ఆమె గొంతులోని ఎక్సయిట్మెంట్ ని కనిపెట్టిన సీత హహహ అని నవ్వుతు హా ప్రతిమ నేను ప్రణయ్ అన్నయ్య గురించి మా అన్నయ్య తో మాట్లాడాను..
ఆ విషయం చెపుదాం అనే మీ ఇంటికి వద్దాం అనుకున్నాను.. బట్ మీ ఇంటికి వస్తే అక్కడ మీ అమ్మ, నాన్న వుంటారు కదా..
వాళ్ళ ముందు మనం ఈ మాటలు మాట్లాడుకోవడం మంచిది కాదు అని ఇంటికి రావాలి అనుకున్న ఆలోచనని వదిలేసాను.
అందుకే విషయం ఇంటికి వచ్చి చెప్పడం కంటే ఫోన్ లో చెప్పడం మంచిది అనిపించి నీకు ఫోన్ చేశాను అని చెప్తుంది సీత..
ఆమె మాటలు విన్న వెంటనే హ్మ్ అది నిజమేలే కాని నువ్వు అసలు విషయం చెప్పవే బాబు.. నాకు నువ్వేం చెప్తావో వినాలి అన్న క్యూరియాసిటీ పెరిగి పోతుంది అని ఆత్రం గా అడుగుతుంది ప్రతిమ..
హహహ నువ్వు మరి అంత టెన్షన్ పడాల్సింది ఏమి లేదు పాపా… నేను నీకు గుడ్ న్యూస్ చెప్పడానికే కాల్ చేశాను అని నవ్వుతు చెప్తుంది సీత..