ఆ చూపుకి అర్ధం ఏంటి అంటే నా వెనకాలే వస్తున్న నువ్వు నాతో పాటు వచ్చి అత్తయ్యని పలకరించకుండా అక్కడే ఎందుకు నిలబడ్డావు అని..
శేఖర్ గారు నోరు తెరిచి ఏమి మాట్లాడక పోయిన ఆయన కంటి చూపుతోనే మ్యాటర్ అర్ధం అయిన ప్రతిమ పరుగు లాంటి నడక తో యశోద గారి ముందుకు రావడమే కాదు..
కిందకి వంగి వినయం గా ఆమె పాదాలకి దండం కూడా పెడుతుంది… ప్రతిమ సడన్ గా అలా చెయ్యగానే అయ్యయ్యో ఏంటి తల్లి ఇది.
ఇవన్నీ అవసరమా ఇప్పుడు అంటునే తన కాళ్ళు పట్టుకుని వున్న ప్రతిమ నీ పైకి లేపుతు చల్లగా వుండు బంగారం అంటారు యశోద నవ్వుతు ..
ఆమెకి ప్రతిమ నీ చూడగానే ముచ్చటగా అనిపిస్తే తను అంత వినయం గా నమస్కరించడం చూసి నా బంగారు తల్లికి ఎంత సంస్కారం ఉందొ అని మురిపెం గా చూసుకుంటారు..
యశోద గారు తన వైపే చూస్తుండగా ప్రతిమ చిన్నగా స్మైల్ ఇచ్చి బాగున్నారా అత్తయ్య అని పలకరిస్తుంది..