సోఫా లో కూర్చుని శాంతి గారు ఇచ్చిన టీ తాగుతూ ఉల్లి పకోడీ తింటూ చుట్టు పరికించి చూస్తు వదిన ఇంటికి రంగులు వేయడం కూడా దాదాపు అయిపోతున్నట్టుంది కదా అని అడిగారు.
ఆ మాటకి శాంతి గారు చిన్నగా నవ్వి హా రేపు ఒకరోజు వేసేస్తే పూర్తయినట్టే వదిన.. మరి మీ పని ఎంత వరకు వచ్చింది..
రంగులు వేయడం అయిపోయిందా అని అడిగారు శాంతి..
హా వదిన మాకు కూడా రేపు వచ్చి వేస్తె అయిపోయినట్టే , ఇంటి చుట్టు, ప్రహరీ, ఇంటి వెనక మొత్తం వేసేసారు..
ఇంట్లో కూడా హాల్, ఇంకో సైడ్ వేసేసారు.. ఇంక వంటిల్లు, ప్రణయ్ రూమ్ మాత్రం వున్నాయి.. రేపు వచ్చి అవి వేసేస్తాను అన్నాడు సూరి గాడు అని చెప్తారు యశోద..
ఓహ్ అవునా మంచిది అని యశోద, శాంతి గార్లు పకోడీ తింటూ పెళ్ళి పనుల గురించి మాటల్లో వుంటారు..