New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
మాంగళ్య బంధం – 4

మాంగళ్య బంధం – 4

మనం చెప్పింది చేయడం తప్ప  తనకి సొంతంగా నిర్ణయాలు తీసుకోవడం తెలుసా ఏంటి.. మన అమ్మాయి మన మాట కాదనదు.. మనం చెప్పినట్టే చేస్తుంది అంటారు శేఖర్ గారు నమ్మకంగా…

 

ఆయన మాటలు విన్న తర్వాత సరే మరి మీ ఇష్టం.. మీ మాట నేనెప్పుడూ కాదన్నాను మీరెలా అంటే అలానే చేద్దాం..

 

మనం ప్రణయ్ కంటే మంచి అబ్బాయి ని ఈ ప్రపంచం మొత్తం వెతికిన తీసుకురాలేము… కనుక  ఈ విషయాన్నీ ఆలస్యం చేయకూడదు…

 

ప్రణయ్ లాంటి  బుద్ది మంతుడి కోసం చాలా మంది ఎదురు చూస్తుంటారు… ఎవరో ఒకరు సంబంధం గురించి మాట్లాడుకునే లోపు ముందుగా మనమే వెళ్లి యశోద వదిన తో ప్రణయ్, ప్రతిమ ల పెళ్ళి గురించి అడుగుదాం..

 

ఇలాంటి విషయాల్లో ” ఆలస్యం అమృతం విషం” అన్నారు గా పెద్దలు అని  చెప్తుంది శాంతి…

 

 

హ్మ్   నువ్వన్నది కూడా నిజమే శాంతి.. ప్రణయ్ లాంటి అల్లుడిని ఎవరు కాదనుకుంటారు చెప్పు… ఆలస్యం చేయకుండా మంచిరోజు చూసుకుని సంబంధం గురించి మాట్లాడదాం అంటారు శేఖర్..

 

హ అలాగే అండీ అంటు ఇద్దరు పడుకుండి పోతారు…

 

ఇవేమి తెలియని ప్రతిమ  మాత్రం పక్క రూమ్ లో  తన బెడ్ మీద హాయిగా నిద్రపోతు  సాఫ్ట్వేర్ ఉద్యోగి ని పెళ్ళి చేసుకుని సిటీ లో కాపురం పెట్టి సిటీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నట్టు కలలు కంటూ ఉంటుంది…

 

రోజులు వేగంగా గడిచిపోయాయి.. 

 

ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ గా కాలం గడుపుతున్నారు..

 

ఒకరోజు శేఖర్ గారు పంతులుగారిని అడిగి మంచిరోజు ఎప్పుడు అన్నది తెలుసుకుని ఆ విషయం శాంతి కి చెప్తారు..

 

  మంచి రోజు మరునాడే కావడంతో అలాగేనండి  రేపు ఉదయాన్నే  మనం యశోద వదిన వాళ్ళింటికి వెళ్లి మాట్లాడి వద్దాం అంటుంది…

 

అనుకున్నట్టుగానే మరుసటి రోజు  ఉదయాన్నే  శేఖర్, శాంతి ఇద్దరు కలిసి యశోద  గారింటికి వెళ్తారు…

 

వాళ్ళిద్దరినీ చూసిన యశోద గారు నవ్వుతు శేఖర్ అన్నయ్య శాంతి వదిన మీరా రండి రండి కూర్చోండి..

 

చాలా రోజులకి మా ఇల్లు గుర్తొచ్చింది మీకు.. ఏంటో  ఉండేది ఒకే ఊరు అయిన  ఒకరింటికి ఒకరం రావడం కూడా కష్టం గానే వుంది…

 

ఎవరి పనుల్లో వాళ్ళు హడావిడిగా వుంటున్నారు అంటు వాళ్ళిద్దరినీ కూర్చోపెట్టి అంత కుశలమేనా అన్నయ్య..

 

మన ప్రతిమ ఎలా వుంది.. ఎప్పుడో వయసుకి వచ్చినపుడు చూసాను తనని .. మళ్ళీ చూసిందే లేదు..

 

నాకా ఒంట్లో నలతగా ఉంటుందని మా ప్రణయ్ ఇంట్లో నుండి బయటకే పోనివ్వట్లేదు..

 

అందుకే ఎక్కడికి వెళ్లలేక పోతున్నాను.. ప్రతిమ ఎం చేస్తుంది ఇప్పుడు అని అడిగింది యశోద..

 

ఆవిడ మాటలు విన్నాక హ్మ్ నువ్వు చెప్తుంది నిజమే చెల్లెమ్మ ఒకే ఊరిలో ఉంటున్న ఎవరి పనుల్లో వాళ్ళకి తీరిక లేక ముందులా ఇప్పుడు మనం కలుసుకోలేక పోతున్నాం.. 

 

మేమంత కుశలమే కానీ.. నీకేమైంది ఒంట్లో ఎందుకు నలతగా ఉంటుంది అని కాస్త కంగారుగా అడిగారు శేఖర్  గారు …

 

హహహ కంగారు పడాల్సిందేమి లేదు అన్నయ్య…. ఏదో కాస్తంతా నీరసం.. ఈ కాళ్ళ నొప్పులు ఎక్కువ వుంటున్నాయి…

 

అంత దానికే నేనేదో కస్ట పడిపోతున్నాను అని మన ప్రణయ్ ఎక్కడికి పోనివ్వట్లేదు.. ఇంట్లోనే ఉంటు విశ్రాంతి తీసుకోమంటూ పొలం వరకు కూడా రానివ్వడం లేదు పిచ్చి తండ్రి…

 

ఈ అమ్మ మీద అంత ప్రేమ బంగారానికి అంటు కొడుకుని తలచుకుని మురిసిపోతుంది యశోద.. 

 

హహహ అలాంటి బంగారం లాంటి బిడ్డ ఉండడం ఎంత అదృష్టమో చెల్లెమ్మ..

 

నువ్వు ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నావో కానీ నిన్ను తల్లి ల కాకుండా బిడ్డ ల చూసుకునే కొడుకు పుట్టాడు…

 

ఎంతయినా అదృష్టవంతురాలి వె అని నవ్వుతు అంటారు శేఖర్ గారు…

 

హ్మ్ ఇదయితే నిజమే అన్నయ్య అని యశోద కూడా నవ్వుతు ప్రతిమ గురించి చెప్పనేలేదు  మీరు అంటుంది మళ్ళీ…

 

ప్రతిమ కూడా చాలా బాగుంది చెల్లెమ్మ… డిగ్రీ వరకు చదువుకుంది… ప్రస్తుతం పక్క ఊరిలో వున్న స్కూల్ లో టీచర్ గా ఉద్యోగం చేస్తుంది అని చెప్తారు శేఖర్.. 

 

ఓహ్ అవునా మంచి మాట చెప్పావు అన్నయ్య..  మన ప్రతిమ చిన్నప్పుడే చురుకుగా ఉండేది లే… చక్కగా చదువుకుని ఉద్యోగం కూడా చేస్తుందన్నమాట  సంతోషం అప్పుడే చాలా పెద్దదయిపొయింది అని ఆనందంగా చెప్పి  అన్నయ్య  ఇంతకీ ఉదయాన్నే మీ రాక కి  కారణం ఏంటో చెప్పనే లేదు అని అడిగింది యశోద.. 

 

ఆ మాటకి  శేఖర్, శాంతి ఒకరిని ఒకరు చూసుకుని  యశోద వైపు తిరిగి  ఎం లేదు చెల్లెమ్మ మన ప్రతిమ  గురించి మీతో మాట్లాడదాం అని వచ్చాము అని చెప్తారు…

 

ప్రతిమ గురించ నాతో మాట్లాడాలా ఏ విషయం గురించి అన్నయ్య అని ఆశ్చర్యం గా అడిగింది యశోద…

 

ఆ మాటలకి, ఆమె మొహంలో కనిపిస్తున్న ఆశ్చర్యానికి భార్య భర్తలు ఇద్దరూ ఒకరి మొహం ఒకరు చూసుకుని విషయం చెప్పడానికి సిద్ధం అయ్యారు..

 

continued…