మాంగళ్య బంధం – 3
మన కుటుంబం రోడ్డున పడకుండా మన కాళ్ళ మీద,మన సంపాదన మీద మనం బతుకుదాం అని చిన్నవాడయినా వయసుకి మించిన పెద్దరికంగా ఆలోచించి ఆ వయసులోనే కుటుంబ బాధ్యతలు తీసుకున్నాడు ప్రణయ్..
బాధ్యతలు పేరుకి తీసుకోవడమే కాదు.. తండ్రి బాటలో తల్లి పర్యవేక్షణ లో కొద్ది నెలల్లోనే వ్యవసాయం గురించి ఒక అవగాహన తెచ్చుకున్నాడు…
వున్న భూమిలో ఒకదాని తర్వాత ఒకటి పంటలు వేస్తూ , వచ్చిన డబ్బుని పొదుపు చేయడం స్టార్ట్ చేసాడు..
రోడ్డున పడబోయిన కుటుంబాన్ని మళ్ళీ నిలబెట్టాడు..
తండ్రి గా బాధ్యత తీసుకుని వయసుకి వచ్చిన అక్క కి ఉన్నంతలోనే ఒక మంచి సంబందాన్ని చూసి పెళ్ళి కూడా జరిపించి అత్తారింటికి సాగనంపాడు..
అన్ని ఎంతో చక్కగా, బాధ్యత గా చేసుకుంటా పోతున్న ప్రణయ్ నీ చూస్తే యశోద, భాను గారికి గర్వం గాను, సంతోషం గాను ఉండేది.
భాను తన భర్త అయిన భరత్ తో కలిసి తన అత్తగారింట్లో కాపురం చేసుకుంటుంది…
ఆమెకి మూడేళ్లు తిరిగేలోపే ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు..
ఆమె పురుళ్ళు కూడా ప్రణయ్ నే పుట్టింటికి తీసుకువచ్చి తల్లి ఆధ్వర్యంలో అన్ని సక్రమంగా పూర్తి చేసి పిల్లలకి అయిదవ నెల వచ్చేవరకు పుట్టింట్లోనే ఉంచుకుని అన్ని ఖర్చులు అతనే భరించి పురిటి సారేతో తిరిగి అత్తారింటికి పంపుతాడు..
అంతటితో ఒక రకం గా ఒక తండ్రి ల నిలబడి ఒక బాధ్యత నీ పూర్తి చేసేసాడు ప్రణయ్…
ఇప్పుడు ఇంట్లో వున్న యశోద గారిని తన తల్లిలా కంటే కూడా ఒక చిన్న బిడ్డ ల ఎంతో ప్రేమగా, అపురూపం గా చూసుకుంటున్నాడు ప్రణయ్…
ప్రణయ్ అంటే ఆ చుట్టు పక్కల వాళ్లందరికీ కూడా ఎంతో ప్రేమభిమనాలు, గౌరవం కూడా…
చిన్న వయసులోనే బాధ్యతల్ని నెత్తిన వేసుకుని కుటుంబాన్ని నిలబెట్టిన అతని ఆత్మ స్థైర్యం అంటే అందరికీ ఇష్టం…
అందులో శేఖర్ కుటుంబం కూడా ఒకటి… శేఖర్ గారు కూడా వ్యవసాయం చేసే వ్యక్తి…
పైగా శ్రీరాములు గారికి ఒకరకంగా గా స్నేహితుడు కూడా…
ఆయన చనిపోయాక శేఖర్ గారు డబ్బు సాయం చేస్తాను అన్న ఆత్మభిమానం వున్న ప్రణయ్ డబ్బు సాయం వద్దని, తాము తమ కష్టం తోనే బతకాలి అనుకుంటున్నాం అని సున్నితం గా తిరస్కరిస్తాడు…
ఆ వయసులోనే అతనికున్న ఆత్మభిమానానికి శేఖర్ గారు మెచ్చుకుంటారు మనసులోనే..
కుటుంబం కోసం అతను పడ్డ కష్టాన్ని దగ్గరుండి చూసిన వాడు కనుక ప్రణయ్ అంటే అతనికి చాలా గౌరవం తో కూడిన ప్రేమ..
ఇద్దరి పొలాలు పక్క పక్కనే కావడం తో చిన్న వయసు నుండే ప్రణయ్ పడిన కష్టాన్ని తన కళ్ళతో తను చూసారు శేఖర్ గారు…
ప్రణయ్ క్యారెక్టర్ అంటే శేఖర్ గారికి చాలా ఇష్టం..
శేఖర్ గారికి మాత్రమే కాదు శాంతి గారికి కూడా ప్రణయ్ అంటే అభిమానం ఎక్కువే…
ప్రణయ్ చాలా మంచివాడు.. గుణవంతుడు.. ఉన్నంతలో నలుగురుకి సాయం చెయ్యాలి అంటూ అందరి మంచికోరే మంచి మనసున్న వాడు..
ఆరడుగుల ఎత్తు తో మంచి రంగు, రూపులతో, చిన్నప్పటి నుండి కష్టం చేయడం తో దృడం గా వున్న శరీరం, ఎప్పుడు పెదవుల మీద చెరగని చిరునవ్వుతో చూడడానికి చాలా అందం గా ఉంటాడు..
అంతటి అందగాడు, సౌమ్యుడు, మంచి స్వభావం కలిగిన ప్రణయ్ మీద శేఖర్ గారికి వున్న ఇష్టం తో తమ కూతురు ప్రతిమ నీ ప్రణయ్ లాంటి వ్యక్తిత్వం వున్న మంచి వ్యక్తి కి ఇచ్చి పెళ్ళి చేస్తే ఒకేవూరు కాబట్టి ఎప్పుడు వాళ్ళ కళ్ళ ముందరే ఉంటుందని…
ప్రణయ్ తన కూతురిని బాగా చూసుకుంటాడు కనుక అతనితో ఆమె జీవితం సంతోషం గా ఉంటుందని మనసులోనే అనుకుంటాడు…
ఆ విషయాన్నీ ఒకరోజు రాత్రి సమయం లో భార్య శాంతి కి కూడా చెప్తాడు..
శేఖర్ గారి మాటలు విన్న శాంతి కూడా చాలా సంతోషిస్తూ చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు అండీ..
ప్రణయ్ మన కళ్ళ ముందే పుట్టి పెరిగిన వాడు.. ఎలాంటి చెడు అలవాట్లు లేని వాడు.. ఎంతో బాధ్యత గా నడుచుకుంటాడు…
తల్లి ని,అక్కనే అంత ప్రేమగా చూసుకునేవాడు చేసుకున్న భార్య ని ఇంకెంత ప్రేమగా చూసుకుంటాడో వేరేగా చెప్పక్కర్లేదు..
ప్రణయ్ కి గాని మన అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తే ఇంక మన ప్రతిమ గురించి ఎలాంటి దిగులు అవసరం లేదు..
ఎలాంటి చీకు,చింతలు లేకుండా జీవితాంతం ఆనందం గా ఉంటుంది.. ఈ విషయం గురించి మన ప్రతిమ తో కూడా ఒకసారి మాట్లాడాక మనం వెళ్లి యశోద వదిన తో సంబంధం గురించి మాట్లాడదాం ఏమంటారు అంటుంది శాంతి..
అబ్బా కొత్తగా మన అమ్మాయిని అడగడం ఏంటి శాంతి.. అయిన అది చిన్న పిల్ల.. తనకి మంచేదో, చెడేదో ఎం తెలుసు చెప్పు…
మనం చెప్పింది చేయడం తప్ప తనకి సొంతంగా నిర్ణయాలు తీసుకోవడం తెలుసా ఏంటి.. మన అమ్మాయి మన మాట కాదనదు.. మనం చెప్పినట్టే చేస్తుంది అంటారు శేఖర్ గారు నమ్మకంగా…
continued…
Swipe left/right or tap the sides to turn pages