అక్కడ పని పూర్తయ్యాక మళ్ళీ తిరిగి పెళ్ళి కార్డ్స్ షాప్ దగ్గరకి వెళ్తారు.. అప్పటికే కార్డ్స్ ప్రింట్ చేసి రెడీ గా ప్యాక్ చేసి ఉండడం తో ఒకసారి చెక్ చేసుకుని అంత ఓకే అనుకున్నాక అమౌంట్ పె చేసేసి కార్డ్స్ బ్యాగ్స్ తీసుకుంటారు..
అవి తీసుకుని బయటకి వచ్చాక భరత్ బాబు ఎలాని టౌన్ కి వచ్చే వున్నాము… సరుకుల లిస్ట్ కూడా మన దగ్గరే వుంది..
మళ్ళీ మళ్ళీ రావడం కంటే వచ్చినప్పుడే ఒక్కో పని పూర్తి చేసుకోవడం మంచిది అని నా ఉద్దేశం.. అందుకే మనం ఇప్పుడే సరుకులు కూడా తీసుకుని వెళ్తే పనిలో పని అయిపోతుంది ఏమంటావ్ అంటారు..
సరైన ఆలోచన బాబాయ్ అలానే చేద్దాం అంటు తన బైక్ నీ అన్ని సరుకులు వుండే ఒక పెద్ద జనరల్ స్టోర్స్ దగ్గర ఆపుతాడు భరత్..
బైక్ ని పక్కన ఆపేసి లాక్ చేసి కీస్ తీసుకుని కిందకి దిగుతాడు భరత్.. అంతక ముందే బైక్ దిగిన శేఖర్ గారు పెళ్ళి కార్డ్స్ వున్న బ్యాగ్స్ నీ పట్టుకుని షాప్ లోపలికి నడుస్తుంటారు..
ఆస్థాన వెనకే భరత్ ఫాలో అవుతాడు.. లోపలకి వెళ్లి తమ దగ్గర వున్న రెండు సరుకుల లిస్ట్ లు తాలూకు పేపర్స్ అక్కడ వున్న కుర్రాడి చేతికి అందిస్తారు..
ఆ కుర్రాడు ఆ లిస్ట్ ల్లో వున్న సరుకులు అన్ని ఎవరికి వారీగా ప్యాక్ చేసి పక్కన పెడతాడు..