ఆటో లో నుండి కిందకి దిగుతున్న భర్త ని చూసి ఇదేంటి ఈయన ఆటో లో నుండి దిగుతున్నారు.. వెళ్ళేటపుడు భరత్ బాబు తో కలిసి బండి మీద వెళ్లారు..
ఇప్పుడేమో ఆటో లో వస్తున్నారు.. ఈయన ఆటో లో వస్తే భరత్ బాబు ఏమయినట్టు.. ఇంతకీ ఈయన ఆటో లో ఎందుకు వచ్చినట్టు అని అనుకుంటూ ఉండగానే భరత్ బైక్ వచ్చి ఆటో వెనక ఆగుతుంది..
అది చూసిన శాంతి గారు ఓహ్ భరత్ బాబు కూడా వచ్చాడా… భరత్ బాబు ఈయన వెనకే వచ్చేలా ఉంటే ఈయన ఎందుకు భరత్ బాబు బండి మీద కాకుండా ఆటో లో వచ్చినట్టు ఏమైందబ్బా అనుకుంటూ ఆటో కీ సమీపంలోకీ వెళ్తారు…
ఈవిడ ఆటో దగ్గరకి వెళ్లేంతలో భరత్, ఆటో అతను కలిసి సరుకుల మూట ని కిందకి దించుతూ వుంటారు.. శేఖర్ గారు పక్కన నిల్చుని పెళ్ళి కార్డ్స్ వున్న ఒక బ్యాగ్ ని తీసుకుని అవి తమవో కాదో చూసుకుంటూ వుంటారు..
భరత్ మూట ని దించి ఆటో అతని హెల్ప్ తో ఇంట్లోకి తెస్తుండగా అది చూసిన శాంతి గారు ఓహ్ ఏవో వస్తువులు తెచ్చినట్టు వున్నారు.. అందుకే ఆటో లో వచ్చారు అనుకుంటారు..
భరత్ మూట ని పెట్టేసి వస్తు ఉండగా భరత్ బాబు మంచి నీళ్లు తాగుదువు గాని ఇంట్లోకి రా బాబు అని పిలుస్తారు శాంతి..