అతను వెళ్ళిపోయాక కూడా అక్కడే నిలబడి ఏంటి అందరు అతని గురించి మంచిగా చెప్తున్నారు.. నిజంగా అతనికి ఏ అలవాట్లు లేవా..
అతనికి ఏమున్నా లేకున్నా నాకు అతన్ని పెళ్ళి చేసుకోవడం ఇష్టం లేదే.. నేను అప్పుడే గివప్ ఇవ్వకూడదు..
ఇంకా కొన్ని డేస్ టైమ్ వుంది గా.. ఎక్కడో ఒక చోట అతగాని గురించి నెగిటివ్ గా ప్ర్రూఫ్ దొరకక పోతుందా.. నేను దాన్ని అడ్డు పెట్టుకుని పెళ్ళి ఆపన అనుకుని స్కూల్ బెల్ కొట్టడం తో తన ఆలోచనల్ని అంతటితో వదిలేసి లోపలకి వెళ్ళిపోతుంది…
స్కూల్ లోపలకి వెళ్ళగానే స్టూడెంట్స్, టీచర్లు అందరు ప్రేయర్ చేయడానికి వస్తు ఉండడం తో తను కూడా తన హ్యాండ్ బ్యాగ్ ని పక్కన పెట్టేసి వాళ్ళతో కలిసి శ్రద్దగా ప్రేయర్ పూర్తి చేస్తుంది..
అది కంప్లిట్ అయ్యాక ఎవరి క్లాసెస్ కీ వాళ్ళు వెళ్ళి పోతుండడం తో ప్రతిమ కూడా పక్కన పెట్టిన హ్యాండ్ బ్యాగ్ తీసుకుని ముందుగా స్టాఫ్ రూమ్ కీ వెళ్లి సైన్ చేసేసి తన బ్యాగ్, లంచ్ బాక్స్ అక్కడే పెట్టేసి అక్కడ నుండి నేరుగా తన క్లాస్ రూమ్ కీ వెళ్తుంది..
ప్రతిమ రూమ్ లోకి రావడం చూసిన స్టూడెంట్స్ అందరు గుడ్ మార్నింగ్ టీచర్ అని నవ్వుతు విష్ చేయడం తో, ఆ చిన్న పిల్లల కల్మషం లేని నవ్వులు చూడగానే అప్పటి వరకు ప్రణయ్ గురించి ఆలోచించి అసహనం, చిరాగ్గా వున్న మొహం లో ఆ చిరాకు పోయి మాములుగా అయి పోతుంది..