New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
మాంగళ్య బంధం – 5

మాంగళ్య బంధం – 5

 ముందుగా గొంతు సవరించుకున్న శాంతి అది ఏమీ లేదు వదిన మన ప్రతిమ పెళ్ళి వయసుకి వచ్చింది… తనకి  ఈ ఏడాది పెళ్ళి చెయ్యాలి అని అనుకుంటున్నాం అంటుంది …

 

ఓహ్ మంచి మాట చెప్పారు వదిన.. మన ప్రతిమ కి పెళ్ళి చెయ్యాలనుకుంటున్నాం అని.. ఇంతకు అబ్బాయిని ఎక్కడైనా చూసారా..ఏదయినా సంబంధం కుదిరిందా అని మాములుగా అడిగింది యశోద.. 

 

హ్మ్ అబ్బాయిని చూసాము వదిన.. చాలా మంచి సంబంధం కూడా… అబ్బాయి గుణవంతుడు, బుద్దిమంతుడు, మంచి మనసున్న మహారాజు  అనుకో అని గొప్పగా చెప్తుంది శాంతి…

 

ఓహో అవునా ఇదింకా మంచి విషయం… అబ్బాయికి అన్ని మంచి లక్షణాలే కనుక మన ప్రతిమ సుఖపడుతుంది అని సంతోషం గా అంటుంది యశోద.. 

 

హ్మ్ అవును చెల్లెమ్మ  ఆ అబ్బాయి కనుక మన ప్రతిమ ని పెళ్ళి చేసుకుంటే ప్రతిమ జీవితానికి  ఎలాంటి లోటు ఉండదు.. ఎప్పుడు సుఖ సంతోషాలతో వర్దిల్లుతు ఉంటుంది.. 

 

అందులో మాకు ఎలాంటి సందేహం  లేదు అంటారు శేఖర్ గారు.. 

 

అవునా చాలా మంచి వార్త చెప్పారు అన్నయ్య.. ఇంతకీ అబ్బాయిది ఏ ఊరు, అబ్బాయి ఎం చేస్తుంటాడు అని ఆరాగా అడిగింది యశోద.. 

 

అబ్బాయి వ్యవసాయం చేస్తుంటాడు.. అబ్బాయిది మన వూరే చెల్లెమ్మ అని చెప్తాడు శేఖర్..

 

ఏంటి మన ఊరి అబ్బాయా.. పైగా వ్యవసాయం చేస్కునే వాడా.. అలాంటి అబ్బాయి మంచి మనసున్నవాడు ఎవరు అన్నయ్య నాకు తెలియకుండా  అని అడిగింది యశోద ఆలోచిస్తున్నట్టుగా మొహం పెట్టి.. 

 

ఆ అబ్బాయి ఎవరో కాదు చెల్లెమ్మ మన ప్రణయ్ నే అని అసలు విషయం కుండ బద్దలు కొట్టినట్టుగా చెప్పేస్తారు శేఖర్…

 

ఆ మాటలు విన్న యశోద  చాలా ఆశ్చర్యం గా మొహం పెట్టి ఎం అంటున్నారు అన్నయ్య  మీరు.. 

 

మన ప్రతిమ తో మన ప్రణయ్ పెళ్లా ఇదెలా సాధ్యం .. వాళ్ళిద్దరికీ పెళ్ళి ఎలా జరుగుతుంది అని అంటుంది యశోద.. 

 

ఆ మాటతో శేఖర్,, శాంతి ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటారు…

 

ఎం. చెల్లెమ్మ మన ప్రణయ్ కి భార్య గా మన ప్రతిమ సరిపోదా  అని కాస్త బాధగానే అడిగారు శేఖర్…

 

అయ్యో అన్నయ్య నేను ఆ ఉద్దేశం తో అనలేదు… మన ప్రతిమ బాగా చదువుకుని టీచర్ గా ఉద్యోగం కూడా చేస్తుందని  మీరే అంటున్నారు…

 

మన ప్రణయ్ ఏమో పది వరకు మాత్రమే చదువుకుని పొలంలో  వ్యవసాయం చేస్కుంటున్నాడు…

 

చదువుకుని ఉద్యోగం చేసే ప్రతిమ ఎక్కడ, పొలం పనులు చేస్కునే ప్రణయ్ ఎక్కడ.. 

 

వీరిద్దరికీ అసలు పొంతనే లేదు కదా అన్నయ్య.. ఒకసారి మీరే బాగా ఆలోచించండి.. చదువుకున్న అమ్మాయి,  పెద్దగా చదువు కొని ప్రణయ్ తో సర్దుకు పొగలదా…

 

తన భర్త తనలా చదువుకోలేదే అన్న బాధ ఏ అమ్మాయికి అయిన ఉండేదేగా..  అలాంటిది ఇక్కడ ప్రతిమ చదువుకోవడమే కాక ఉద్యోగం కూడా చేసుకుంటుంది…

 

అట్లాంటి అమ్మాయి ప్రణయ్ నీ చేసుకోవడానికి ఇష్టపడుతుందా… ప్రణయ్ తో సర్దుకుని కాపురం చేయగలుగుతుందా  అన్న సందేహం తో అంటున్నాను…

 

అంతే అంతకంటే మరో ఉద్దేశం తో కాదు అని తన అభిప్రాయాన్ని వివరిస్తారు యశోద.. 

 

ఆమె మాటలు విన్న తరువాత ఓహ్ ఇదా నీ సందేహం.. నేనింకా నీకు ప్రతిమ నీ కోడలిగా చేసుకోవడం ఇష్టం లేక  వాళ్ళ పెళ్ళి జరగదు అంటున్నవ్ ఏమో అని భయపడ్డాను కదా చెల్లమ్మ.. 

 

ఒక్క క్షణం బయపెట్టేశావ్  అనుకో… నువ్వు అలాంటి సందేహాలు ఏమీ పెట్టుకోకు.. మన ప్రతిమ చదువుకున్న సరే, ఉద్యోగం చేస్తున్న సరే మేము చెప్పిన మాట జవ దాటదు..

 

మనుషుల్ని చక్కగా అర్ధం చేసుకోగలదు… మాకు మన ప్రణయ్ చాలా నచ్చాడు.. ఇంతకంటే గొప్ప అల్లుడుని, మా అమ్మాయికి గొప్ప భర్తని ఎక్కడ తీసుకురాలేము…

 

కనుక మీకు మా ప్రతిమ నీ మీ ప్రణయ్ కి ఇచ్చి పెళ్ళి చేయడం ఇష్టం అయితే సంబంధం ఖాయం చేసుకుందాం ఏమంటావ్ యశోద అంటారు…

 

అయ్యో మీలాంటి వాళ్ళు స్వయంగా వచ్చి పిల్లని ఇస్తాము అంటే వద్దంటామ అన్నయ్య.. మీరెలాంటి వారో మాకు తెలియనిది కాదుగా…

 

కోరి గొప్ప సంబంధం ఇంటికే వస్తే కాదనగలమా ఒకసారి అబ్బాయిని కూడా  ఒకమాట అడిగి  చెప్తాను వుండండి అంటు ప్రణయ్ వున్న రూమ్ లోకి వెళ్లి చూడగా ప్రణయ్ గాఢ నిద్రలో ఉంటాడు…

 

పాపం బిడ్డ రాత్రి పొద్దు పోయేవరకు చేలో ఉండి వచ్చాడు గా అందుకే ఇంకా నిద్రలేవలేదు..

 

బాగా అలసిపోయినట్టు కనిపిస్తున్నాడు అని అలసిన కొడుకు మొహం వంక ఒకసారి  చూసి అతన్ని లేపడం ఇష్టం లేక బయటకి వెళ్లి  అన్నయ్య ప్రణయ్ ఇంకా పడుకునే వున్నాడు…

 

అయిన వాడిని కొత్తగా అడిగేది ఏముంది లే…. ప్రతి విషయం లో నా మాటే వాడి మాట  కూడా…. అలానే ఇప్పుడు కూడా..మీ అమ్మాయే మా ఇంటి కోడలు.. మీ సంబంధం మాకు ఇష్టమే అని నవ్వుతు చెప్తుంది యశోద..

 

చాలా సంతోషం చెల్లెమ్మ మంచి మాట అన్నావు… ప్రణయ్ లాంటి మంచి మనసున్న వ్యక్తి నీ అల్లుడిగా చేసుకోబోతున్నందుకు మాకు కూడా చాలా సంతోషం గా ఉంది అంటు తమతో తెచ్చిన పండు తాంబూలం దేవుని గదిలో పెట్టి  మంచి రోజు చూసి ముహుర్తాలు పెట్టుకుందాం తల్లి నువ్వు ఏమంటావు  అంటారు శేఖర్.. 

 

మీకేది మంచిది అనిపిస్తే అలానే చేద్దాం అన్నయ్య.. పెద్దవారు మంచి, చెడు తెలిసిన వారు  మీకు నేను చెప్పాలా ఏంటి మీకు నచ్చినట్టు కానివ్వండి అంటు నవ్వుతారు యశోద…

 

సరే వదిన వెళ్ళొస్తాం , సరే చెల్లమ్మ వస్తాం.. ఒకవేళ అబ్బాయి అమ్మాయిని చూడాలి అనుకుంటే  ఫోన్ చెయ్యి పెళ్ళి చూపులు ఏర్పాటు చేద్దాం అంటు నవ్వుతు చెప్తారు  శేఖర్…

 

హహహ సరే అన్నయ్య ప్రణయ్ ప్రతిమ నీ చూడాలి అనుకుంటే ఫోన్ చేసి చెప్తాను అంటారు యశోద…

 

సరే అంటు సంబంధం ఖాయం అయిపొయింది తమ కూతురు కి మంచి వ్యక్తి భర్త గా రాబోతున్నాడు అన్న తృప్తితో ఇంటికి వెళ్తారు శేఖర్, శాంతి…

 

continued…