New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
మాంగళ్య బంధం – 170

మాంగళ్య బంధం – 170

భరత్ మాటలకి తల పూర్తిగా కిందకి దించేసి అబ్బా నేనేంటి ఇలా చేశాను..అయినా ఉన్నట్టుండి నాకేమైంది.. ప్రతిమని ఎప్పుడూ చూడనట్టు ఇప్పుడే కొత్తగా చూస్తున్నట్టు అలా చూస్తూ ఉండిపోయాను..

 

బావ అన్నాడు అని కాదు కానీ నిజంగానే నోరు తెరుచుకునీ మరి చూస్తూ ఉండిపోయాను.. తనని నేను అలా చూడడం ఒక బావ మాత్రమే చూశాడా లేదంటే ఇక్కడ ఉన్న వాళ్ళలో ఇంకెవరైనా చూశారా..

 

కేవలం బావే చూసి ఉంటే కాసేపు ఆట పట్టించి వదిలేస్తాడు.. అలా కాకుండా మరి ఎవరైనా చూస్తుంటే నా గురించి ఏమనుకున్నారో ఏంటో.. రేయ్ ప్రణయ్ ఏమవుతుంది రా నీకు..

 

అయినా సొంత భార్యకి సైట్ కొట్టేవాడిని నిన్నే చూస్తున్నాను. తను ఎంత అందంగా ఉంటే మాత్రం నువ్వు ఎంతమంది మధ్యలో ఉన్నావో మరిచిపోయే అలా చూస్తే ఎలా అని మనసులో తనని తాను తిట్టుకుంటూ ఉంటాడు..

 

ఏరా బామ్మర్ది ఇప్పటివరకు నా చెల్లెల్ని కళ్ళతోనే తినేసేలాగా చూసి , నేను అడిగాను అని సమాధానం చెప్పకుండా సైలెంట్ అయిపోయి తలదించేసుకున్నావ్ ఏంటి కథ అంటాడు భరత్ అల్లరిగా..

 

అబ్బా బావ ప్లీజ్ వదిలేయండి ఇంక.. నేనేదో అనుకోకుండా అలా చూశాను.. ఈరోజు ఏంటో కాస్త కొత్తగా కనిపిస్తే ఒక నిమిషం గమనించాను అది కూడా తప్పేనా అని అంటాడు ప్రణయ్ చిన్నగా..

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue