తల్లి గొంతులో వినిపించిన బాధకి అయ్యో అమ్మ నాకు ఇప్పుడు ఏమి కాలేదు.. ఎండలో పని చేస్తున్నప్పుడు ఈ మాత్రం తల నొప్పి కూడా రాకుండా ఎలా ఉంటుంది చెప్పు..
అయిన ఒకప్పట్లో అన్ని కష్టాలు, బాధలు పడి వచ్చాము కాబట్టే కష్ట, సుఖాల విలువ, డబ్బులు విలువ, మనుషులు, బంధువులు అన్నిటి విలువ తెలుసుకున్నాము..
నాకు అన్నిటి విలువ తెలుసు కనుకే ఈరోజు ఏదో చేతిలో రూపాయి వుంది కదా అని వాటిని విచ్చలవిడిగా ఖర్చు పెట్టేస్తే రేపన్న రోజు మళ్ళీ కష్టం రాదని మనం చెప్పలేము కదా..
ఇప్పుడు వున్నాయి కదా అని అవసరం లేని వాటికీ వృధా గా ఖర్చు పెట్టేస్తే నిజంగానే పరిస్థితులు బాగా లేనప్పుడు మనకంటూ చేతిలో ఏమి మిగలదు..
మన కుటుంబాన్ని నేను మళ్ళీ అలంటూ దుస్థితి లో చూడాలి అనుకోవడం లేదు.. అందుకే కష్టమో, సుఖమో నేను ఒకడినే పడుతాను..
అవసరం లేని చోట మనుషుల్ని పిలిచి డబ్బుని వృధా చేయలేను.. నువ్వు నా గురించి వదిలెయ్యమ్మా.. నేను మరీ అంత ఎక్కువగా ఏమి కష్ట పడడం లేదులే..