బట్ తన మొబైల్ లో రీఛార్జ్ అయిపోయిందని తెలియడంతో సీత బిక్క మొహం వేస్తుంది.. అయ్యో ఇప్పుడెలా నేను వెంటనే ప్రతిమ కి విషయం చెప్పాలి అనుకుంటే ఇలా అయిందేంటి..
ప్రణయ్ అన్నయ్య క్యారెక్టర్ గుడ్ అని, అతనికి నో బ్యాడ్ హ్యాబిట్స్ అని తెలిస్తే అది కూడా పీస్ ఫుల్ గా ఉంటుంది అనుకుంటే ఇప్పుడే ఈ రీఛార్జ్ అయిపోవాలా అని తన ఫోన్ నీ తిట్టుకుంటూ..
నా ఫోన్ లో బ్యాలన్స్ లేకుంటే ఏమి అన్నయ్య ఫోన్ వుంది గా.. తన ఫోన్ లో నుండి చేద్దాం అనుకుని తన రూమ్ లో నుండి బయటకి రాబోయి వెంటనే ఏదో గుర్తొచ్చినట్టు వద్దులే అన్నయ్య నెంబర్ తో ఫోన్ చేస్తే ఆ ఫోన్ ఒకవేళ శేఖర్ మావయ్య ఎత్తాడే అనుకో లేని పోనీ తల నొప్పి..
అసలే శేఖర్ మావయ్యకి ఆడపిల్లలు ఒక వయసు వచ్చిన తర్వాత అబ్బాయిలతో ఫోన్ లు మాట్లాడడాలు, బైక్ ల మీద తిరగడాలు లాంటివి నచ్చవు..
అలాంటిది అన్నయ్య నెంబర్ ప్రతిమ ఫోన్ లో చూసి ఏవేవో ఊహించుకుని తనని ఏమైనా అంటే అది బాధ పడుతుంది..
నా వల్లే ఇలా జరిగింది అని నేను గిల్టీ గా ఫీల్ అవ్వాలి.. సో అన్నయ్య నెంబర్ తో వద్దు.. రేపు నా ఫోన్ కి రీఛార్జ్ చేసుకుని నేనే కాల్ చేసి మాట్లాడతాను.