ఆమె మాటల్లో కూడా నిజం ఉండడం తో శేఖర్ గారు కూడా ఏమి మాట్లాడరు.. శాంతి, యశోద గార్లు ఇద్దరు కూడా హ్మ్ సరే రేపు స్కూల్ లో చెప్పి కనీసం ఎల్లుండో, మరుసటి రోజు అయిన షాపింగ్ కి వెళ్లేలా చూడు..
ఇంకా ఆలస్యం చేస్తే పెళ్ళి సమయానికి బట్టలు కుట్టడం అవదు అని చెప్తారు..
ఆ మాటలకి అలాగే అన్నట్టుగా తల ఊపుతుంది ప్రతిమ..
హ్మ్ సరే అన్నయ్య, వదిన ఇక నేను బయలు దేరుతాను.. ప్రణయ్ పొలం నుండి ఇంటికి వచ్చేసి ఉంటాడు..
వాడు ఇంటికి వచ్చేసి నేను ఇంట్లో లేకుంటే కంగారు పడతాడు.. నేను ఇంటికి వెళ్లిన భరత్ బాబు కి ఫోన్ చేసాక మీకు టైమ్ చెప్తాను అని ప్రతిమ కి కూడా చెప్పి అక్కడ నుండి ఇంటికి వెళ్ళిపోతారు యశోద..
యశోద గారు అనుకున్నట్టుగానే ఆవిడ ఇంటికి వెళ్లేసరికి ప్రణయ్ ఇంటికి వచ్చి ఇంట్లో ఎక్కడ తల్లి జాడ కనిపించక ఇళ్లంత వెతికి అమ్మ అమ్మ ఎక్కడ వున్నావ్ నువ్వు అంటు ఇంట్లో నుండి బయటకి వచ్చి పెరటి వైపు వెళ్ళబోతాడు తల్లిని పిలుస్తూ..
అప్పుడే ఇంట్లోకి వస్తున్న యశోద గారు కొడుకు పిలుపుకి హ్మ్ ప్రణయ్ వచ్చేసినట్టున్నాడు గా అనుకుంటూ కాళ్ళకున్న చెప్పులు విడిచి కాళ్ళు కడుక్కుంటూ ప్రణయ్ నేను ఇక్కడే వున్నాను అని చెప్తుంది..