ఆ మాటలు విన్న వెంటనే నా బంగారు తల్లివి అమ్మ నువ్వు.. నువ్వెంత అందంగా ఉన్నావో నీ మనసు అంత అందం గా ఉంటుంది..
మా మంచి మారాణివి నువ్వు.. అందుకే మారాజు లాంటి ప్రణయ్ బాబుతో నీ లగ్గం కుదిరింది అని సంతోషంగా చెప్తాడు ఆటో అతను..
అది విన్న వెంటనే ప్రతిమ మొహాన్ని అదో రకంగా పెట్టుకుని బాబాయ్ నీకు నా పెళ్ళి గురించి తెలుసా అని అడిగింది..
హా తల్లి తెలుసు… మన ఊరిలో ఇలాంటి విషయాలు త్వరగా ఊరంత తెలిసి పోతాయి కదా.. అలానే మీ పిన్ని తో ఎవరో చెప్తే తను నాకు చెప్పింది…
ప్రణయ్ బాబు తో నీ పెళ్ళి కుదిరింది అని తెలిసి నేను ఎంత సంతోష పడినానో తెలుసా తల్లి.. నువ్వెంత బంగారానివో, ఆ బాబు కూడా అంతే మంచోడు..
అందం లోనే కాదు గుణం లో కూడా ఆ రాముడి లాంటి వాడు.. మీ ఇద్దరి జంట అచ్చం ఆ సీత రాములల కనుల పండుగ గా ఉంటుంది అని ఎంతో ఆనందం గా చెప్తాడు ఆటో అతను..