కాల్ కట్ అయిన వెంటనే చా ఇలా అయిందేంటి.. నేను ఏదో అనుకుంటే ఇక్కడ ఇంకేదో జరుగుతుంది.. ఇలా అయితే ఎలా..
నేను ఈ పల్లెటూరులో ఆ వ్యవసాయం చేసుకునే వాడినే పెళ్ళి చేసుకుని నేను కూడా బురద చేలల్లో పనులు చేసుకుంటూ బతకాల..
వామ్మో ఆ ఊహ కూడా నేను భరించలేక పోతున్నాను.. నేను ఎట్టి పరిస్థితుల్లోను ఈ పల్లెటూరి రైతు నీ పెళ్ళి చేసుకోకూడదు..
నేను జీవితాంతం ఎలాంటి ఎంజాయ్ మెంట్ లేకుండా పొలాల గట్ల చుట్టు తిరుగుతూ బతికేయ్యలేను..
అసలు ఆ అబ్బాయికి చదువు కూడా పెద్దగా లేదు.. అందం గా ఉంటాడో లేదో కూడా తెలియదు.. అసలు అతడు పెద్దవాడు అయ్యాక నేను అతన్ని సరిగా చూసింది కూడా లేదు..
ఎప్పుడు నేను అతనికి,నాకు పెళ్ళి అన్న యాంగిల్ లో ఎప్పుడు ఆలోచించను కూడా లేదు కనుక అతను నా సమీపంలో నుండే వెళ్తున్న పట్టించుకున్నది లేదు..