ఆవిడ మాటలు విన్న తరువాత ఓహ్ అవునా.. అయినా ఆ అమ్మాయి చెప్పింది నిజమె గా ఉన్నట్టుండి సెలవు కావాలి అంటే ఎవరు మాత్రం ఇస్తారు..
ముందుగా ఒకమాట అయిన చెప్పకుండా.. తను అన్నట్టు రేపు స్కూల్ లో అడిగి చూస్తుంది లే.. రేపు కాకుంటే ఎల్లుండు కి అయిన ఇవ్వరా ఏంటి.. ఆరోజే అందరు కలిసి వెళ్లి రండి అని చెప్పి ఫ్రెష్ అవ్వడానికి తన గదిలోకి వెళ్లి పోతాడు అతను..
ఉదయం లేవగానే తన పర్సనల్ పనులు పూర్తి చేసుకుని కాస్తంత తినేసి పొలానికి వెళ్ళిపోయాడు ప్రణయ్..
భరత్ తను చెప్పిన టైమ్ కి రావడం తో అంతకముందే పొలం పని చూసుకుని వచ్చిన శేఖర్ గారిని తీసుకుని టౌన్ కి వెళ్తాడు..
ఎప్పటిలానే స్కూల్ కి రెడీ అయిన ప్రతిమ తన బ్యాగ్, ఫోన్ తీసుకుని బయటకి వెళ్తుండగా తన ఫోన్ రింగ్ అవుతుంది..
దాంతో ఫోన్ వైపు చూసిన ప్రతిమ అందులో కనిపించిన నెంబర్ చూడగానే ఆమె మొహం లో సంతోషం వస్తుంది..