తను కూర్చోగానే ఆటో స్టార్ట్ చేసి ముందుకు వెళ్తూ మన్నించు తల్లి నేను నిన్ను ఇవాళ చాలా సేపు ఎదురు చూసేలా చేసినట్టున్నాను.. త్వరగా వచ్చేద్దాం అని పక్కూరికి బాడుగకి వెళ్ళాను..
అక్కడ కాస్త ఆలస్యం అయినది.. తిరిగి వచ్చేసరికి ఇదిగో ఈ టైమ్ అయింది అని ఇబ్బందిగా చెప్తాడు ఆటో బాబాయ్ ..
ఆయన మాటల్ని విన్న ప్రతిమ అయ్యో బాబాయ్ నీకు ముందే చెప్పాను కదా నేను.. ఇలాంటి విషయం లో నువ్వు నా దగ్గర ఇబ్బంది పడకు అని..
అయినా ఒక పది నిముషాలు అటు ఇటు వచ్చేస్తావు కదా. ఒక పది నిముషాలు ఆలస్యం అయితే కొంపలు ఏమి మునిగి పోవులె..
నేను అంత త్వరగా ఇంటికి వెళ్ళిపోయి చేసే ముఖ్యమైన పనులు ఏమి వుండవు,.నువ్వు నా విషయం లో ఎప్పుడు ఇలా బాధపడకు సరేనా అని నవ్వుతు చెప్పి తన చూపుని రోడ్డుకి ఇరువైపులా వున్న పంట పొలాల మీదకి తిప్పేస్తుంది..
ప్రతిమ మాటలు విన్న ఆటో అతనికి తన ఇబ్బంది, బాధ అన్ని పోయి నీది చాలా మంచి మనసు తల్లి.. అందరి పరిస్థితి నీ ఇట్టే అర్ధం చేసుకుంటావు..
అందుకే ఆ దేవుడు నీ మంచి మనసుకి తగ్గట్టే నీ పెళ్ళి ఆ ప్రణయ్ బాబు లాంటి మంచోడు తో జరిగేలా చేస్తున్నాడు అనుకుంటాడు మనసులో..