..